Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పావనచిత్తులకు మాత్రమే కనపడే - హిడెన్ సిటి

 హిడెన్ సిటి

హిమాలయాలలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పూర్తిగా ఇంతవరకు హిమాలయాల్లోకి ఈ ప్రపంచం లోని ఏ వ్యక్తి కూడా ప్రవేశించలేక పోయారన్నది వాస్తవం.
 పురాణాలు తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో "యతి" రూపంలో ఉన్నట్టు పెద్దలు చెబుతారు.
ఇక అసలు విషయంలోకి వెళితేకొన్ని పరిశోధనలు, మరికొన్నిభారతీయ.. బౌద్ధ గ్రంథాలలో రాసిన దాని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉందని తెలుస్తుంది. 
దాని పేరే "శంబాలా". దీనినే పాశ్చాత్యులు " హిడెన్ సిటీ"అంటారు.



వందలు, వేల మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న హిమాలయాలలొ మనుషులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అలాంటి వాటిలో ఈ శంబాలా ఒకటి.
అది అందరకి కనిపించదు, అది కనిపించాలన్నా, చేరుకోవాలి అన్నా మనం మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడాలి. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశం, ఎవరికి పడితే వారికి కనిపించదు.

'); }());
అక్కడ దేవతలు సంచరిస్తారు. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. చక్కటి సంప్రదాయాలకు కొలువు ఆ నగరం.
సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి శంబాలా ఉంటుంది. ఆ ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుంది.

పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుంది.
బౌద్ద గ్రంధాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు.
లోకం లో పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్య పురుషులు లోకాన్నితమ చేతుల్లో తీసుకుంటారు. అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుంది. ఆ కాలం 2424 లో వస్తుంది.



శంబాలా లొ నివసించేవారు ఏలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు, వారి ఆయువు మామూలు ప్రజలు కంటె రెట్టింపు ఉంటుంది, వారు మహిమాన్వితులు.
రష్యా 1920 లొ శంబాలా రహస్యాన్ని తెలుసుకొవడానికి తన మిలటరి ఫోర్సుని పంపి పరిశొధనలు చేయించింది. అప్పుడు శంబాలా కి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ వుండే యోగులు వారికి దాని పవిత్రత గురించి తెలిపారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930 లొ శంబాలా గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు.
 ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు. అంతే కాక హేన్రిచ్ హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు, విశేషాలు మానవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు.


గోభి ఎడారికి దగ్గరిలోని ఉన్న శంబాలానే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు తన కాలచక్రాలో రాసాడు.
శంబాలా గురించి ఫ్రాన్స్ కు సంబందించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ద మత అభిమాని, రచయత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్నిగ్రంథాలు రచించింది. 
'); }());

ఆమె తన 56 ఏళ్ళ వయస్సులొ ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 ఏళ్లు బ్రతికింది. ఆమె అక్టోబర్ 24, 1868 లొ జన్మించి సెప్టెంబర్ 8,1969 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లొ కాలుమోపిన తొలి యూరప్ వనిత ఆమె.

అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా శంబాలా పై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నాడు. ఆ ప్రాంతం ప్రపంచం లో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలీపతితో ప్రపంచం లొని ఎక్కడి వారితొ నైనా సంభాషించగలరు, ఎక్కడ జరుగుతున్న అభివృద్ది అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది, శంబాలా ఎనిమిది రేఖుల భారి కలువ పువ్వు ఆకారం లో ఆ నగరం ఉంటుందని తెలిపాడు.

హిట్లర్ తన ఆర్మీ ని అక్కడకు పంపి చాలా విషయాలు సేకరించాడు. అతనికి అద్బుతాలు అంటే చాలా ఇష్టం. అందుకే అతను వియన్నాలొ మంత్ర, యోగా విద్యలు నేర్చుకున్నాడు. ఆ ఆసక్తి తోనే అతను కొంత సంస్కృత కూడా నేర్చుకున్నాడు. శంబాలా గురించి పెక్కు సంఖ్యలలో రాయబడిన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి కుడా అతను సంస్కృతం నేర్చుకున్నాడు, ఆ కారణం గానే అతను తరువాత స్వస్తిక్ ముద్రను వాడేవాడు.
పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం శంబాలా వయస్సు ఆరు మిలియన్ సంవత్పరాలు.
ఇక్కడ ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారు.
విష్ణువు కుడా తన పదోవ అవతారం అయిన కల్కి కుడా శంబాలా నుంచే వస్తాడు. మాములుగా కనిపించని శంబాలాకి చేరుకోవడానికి బౌద్ద గ్రంథాలలో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి.

దాని ప్రకారం హిమలయాలలో ఎక్కడ ఉందో తెలియని శంబాలా నగరం చేరుకొవడానికి చాలా ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తుండగా తొలుత ఎడారి వస్తుంది. అదే గోభి ఎడారి. దాన్నిదాటిన తరువాత పర్వతాలు ఎదురు అవుతాయి. వాటిని కుడా దాటి హిమాలయాల నడిబోడ్డుకి రావాలి. అప్పుడూ శంభాలా కనిపిస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే అధ్యాత్మిక ధోరణి లేని వారు, పాప కర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయి.
అక్కడి ఆసాధారణమైన వాతావరణం వలన శంబాలా సంగతి అటుంచి మృత్యువు సంభవిస్తుంది అని బౌద్ద గ్రంథాలు తెలుపుతున్నాయి. మరి కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం వరకు శంభాలా టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహం తో కలిసి ఉండొచ్చని అంటారు.
పాశ్చాత్యులు ఈ ప్రదేశాన్ని "ప్లానెట్ప్ ఆఫ్ హెడ్ సెంటర్”, "ది ఫర్బిడెన్ ల్యాండ్", "ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని అంటారు. శంభాలాకు శ్వేత దీపం, ద్రువ లోకంతో పాటుగా 100 కు పైగా పేర్లున్నాయి.


This post first appeared on Traditional Hinduism, please read the originial post: here

Share the post

పావనచిత్తులకు మాత్రమే కనపడే - హిడెన్ సిటి

×

Subscribe to Traditional Hinduism

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×