Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రాజమౌళికి రాజధాని..వి వి వినాయక్ కు పోలవరం!

ప్రభుత్వం వేరు. సినిమా వేరు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిర్ణయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాజధాని అమరావతికి సంబంధించి డిజైన్ల ఖరారు కోసం ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిని అవసరం అయితే లండన్ తీసుకెళ్ళాలని కొద్ది రోజుల క్రితం సీఎం అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజధాని కోసం రాజమౌళిని లండన్ తీసుకెళతారు…రేపు ఎప్పుడైనా చైనా..పాకిస్థాన్ లతో యుద్దం వస్తే ప్రభాస్ ను అక్కడకు పంపిస్తారా? వాట్సప్ ల్లో జోకులు పేల్చుతున్నారు. అంతే కాదు సుమా..ఇక్కడో కొత్త చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఏపీకి ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు సాగటం లేదు. బన్నీ సినిమాలో వి వి  వినాయక్ పోలవరం డ్యాం అతి వేగంగా నిర్మిస్తాడట.

                              సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. అందుకే రానున్న రోజుల్లో ప్రతిష్టాత్మక పోలవరం పనులు వినాయక్ కు అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇచ్చేస్తారా అని అడగకండి…బాహుబలి లో అద్భుతం గా సెట్లు, గ్రాఫిక్ లు వేసిన రాజమౌళి ని ప్రతిష్టాత్మక అమరావతి డిజైన్ లు చేయాలనగా లేనిది ..బన్నీ సినిమాలో ప్రాజెక్ట్ కట్టిన వినాయక్ కు పోలవరం పనులు ఇస్తే తప్పేంటి. చ్చితం గా ఎవరో ఒకరు ఈ ఐడియా నో, ప్రపోజలో ఇస్తారు…ఆ అప్పగింత కు మంత్రులు, అధికారులు వెళ్తారు. ఇది ఖాయం గా కనిపిస్తుంది.  కొన్ని విమర్శలు వ్యంగ్యం తో చెపితేనే కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి.

(వాట్సప్ లో హల్ చల్ చేస్తున్న జోకుల ఆధారంగా)

The post రాజమౌళికి రాజధాని..వి వి వినాయక్ కు పోలవరం! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

రాజమౌళికి రాజధాని..వి వి వినాయక్ కు పోలవరం!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×