Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వ🦌న🌳వి🐾హా🌾రం🦋 – Kingfisher గురించి(1)

Kingfisher అనగానే ఆ పేరు పెట్టుకున్న ఒక పక్షి కంటే ముందు పదకొండు వేల కోట్లకి బాంకుల్ని ముంచేసి యూకే చెక్కేసిన ఒక టైకూన్, మూతబడిన ఒక ఎయిర్ లైన్, ఒక బీరు బ్రాండు గుర్తొస్తాయి.

మీడియాని ఫాలో అవ్వదు కానీ ఈ పిట్టకి తన పేరు మీద ఆ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఎన్ని వివాదాలు సృష్టించాడో తెలిస్తే పేరు మార్చేసుకుంటుందేమో.

Kingfisherకి తెలుగులో –
చల్లముద్దపక్షి

చల్లకవ్వపుపిట్ట

పచ్చరేకపిట్ట

మీలపల్లేంక పులుగు

లకుముకి పిట్ట

అని పేర్లున్నాయి, according to ఆంధ్రభారతి.
ఫొటోలో వున్న పిట్టకి ఆ తెలుగు పేర్లలో ఏది కుదురుతుందో కానీ ఇంగ్లీషులో మాత్రం Stork-billed Kingfisher అని పెట్టారు. అంటే కొంగముక్కు లకుముకి అనచ్చేమో.

ఇండియా నుంచి ఆగ్నేయాసియా వరకూ చాలా చోట్ల కనబడుతుంది(ట). నాకు మాత్రం మా వూళ్ళో సంగీబులో వెట్-లాండ్స్ లో కనిపించింది.

మీకు ఎక్కడైనా కనిపిస్తే ఆ సంగతి ఇక్కడ కామెంట్ పెడతారా? ఫ్లీజ్



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

వ🦌న🌳వి🐾హా🌾రం🦋 – Kingfisher గురించి(1)

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×