ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు…రాజమౌళి రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం నాడు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళితో భేటీ అయి నార్మన్ ఫోస్టర్స్ తాజాగా అందించిన డిజైన్లు చూపించారు. మంత్రితో పాటు సీఆర్ డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్స్ అందించే డిజైన్లపై చంద్రబాబు ఏడాదిన్నరగా ఏవో ఒక మార్పులు చెబుతూ పోతున్నారే తప్ప..ఒక్కటీ ఖరారు చేయటం లేదు.
Related Articles
తాజాగా అందించిన డిజైన్లపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి సలహాలు..సూచనలు తీసుకోవాలని సూచించారు. అంతే కాదు..అవసరం అయితే రాజమౌళిని లండన్ తీసుకెళ్ళి నార్మన్ ఫోస్టర్స్ ఆఫీసులో కూర్చోపెట్టుకుని డిజైన్లు ఖరారు చేయాలని సూచించారు. అందులో భాగంగా మంత్రి నారాయణ, సీఆర్ డీఏ ఉన్నతాధికారులు రాజమౌళితో భేటీ అయ్యారు. వచ్చే నెలలో చంద్రబాబు లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్స్ ఆఫీసులో కూర్చుని డిజైన్లు ఖరారు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
The post రాజమౌళికి డిజైన్లు చూపించిన నారాయణ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here