Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

KSD”అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని, రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి…

మొన్న మార్చిలో రెండు వారాల  చైనా ట్రిప్పు పడింది. సుజౌ సిటీ చుట్టుపక్కల మూడు రోజులు తెగ తిరిగాం, ఫౌండ్రీలు, ఫోర్జింగ్ షాపులు వగైరాలు విజిట్ చేస్తూ. ఆ తిరుగుడులో ఒక చోట అదుగో ఆ బుద్ధుడు కనిపించాడు.ఆదిశంకరాచార్యుడు, జీసస్‌‌‌‌ల ప్రతిరూపాలని చూసినప్పుడు ఎలాంటి అలౌకిక భావపరంపర మనసుని తాకుతుందో శాక్యమునిని చూసినా కలుగుతుంది. కలుగుతుంది కాదు మనసు కరుగుతుంది అంటే కరెక్టు. అలా కరిగిపోయినప్పుడు కలిగే  అనుభవం ఏంటంటే ఈ అస్తిత్వానికి కులం, మతం, దేశం, …. టు కట్ ఇట్ షార్ట్ .. మనని మనం చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి సెపరేట్ చేసుకోడానికి ఎన్ని రకాల సాకులుంటే అన్ని సాకులూ మాయమైపోతాయి. క్షణంలో సగం సేపే ఐనా ఆ ఆనుభూతి అద్వితీయం. కాదు, అద్వైతం. ఆ ఆద్భుతవ్యక్తుల ఆలోచనా పరంపర  వేల ఏళ్ళ తర్వాత ఇంకా నిలిచి వుందంటే అది వారి జీవితకాలంలో  వాళ్ళు తమ అనుయాయులకి కలిగించిన అద్వితీయ భావనలకి అద్వైత అనుభవానికి సాక్ష్యం అని నాకర్ధమైంది అని నేననుకుంటున్న వారి గొప్పతనం. లెటజ్ నాట్ గో టు వాట్ సమ్ ఆఫ్ దెయిర్ ఫాలోవర్స్ డు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాలోయింగ్ దెయిర్ ఫిలాసఫీస్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హియర్.

ఇప్పుడా బుద్ధుడు ఎందుకు గుర్తొచ్చాడంటే ఇవాళాయన బర్తు డే కదా! అది మర్చిపోకూదడనే సెలవు కూడా ఇచ్చారు కదా!! ఈ సందర్భంగా మానవజాతిని నిజంగా మెచ్చుకోవాల్సిన సంగతి – మహానుభావుడు అనుకున్న వ్యక్తి పుట్టినరోజుకి పబ్లిక్ హాలిడే ఇవ్వడం. ఆ రకంగా, “జీవితమంటే అంతులేని ఒక పోరాటం. బ్రతుకు తెరువుకై  పెనుగులాడుటే ఆరాటం..” అంటూ పాడుకోడానిక్కూడా టైము, ఛాన్సు కూడా లేని మనిషికి పోరాటాలకి, ఆరాటాలకి అవతల ఏముందోనన్న ఆసక్తి, కుతూహలం పెంచుకోడానికి, వీలయితే తీర్చుకోడానికీ ఒక అవకాశం ఇవ్వడం.  ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం. అది నెగెటివ్ థింకింగ్.

పోరాటాలకి, ఆరాటాలకి అవతల ఏముందోనన్న ఆసక్తి, కుతూహలంతో, ఈ ప్రపంచం అనే నాటకరంగానికి తెర వెనక కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం చేసే “అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని –

రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే,

అలా వెళ్ళిపోయి “తెర వెనక భాగవతం” అంతా తెలిసేసుకుని ఇవతలికి వచ్చి “ఒరేయ్! బాబుల్లారా! K.S.D “అప్పల్రాజు” సంగతలా వుంచండి. పరలోకంలో ప్రశాంతత కోసం ఈ లోకంలో అశాంతి సృష్టించక్కర్లేదురా! మీ పరలోక సుఖాల కోసం ఇతర జీవుల్ని పరలోకానికి పంపించాల్సిన పనిలేదురా! మీ బుద్ధిని వాడండి, మీ ధర్మాన్ని ఆచరించండి, మీ సంఘాన్ని ఆశ్రయించండి” అని బోధిస్తే

ఆయన కృషి అంతా ఈ రోజు మనకి ఒక హాలి డే రూపంలో ఎంజాయ్ చెయ్యడానికి, బిర్యానీ తిని, సినిమా చూడ్డానికి  ఉపయోగపడితే ఆయన ఫీలవ్వడూ?!? ఇవాళ మాయింట్లో బిర్యానీయే; అది ఆపలేదుగానీ పిల్లలు సినిమా చూద్దామని యూ ట్యూబ్ ఓపెన్ చెయ్యగానే మాత్రం సక్సెస్‌‌ఫుల్‌‌గా, శాంతియుతంగా ఆపించా. బుద్ధుడు ఫీలవ్వడనే ఫీలౌతున్నా. ఫీలౌతాడని మనసులో ఏ మూలో వున్న కాస్త అనుమానం, గిల్ట్ పోగొట్టుకోడానికి నాకు తెలిసిన “బుద్ధం శరణం గచ్ఛామి….”కి నాకు తోచిన ఎక్స్ప్లనేషన్ ఇలా రాసుకుని ….

బంధుమిత్రులతో వాట్సాప్‌‌లో పంచేసుకున్నా. చూసినవాళ్ళు చిన్ముద్రలు  పెట్టారుగానీ చివాట్లు పెట్టకపోడంతో  అందరికీ నచ్చిందనే అనుకున్నా. ఒక ఫ్రెండు బుద్ధతత్వాన్ని ఇలా జ్ఞానకర్మ యోగాలతో ఇలా ముడి పెట్టాడు – Three layers of human life. Self, dharma and society. All three layers have their importance. Only when we follow our Dharma and work towards a righteous society, Karma yogam is fulfilled. By looking inwards gyana yogam is initiated. Karma yogam and Gyana yogam are inseparable. ఇది చూసి ఇంకాస్త ధైర్యం వచ్చి టపాలో పెట్టేశా.

(ఈ టపాకి టైటిల్‌‌గా ఆర్జీవీగారి సినిమా టైటిల్ ఎలా కుదిరిందో ఆ దేవుడికే తెలియాలి  ‌ )

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి

 



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

KSD”అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని, రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి…

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×