Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆహ్వానించిన ఐక్యరాజ్యసమితి టిక్కెట్లు బాబునే కొనుక్కోమన్నదా?

Tags: agravedeg

చంద్రబాబును చూసి ‘ఐక్యరాజ్య సమితీ’ అవాక్కు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వ్యవసాయ రంగంలో ఉన్న అపార అనుభవం గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఆయన్ను ‘ముఖ్య అతిధి’గా పిలిచిందా?. పిలిస్తే ఆయన టిక్కెట్లు..బస సౌకర్యాలు అన్నీ అదే చూసుకోవాలి కదా?. ఏ ప్రముఖుడిని పిలిచినా అలాగే చేస్తారు కదా?. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లొచ్చిన చంద్రబాబు ఆ సర్కారుకు అత్యంత ‘ఖరీదైన బిల్లు’ను బహుమతిగా అందజేసి వచ్చారు కదా?. మరి ఇక్కడ ఏంది?. ప్రభుత్వం జీవో జారీ చేసి..చంద్రబాబు అమెరికా ఖర్చు అంతా ఏపీ సర్కారుకు చెందిన ‘ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు’ భరిస్తుందని చెప్పిందా?. అంటే మీరు మీ ఖర్చుతో వచ్చి..ఇక్కడే ఉండి మా దగ్గర మాట్లాడి పోండి అని ఐక్యరాజ్యసమితి వంటి సంస్థ చెబుతుందా?. అంటే ఏ మాత్రం నమ్మటానికి వీల్లేదు. మరి అసలు ఏమి జరిగింది?. అసలు ఏంటీ ఈ కథ అంతా? ‘ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం రాలేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి అరుదైన అవకాశం దక్కలేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత గ్రేటో చూడండి. అదీ చంద్రబాబు సత్తా. స్థాయి. చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన..అద్భుతమైన అవకాశం దక్కినందుకే మోడీ, అమిత్ షా అందరూ కలసి కుట్ర పన్ని పాత బాబ్లీ కేసులో ఇప్పుడు  నోటీసులు ఇప్పించారు.

మోడీ కంటే చంద్రబాబుకు ఎక్కువ పేరొస్తొందనే ఈ పనిచేశారు’ అంటూ టీడీపీ నేతలు ఈ మధ్య కాలంలో తీవ్ర  స్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం సోషల్ మీడియా అయితే ఆ ఆహ్వానాన్ని బహిర్గతం చేస్తూ..ఇదుగో చూస్కోండి చంద్రబాబు సత్తా అంటూ ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. ఐక్యరాజ్య సమితి వేరు…ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ వేరు. ఛంద్రబాబుకు ఆహ్వానం పలికింది ఐక్యరాజ్య సమితి కాదు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రొగ్రామ్ (యుఎన్ఈపీ) అనే ఏజెన్సీ. అదేంటో వివరంగా మీరూ చూడండి.

‘The United Nations Environment Programme (UNEP) is an agency of United Nations and coordinates its environmental activities, assisting developing countries in implementing environmentally sound policies and practices.’ ఇదీ అసలు సంగతి. ఐక్యరాజ్య సమితి ఆహ్వానానికి  ఆ సంస్థకు చెందిన ఏజెన్సీ ఆహ్వానానికి తేడాను మర్చిపోయి మరీ టీడీపీ నాయకులు హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ‘అంతర్జాతీయ స్థాయి’కి చేరిన ఆయన ఇమేజ్ ను మరింత పెంచే పనిలో పడ్డారు. తమ ఏజెన్సీ ఆహ్వానం ఆసరా చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసుకుంటున్న ప్రచారం కూడా ఐక్యరాజ్యసమితి కూడా అవాక్కు అవ్వాల్సిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఆహ్వానించిన ఐక్యరాజ్యసమితి టిక్కెట్లు బాబునే కొనుక్కోమన్నదా?

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×