Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గీత గాంధీయం – MY lines✍on Gandhi & Gandhi in MY lines🖌

Tags: agravedeg

చరిత్ర తిరగరాయడం అనేది మన దేశంలో ఎప్పట్నుంచీ వుందోగానీ ఆర్యన్ ఇన్వేజన్ నుంచీ అమరావతి నిర్మాణం వరకూ అన్నిట్నీ , ఎవరికి తోచినట్టు వాళ్ళం తిరగరాసేస్తున్నాం.

ఈ సంగతి నీకు అక్టోబర్2న గుర్తొచ్చిందేం బాబూ అంటారా?

బాపూజీ పుట్టిన్రోజు పూట ఎందుకు గుర్తొస్తుంది? ఆయన చరిత్ర కూడా భారతీయుల అసంకల్పిత ప్రతీకార చర్య అనదగ్గ ఈ నిరంతర ప్రక్రియకి గురౌతోందేమోననే సందేహం వస్తేనే గదా!! సో, ఆ సందేహం వచ్చింది.

మదామ్ తుసాడ్ మ్యూజియం వాళ్ళకి గాంధీ చేతిలో చీపురు పెట్టండని మోడీ మేష్టారు సలహా పారేసినప్పటి నుంచీ ఆ డౌటు పెరుగుతోంది. ఆహహా !! మోడీ గారి మీద కాదు, అసంకల్పిత చరిత్ర తిరగరాతలకి అలవాటు పడిపోయిన మన మీదే ఆ డౌటు.

ఎందుకంటే – – –

ఆయన దేశస్వతంత్రం కోసం కాదు మనిషి ఆత్మస్వతంత్రం కోసం పోరాడాడు అనేది మనం ఆల్మోస్ట్ మర్చిపోయాం కనక…

ప్రకృతి వ్యవసాయం గురించి ఐక్యరాజ్య సమితిలో మనం బల్ల గుద్దడానికి శతాబ్దం ముందే రాట్నం వడకమని చాటి ప్రకృతితో శాంతియుత సహజీవనం చెయ్యమన్నాడన్న విషయం మనకసలు గుర్తే లేదు కనక….

ఆయన చెప్పిన అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం సంగతి దేవుడెరుగు కనీసం ఆయన పాటించిన క్రమశిక్షణ, టైమ్ మానేజిమెంట్లని నేర్చుకోవడం సరే మనమసలు పట్టించుకోనేలేదు కాబట్టీ….

స్వతంత్ర భారతం అనే పసిబిడ్డకి అపరిగ్రహం అనే ఊతాన్నిచ్చి నడపాలనుకున్న ఆయన్ని మర్చిపోయి ఈ రోజు అవినీతి బురదలో కూరుకుపోయాం కాబట్టీ…

సెల్ఫ్ హెల్ప్ అనే కాన్సెప్ట్ మనకి అలవాటు చేద్దామని చీపురు చేతబడితే అదేదో రోడ్లూడ్చడానికే అవతరించాడన్నట్టు బిల్డప్ ఇస్తే ఈ సోషల్ మీడియాయుగంలో, చై.నా. చదువులు, చెత్త సినిమాలు చూపించని లోకం కూడా వుంటుందని తెలీని తరంలో ఆయన చరిత్ర మొత్తం తిరగబడిపోతుందేమోనని డౌట్ రాదా మరి? వచ్చింది.

అసలు నీకు బుద్ధుందా శాస్త్రీజీని మరిచిపోతావా అని ఎవరూ సున్నితంగా గుర్తు చెయ్యక ముందే చెప్పేస్తున్నా —

ఈ రోజే పుట్టిన గట్టిపొట్టివాడు లాల్‌ బహాదూర్ మనకి బహుదూరమైన క్రమంలో ఆయన చరిత్రని తిరగరాయడం కాదు పూర్తిగా పేజీలే చింపేసే ప్రయత్నం జరిగిందంటారు. నిజానిజాలు తేల్చడం మనవల్ల కాదని అందరికీ తెలుసు ఎట్ లీస్ట్ ఆయన మరణం వెనకున్న వివాదాన్ని రాజకీయాల కోసం చీటికీ మాటికీ తెర పైకి తీసుకు రాకుండా వుంటే బావుండు. కనీసం జవాన్లకీ, కిసాన్లకీ జై కొట్టి మరీ వాళ్ళని మోసం చెయ్యకుండా వుంటే చాలు.

గాంధీజీ!!శాస్త్రీజీ!!

⚘We wish many, No No No, Not many, but at least ONE happy return of you both to (y)our land⚘



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

గీత గాంధీయం – MY lines✍on Gandhi & Gandhi in MY lines🖌

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×