Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బిల్వ పత్రాన్ని శివారాదనలో ఎందుకు వాడుతారు

       బిల్వ పత్రాన్ని శివారాదనలో ఎందుకు వాడుతారు 

  బిల్వవృక్షము లేదా మారేడు చెట్టు అంటే శివుడికి ఎంతో ప్రీతికరము అని చెప్పబడుతోంది . కనుకనే శివాలయాలలో బిల్వపత్ర పూజకు ఉన్నత స్థానం ఉంది .

కొమ్మలు వేదాలని వేర్లు రుద్రుడిని అంటే శివుడిని సూచిస్తాయి .
బిల్వ పత్రానికి మూడు రెమ్మలు ఉంటాయి (దళము) ఈ మూడు రెమ్మలు మూడు గుణాలను  (సత్వ ,రజ:,తమ:)సూచిస్తాయి. 
భక్తులు ఈ మూడు రెమ్మలను స్వామి వారి త్రినేత్రలుగా భావిస్తారు .
bilwa patra pooja
basettybhaskar.blogspot.com

బిల్వ వృక్షము ఎంతో పవిత్రమైనదిగా ,వాటి స్పర్శ మరియు వాటి పాత్రలలో శివారాధన జీవితంలోని పాపాలన్నితిని హరిస్తాయని భక్తుల విశ్వాసం




  ఓ విశ్వాశం ప్రకారం చంద్ర దర్శనం మరియు పౌర్ణమి రోజులలో బిల్వపత్రాలను తెంపకూడదు. ఈ రోజులలో వచ్చే ప్రకృతి సంభంధమైన మార్పులు బిల్వ వృక్షం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతాయి .
కాబట్టి ఇలాంటి నిషేధం ఉంది .బిల్వ వృక్షం యొక్క అన్ని భాగాలు ఎంతో ప్రభావవంతమైన ఔషదీయ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం తెలుపుతుంది .
'సైన్స్ టుడే 'పత్రిక అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయాంకి సంబందించిన అనేక విఃవ విద్యాలయాలు బిల్వ వృక్షాలను వాటి యొక్క వైద్య గుణాలను గుర్తించి పెంచుతున్నాయి .

వాత రోగం ,మరియు కీళ్ళ వాతం ,వాంతులు వాంతులు విరేచనాలు  క్షయ మొదలైన రోగాలను బిల్వ వృక్షాల ఔశాదాలతో నయం చేయవచ్చు మధుమేహ వ్యాధి చికిత్స లో బిల్వం ఉన్నత పాత్రను పోషిస్తాయి .



బిల్వపత్ర రసం లో నూనె ను కాచి వాడినట్లైతే చెవి నొప్పి చెవి లో చీము మొదలైన సమస్యలు తొలగుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు అందుకే నిత్యం ఉదయాన్నే శుచిగా బిల్వచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఏ తిప్పలు రాకుండా ఉంటాయి 



This post first appeared on Traditional Hinduism, please read the originial post: here

Share the post

బిల్వ పత్రాన్ని శివారాదనలో ఎందుకు వాడుతారు

×

Subscribe to Traditional Hinduism

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×