Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..! 1,56,437 ఉద్యోగాలకు ప్రస్తుతం నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, వయసు, ఎంపికవిధానం, విధివిధానాలతో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది, కానీ ఆ నోటిఫికేషన్ లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని తెలుపలేదు, కానీ ఆ జిల్లాలలో పోస్టులు ఎన్ని, అభ్యర్థుల ఎంపిక విషయాలను ఆయా జిల్లాల కలెక్టర్ లకు అధికారం కల్పించారు. 

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాల్లో 12 జిల్లాలలకు సంబంధించి అధికారికంగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే సమాచారం విడుదల కాగా ఒక్క ప్రకాశం జిల్లాలో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. 

ఇప్పటివరకు విడుదలయిన ఉద్యోగాల వివరాలు :
జిల్లా  పేరు
పంచాయతీల సంఖ్య
వాలంటీర్ ఖాళీలు
శ్రీకాకుళం
1143
11,924
విజయనగరం
919
10,012
విశాఖపట్నం
924
12,272
తూర్పు గోదావరి
1072
21,600
పశ్చిమ గోదావరి
909
17,881
కృష్ణా జిల్లా
980
14,000
గుంటూరు
1031
17,550
అనంతపురం
1029
14,007
చిత్తూరు
1372
15,824
కర్నూలు
909
12,045
కడప
791
9,322
ప్రకాశం
1002
-

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాలలోని  12,081పంచాయతీలలో 1,56,437 ఉద్యోగాలకు ప్రస్తుతం నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి, ఈ పోస్టుల సంఖ్య ఆ గ్రామంలో ఉండే కుటుంబాల సంఖ్యను బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

శాలరీ :  గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు  గౌరవ వేతనంగా నెలకు 5,000/- ఇవ్వనున్నారు. 

అర్హతలు : గిరిజ‌న ప్రాంతాల‌కు చెందిన వారికి ప‌దో త‌ర‌గ‌తి, గ్రామీణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్‌, ప‌ట్ట‌ణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ద‌ర‌ఖాస్తుదారులు స్థానికులై ఉండాలి. ఈ ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. 

 వయసు :  30 జూన్ 2019 నాటికి 35 సంవత్సరాల లోపు ఉండాలి, వయసు పరిమితిలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు అన్నికేటగిరీల అభ్యర్థులు 35 ఏళ్ల లోపు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు :  గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదా ఎక్జామ్ ఫీజు లేదు. 

ఎంపిక  విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్  లిస్ట్ చేసి, ఎంపిడివో చైర్మన్ గా తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సభ్యులుగా ఉన్న కమిటీ చేత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.  పనితీరు బాగాలేని వాలంటీర్ ను విధుల నుండి తొలగించే అధికారం కూడా వీరికి ఉంటుంది. 

అప్లై చేయు విధానం :  గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు http://gramavolunteer.ap.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

ముఖ్య‌మైన తేదీలు: 
         నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం: జూన్ 24 నుంచి జులై 5 వ‌ర‌కు.
         ఇంట‌ర్వ్యూ తేదీలు: జులై 11 నుంచి 25 వ‌ర‌కు.
         శిక్ష‌ణా కార్య‌క్ర‌మం: ఆగ‌స్టు 5 నుంచి 10 వ‌ర‌కు.
         వాలంటీర్ల నియామ‌క‌పు తేది: ఆగ‌స్టు 15.


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..! 1,56,437 ఉద్యోగాలకు ప్రస్తుతం నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×