Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

APPSC Recruitment 2021: Horticulture Officer, Telugu Reporter Jobs



ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ)… ఏపీ హార్టికల్చర్‌ సర్వీస్‌లో.. హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► పోస్టులు: హార్టికల్చర్‌ ఆఫీసర్లు

► మొత్తం పోస్టుల సంఖ్య: 39

► అర్హతలు: హార్టికల్చర్‌లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ/ బీఎస్సీ ఆనర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. 

► ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహా పద్ధతిలో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌ నుంచి 50 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు– 100 మార్కులకు అర్హత పరీక్ష ఉంటుంది. దీనికి పరీక్ష సమయం 100 నిమిషాలు. పేపర్‌1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్‌2 హార్టికల్చర్‌–1, 150 ప్రశ్నలు– 150 మార్కులకు; పేపర్‌ 3, హార్టికల్చర్‌–2 150 ప్రశ్నలు– 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ మూడు పేపర్లకు ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం 150 నిమిషాలు కేటాయించారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021

► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021

► వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

ఏపీపీఎస్సీ– 05 తెలుగు రిపోర్టర్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)… ఏపీ లెజిస్లేచర్‌ సర్వీస్‌లో తెలుగు రిపోర్ట్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► పోస్టులు: తెలుగు రిపోర్టర్లు

► మొత్తం పోస్టుల సంఖ్య: 05

► అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌బీటీఈటీ హైదరాబాద్‌ నిర్వహించిన షార్ట్‌ హ్యాండ్, టైప్‌ రైటింగ్‌(తెలుగు)లో హయ్యర్‌ గ్రేడ్‌ అర్హతతోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్‌ హ్యాండ్‌ టైపింగ్‌ చేయాలి. 

► వయసు: 01.07.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ /ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
 
► ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీపై 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 2లో 150 మార్కులకు తెలుగులో షార్ట్‌హ్యాండ్‌ డిక్టేషన్, లాంగ్‌హ్యాండ్‌లో ట్రాన్స్‌స్క్రిప్షన్‌ టెస్ట్‌ ఉంటుంది. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2021

► దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021

► వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in 



Source link

The post APPSC Recruitment 2021: Horticulture Officer, Telugu Reporter Jobs appeared first on Tirupati Darshan Details.



This post first appeared on Tirupati Darshan Booking, please read the originial post: here

Share the post

APPSC Recruitment 2021: Horticulture Officer, Telugu Reporter Jobs

×

Subscribe to Tirupati Darshan Booking

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×