Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

🐝🌻వనవిహారం 🌵🐛- ప్రతిక్షణం చూసిన సినిమానే చూడ్డానికి దేవుడేమన్నా తెలుగు సినిమా మేకరా?

ముళ్ళపూడి వెంకటరమణగారి అప్పుల అప్పారావు చెప్పిన ఫేమస్  డైలాగుల్లో ఒకటి – “సూర్యుడెందుకు ఉదయిస్తాడు? నదులెందుకు ప్రవహిస్తాయి? వెన్నెలెందుకు కాస్తుంది? అందుకే  అప్పారావు అప్పులు చేస్తాడు,” అనేది. రాజబాబు నోటఎంచక్కా పలికిన యూనివర్సల్ ఫాక్ట్ . 

అప్పులు చెయ్యడం అనేది ప్రకృతి సహజధర్మాల్లో ఒకటని అర్ధం చేసుకోడానికి ఇంతకంటే సహజమైన సులభమైన వివరణ ఎక్కడా లేదేమో? కానీ ప్రకృతి ఒడిలో మైమరిచిపోయే క్షణాల్లో మనిషికి, అందులోనూ తెలుగు మనిషికి  ‘కలాపోసన’ ఆటోమేటిగ్గా వచ్చేసే అసంకల్పిత ప్రతీకార చర్య. అప్పారావుకి అప్పులు చెయ్యడం ఎంత సహజమో అంత సహజమైన విషయం అది. ఆ కలాపోసనలో భాగంగా భలే భలే అందాలూ సృష్టించావూ, ఇలా మురిపించావూ అంటూ దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం, అసలెందుకు ఇవన్నీ ఇలా ఇంతందంగా… అంటూ భావావేశం ప్రకటించుకుంటాం. దాంతోపాటు కాస్త భావకవిత్వం ప్రవహించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇంచుమించు అలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యల్ని ప్రేరేపించినా కొన్ని దృశ్యాలు నిన్న చూశాను, మా Sungei Buloh mangroves
(మడ అడవి) లో. ఆ చూడ్డంలో   సూర్యుణ్ణి రోజూ ఉదయించమని తొందరపెట్టే అర్జెంట్లూ  వారెంట్లూ  ఏంటో తెలిసిందనిపించింది.  
అప్పారావు అప్పులకి, నదులు ప్రవహించడానికీ, వెన్నెల కాయడానికీ ,… కూడా ఇలాంటివే ఏవో కారణాలుండచ్చు. అవేంటో తర్వాత చూద్దాం.  ముందు పెత్యక్ష నారాయుడి పొద్దు పొడుపు హడావిడి ఏంటో, ఎందుకో చూద్దాం. 


ప్రభాత కిరణాలతో  అలల ని స్పృశించాలనే ఆరాటంతో … 

ఇబిరిత (Hornbill) పక్షి రెక్కల  అంచుల గుండా  ప్రసరించి  కొత్త కాంతులు  సంతరించుకోవాలనీ ...

రంగు రంగుల  తూనీగల  రెక్కలపై నర్తించలే ని వెలుగులు వెలుగులా ? అనీ ... 

అలలపైనా , గాలి తెరలపైనా  జరిగే తెల్ల కొంగల బాలె  (ballet)కి తొలికిరణాల వేదిక నిర్మించాలనీ  …. 

ప్రత్యక్ష నారాయుడు ప్రతిరోజూ పరిగెత్తుకొస్తాడనిపించింది. 

His own mornings are new surprises to God అంటాడు విశ్వకవి Stray Birds అనే పద్య సంకలనంలో. అవును కదా? ఈ చరాచర సృష్టి అంతటినీ సృష్టించడానికి సృష్టికర్తకి ఇంతకంటే కారణం కావాలా? జరామరణ చక్రాన్నీ, అందులో పడి కొట్టుమిట్టాడడా నికి మనుషుల్నీ సృష్టించి ప్రతిక్షణం చూసిన సినిమానే చూడ్డానికి దేవుడేమన్నా తెలుగు సినిమా మేకరా?

 


This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

🐝🌻వనవిహారం 🌵🐛- ప్రతిక్షణం చూసిన సినిమానే చూడ్డానికి దేవుడేమన్నా తెలుగు సినిమా మేకరా?

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×