రవితేజ కొత్త సినిమా విషయంలో రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నా..కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతున్నారు. ఈ మాస్ మహారాజా తాజా సినిమా ‘రాజా ది గ్రేట్’ కలెక్షన్లు జోరుగా ఉన్నాయి. ఫస్ట్ రోజే సినిమా ఏకంగా పది కోట్ల రూపాయలు సాధించినట్లు ప్రాధమిక లెక్కలు బట్టి తెలుస్తోంది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుధవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి ప్రారంభించిన ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉన్న విషయం తెలిసిందే. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Related Articles
ఈ సినిమా రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజా ది గ్రేట్ సినిమా అమెరికాలోనూ మంచి కలెక్షన్లు రాబోడుతోందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. 95 ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 84.32 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు. వారం మధ్యలో విడుదలైనా ఓపెనింగ్స్ బాగున్నాయని, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరుగుతామని ఆయన అంచనా వేశారు.
The post దుమ్మురేపుతున్న ‘రాజా ది గ్రేట్’ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here