Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అభిమానిని లాగిపెట్టి కొట్టిన బాలయ్య

Tags: agravedeg

సినీ హీరో..ఎమ్మెల్యే బాలకృష్ణ. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఎవరిని పడితే వాళ్లను కొట్టేయవచ్చా?. అది సినిమా ఫంక్షన్ అయినా…రాజకీయ సమావేశం అయినా?. ఎంత సినిమా హీరో అయితే మాత్రం కొట్టేస్తారా?. ఎమ్మెల్యే అయితే సర్వాధికారాలు ఉంటాయా?. ముఖ్యమంత్రి బావమరిది అయితే ప్రత్యేక హోదా ఉంటుందా?. బాలకృష్ణ తీరు చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓ కార్యకర్త లాగి పెట్టికొట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దండ వేసేందుకు..ఫోటో దిగేందుకు ముందుకొచ్చిన టీడీపీ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. బుధవారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన జరిగింది.

                             నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఆశపడిన ఓ టీడీపీ కార్యకర్త ఉత్సాహంగా ఆయన వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్తపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఘటనతో అవాక్కు అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పెట్టారు. విషయం బయటకు రావడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

The post అభిమానిని లాగిపెట్టి కొట్టిన బాలయ్య appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

అభిమానిని లాగిపెట్టి కొట్టిన బాలయ్య

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×