Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

'మోరల్ పోలిసింగ్ ' చేసిందని ముసలమ్మను చంపిన 'పక్కింటి నాగరాజు'.!!





                                ఆమెపేరు గుదిగొండ చుక్కమ్మ. ఆమెకు 75 సంవత్సరాలు . వెనుకటి తరం మనిషి కాబట్టి,  కొంచం సాంప్రదాయపు కట్టు బాట్లు కలిగిన వృద్దురాలు . అందుకే తన ఎదుటనే ,వివాహిత అయిన తన మనవరాలితో ,పక్కింటి పోరంబోకు వాడు వచ్చి చనువుగా మసులుతుంటే సహించలేక పోయింది. "మీకిదేమి పొయే కాలం "అని ఇద్దరినీ కేకలేసింది . అంతే కాదు ,"మీ ఆవిడని అదుపులో పెట్టుకో ,లేకపోతె నీ కాపురం కూలిపోతుంది "అని మనవరాలి మొగుడికి హితబోద చేసింది . దాని పర్యవసానం,మనవడు మనవరాలికి మద్య తగాదాలు జరిగి ,మనవరాలు పుట్టింటికి వెలితే ,మనవడు ఖమ్మం వెళ్లి పోయి అక్కడే ఉండటం ప్రారంబించాడు . పక్కింటి వాడి వలనే తన మనవరాలి కాపురం లో సమస్యలు వచ్చాయని అందరితో చెప్పి వాపోయింది చుక్కమ్మ.

 చుక్కమ్మ వలననే పక్కింటాయన  పెళ్ళాం తో తన కున్న చనువు బందం తెగిపోయిందని తెగ బాద పడిపోయిన ,పక్కింటి నాగరాజు ,తన స్నేహితుని సంప్రదించి ,ఒక రోజు ముసల్లమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి జొరబడి ఆమె గొంతు నులిమి చంపి ,అ నేరం దొంగతనానికి వచ్చిన వారి వల్ల జరిగిందని పోలీసులను నమ్మించడానికి , హత్యానంతరం చుక్కమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసు ఇతర ఆభరణములు తీసుకు వెళ్ళారు .కాని పాపం పండి పోలిస్ విచారణలో నిజాలు వెలుగులోకి రావడం ,నిందితులిద్దరు కటకటాలోకి వెళ్ళడం జరిగాయి .ఈ సంఘటణ ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది . పూర్తీ వివరాలకు క్రింది చిత్రం చూడండి . 
                                                                         

చెడును వినకు ,కనకు ,చెప్పకు అని గాంది గారి మూడు కోతుల బొమ్మలు చెప్పే సూక్తి . మనుషుల చిత్తం కోతి  కంటే చపలంగా మారిన నేటి కాలం లో , నైతిక జీవనం అంటే భరించలేనిదిగా మారింది . ఇంట్లో పెద్దలు, ముక్యంగా ముసలి వారు  ఇంట్లో ఏమి జరుగుతున్నా "మూడు కోతులు" మాదిరి సైలెంట్ గా ఉండాలి కాని సుద్దులు చెపితే ఊరుకునే స్తితిలో లేరని పై ఉదంతం తెలియ చేస్తుంది .  నేటి యువతలో కొంతమందికి అసలు నచ్చని మాట "మోరల్ పోలిసింగ్ ". అలాంటి వాడే పైన చెప్పిన పక్కింటి నాగరాజు. ఇలాంటి వారే మోరల్ పోలిసింగ్ అంటే అంతెత్తున ఎగిరి పడుతుంటారు .  అందుకే చుక్కమ్మను హత్య చేసి తన కసి తీర్చుకున్నాడు . మరి అతనికి ఎలాంటి శిక్ష పడుతుందో కాలమే నిర్ణయించాలి . ఒకవేళ చుక్కమ్మ చెప్పకపోయినా , విచ్చలవిడితనం అనేది ఆ  రోజు కాక పోయినా ,ఇంకొకనాటికైనా  సమాజానికి తెలియక పోదు .తెలిసిన నాడు కాపురాల్లో కలతలు తప్పవు. 
అలా జరుగ కూడదనె చుక్కమ్మ లాంటి పెద్దల ముందుచూపు మాట . అదే  మోరల్ పోలిసింగ్ అయితే  సమాజం లో మోరల్ పోలిసింగ్ ఉండాల్సిందే .

                                                (22/3/2015 Post Republished). 
  

     


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

'మోరల్ పోలిసింగ్ ' చేసిందని ముసలమ్మను చంపిన 'పక్కింటి నాగరాజు'.!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×