Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సాలగ్రామ నిలయం..గండకీ నది !!!


సాలగ్రామ నిలయం..గండకీ నది !!!

గండకీ నది నేపాల్ లోని ముక్తినాథ్ కు కొంచెం ముందుగల దామోదర్ కుండం నుండి బయలుదేరుతుంది. 



ఈ నదీ క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారయ్యే విభిన్న రూపాలలో గల సాలగ్రామ శిలలు లభ్యమయ్యాయి.. మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ముక్తినాధ్ వద్ద, గండకీ తీరంలో నివసిస్తుంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని సాలగ్రామం అని కూడా వ్యవహరిస్తారు.
'); }());

ఈ నది లో దొరికే సాలగ్రామ శిలల అంతర్భాగంలో శంఖు చక్రాలుశివలింగంత్రిశూలం.. మొదలైన హిందూ దేవతల చిహ్నాలు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం సతీ తులసి శాపం వలన శ్రీమహావిష్ణువు శిలాకృతి దాల్చాడనిశిల అంతర్భాగం పురుగులు దొలిచే శాపం ఉందనీ ఒక నమ్మకం.
ఈ సాలగ్రామాల మహత్యంవిష్ణుపురాణంలో వివరించారు. వీటికి ప్రతీ రోజూఅభిషేకంపూజ చేస్తే ఇహపరాలు రెండూ లభ్యమవుతాయని ఒక నమ్మకం. గండకీ నది తీరంలో విలసిల్లిన ముక్తినాథ్ ప్రముఖ శక్తిపీఠం. ప్రస్తుతం ఆ దివ్యమందిరం ఉన్నచోట సతీదేవి యొక్క చెక్కిలి పడినట్లు చెబుతారు. అందుకే ఈ నది గండకీ పేరుతో పిలవబడుతోంది. ఈ నది బీహార్ లో ప్రవేశించి గంగానదిలో కలుస్తుంది


This post first appeared on Traditional Hinduism, please read the originial post: here

Share the post

సాలగ్రామ నిలయం..గండకీ నది !!!

×

Subscribe to Traditional Hinduism

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×