Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

TANA Conference : తానా సభల్లో ఎందుకు తన్నుకున్నారు? జూ.ఎన్టీఆర్, లోకేష్ లకు ఏం సంబంధం?

TANA Conference : దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష కాని ప్రాంతం.. ఇలాంటి చోట ఎంత హుందాగా ఉండాలి.. మరెంత ఐకమత్యాన్ని చాటాలి. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి’ అనే దేశభక్తిని ఎల్లెడల చాటాలి. కానీ ఇవేవీ వారికి పట్టలేదు. పైగా దేశం గాని దేశం.. ఆ సోయి వారిలో లేదు. సభ్య సమాజం ఏమనుకుంటుదన్న ఇంగితం లేకుండా తన్నుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. వినలేనంత స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? మీరూ చదివేయండి.

పరస్పరం కొట్టుకున్నారు

అమెరికాలో ప్రస్తుతం తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభలు జరుగుతున్నాయి. పరుచూరి తరని, వేమన సతీష్‌కు చెందిన రెండు వర్గాలు అక్కడ ప్రబల శక్తులుగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలకు కూడా రాజకీయ అండదండలున్నాయి. ఈ రెండు వర్గాలు కూడా పరస్పరం పోటీకి దిగడం, బలప్రదర్శన చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. తానా వేడుకల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం ఈ రెండు వర్గాల పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నాయి. దుర్భాషలాడుకున్నాయి. ఈ రెండు వర్గాలు కూడా టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం అక్కడ ఉండగానే.. పరస్పరం కొట్టుకోవడం విశేషం.

సుదీర్ఘ చరిత్ర

తానాకు అమెరికాలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అక్కడ 23వ సభలు జరుగుతున్నాయి. పెన్సిల్వేనియాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, సినీనటుడు నందమూరి బాలకృష్ణ్ణ, తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. తర్వాత బాంకెట్‌ డిన్నర్‌ చేశారు. ఇది ముగిసిన తర్వాత తానాలోని ప్రముఖులు కన్వెన్షన్‌ సమీపంలోని హాలు వద్ద కలుసుకున్నారు.

అదే కారణం

బాంకెట్‌ డిన్నర్‌ తర్వాత తానా ప్రముఖులు కలుసుకోవడం ఆనవాయితీ. ఇక్కడ తెలుగు దేశం పార్టీకి చెందిన కొన్ని విషయాలను పరుచూరి తరని, వేమన సతీష్‌కు చెందిన రెండు వర్గాలు ప్రతిపాదించాయి.  తానా సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ నాయకులు దాడి చేసినట్టు సమాచారం. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడొ కలబడి కొట్టుకున్నారు. టీడీపీ మీటింగ్ లో జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతో రెచ్చిపోయిన లోకేష్ అభిమానులు. టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు. టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే జరిగిన కొట్లాట. రెండుగా చీలి పిడి గుద్దు లు గుద్దుకున్న టీడీపీ ఎన్ఆర్ సభ్యులు అందరినీ అవాక్కయ్యేలా చేశారు.   ఈ విషయాలకు సంబంధించి ఇరు వర్గాల ఏకాభిప్రాయానికి రాలేదు. ముందు రెండు వర్గాలు పరస్పరం మాటలు అనుకున్నారు. తర్వాత సహనం కోల్పోయి కొట్టుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకున్నారు. చొక్కాలు చించుకున్నారు.  . కాగా ఈ గొడవ జరుగుతుండటంతో సమీపంలో కర్రలు ఉండగా కొంతమంది వాటిని విసిరేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Share the post

TANA Conference : తానా సభల్లో ఎందుకు తన్నుకున్నారు? జూ.ఎన్టీఆర్, లోకేష్ లకు ఏం సంబంధం?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×