Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Nara Lokesh’s Uplifting Voyage in Yuvagalam

పెనుకొండ యువగళంలో పోటెత్తిన జనప్రభంజనం! అడుగడుగునా నీరాజనాలు… రోడ్లవెంట బారుతీరిన జనం గోరంట్లలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం కిలోమీటరు పొడవున రెడ్ కార్పెట్ పర్చి అపూర్వస్వాగతం సంఘీభావం తెలిపిన ఆలపాటి, అమర్ నాథ్ రెడ్డి, జయనాగేశ్వర్రెడ్డి, గిరిధర్ రెడ్డి

పెనుకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం జనం పోటెత్తారు. 52వ రోజు యువగళం పాదయాత్ర కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట వద్ద విడిది కేంద్రం నుంచి సోమవారం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభ సమయానికి వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు క్యాంప్ సైట్ వద్దకు చేరుకొని యువనేతతో సెల్ఫీలు దిగేందుకు బారులు తీరారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం తర్వాత పాదయాత్ర ప్రారంభమయ్యాక జనం అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టారు. యువనేతపై అభిమానులు పూలవర్షం కురిపించడంతో రోడ్లన్నీ పసుపుమయంగా మారాయి. యువనేత రాకకోసం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట బారులు తీరారు. యువనేత పాదయాత్ర సందర్భంగా గోరంట్ల పట్టణం జనసంద్రంగా మారింది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో రోడ్లపైకి చేరుకొని యువనేత ఆత్మీయస్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, డప్పుల చప్పుడు, యువతీయువకుల కేరింతలతో గోరంట్ల పట్టణం హోరెత్తింది. లోకేష్ ని చూసేందుకు రోడ్ల పైకి భారీగా చేరుకోవడమేగాక చుట్టూ ఉన్న భవనాల పైకి ఎక్కారు. అందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ యువనేత ముందుకు సాగారు. గోరంట్లలోడ యువనేతకు భారీ స్వాగతం పలికి యాపిల్ తో చేసిన భారీ గజమాలతో సత్కరించారు. కదిరిరోడ్డు, గాంధీ సర్కిల్ వద్ద యువనేతకు రెండు ప్రదేశాల్లో భారీ గజమాలలతో సత్కరించారు. హెచ్.పి. పెట్రోల్ బంక్ నుండి బహిరంగ సభ ప్రాంగణం వరకు సుమారు కిలోమీటరు మేర యువనేతకు రెడ్ కార్పెట్ పరిచి యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు.  అశేష జనవాహిని మధ్య బహిరంగ సభలో యువనేత ప్రసంగించారు. యువనేతను కొండాపురం గ్రామ కార్యకర్తలు. గజమాలతో సత్కరించారు. చలమయ్యవారిపల్లిలో యువనేతకు మహిళలు స్వాగతం పలికి హారతులిచ్చారు. చింతమానుపల్లి వద్ద యువనేతకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. జీనబండ్లపల్లిలో యువనేతకు స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. భోజన విరామానంతరం కసిరెడ్డిపల్లి వద్ద స్వాగతం పలికిన గ్రామస్తులు యువనేతను ఘనంగా స్వాగతించారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. TDP అధికారంలోకి రాగానే వడ్డెర్లకు అండగా ఉంటామని భరసా ఇచ్చి ముందుకు సాగారు. జీనబండ్లపల్లిలో నాయీబ్రాహ్మణులు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. సాయంత్రం గుమ్మయ్యగారిపల్లి వద్ద నిర్వహించిన బహిరంగసభలో జనం పోటెత్తారు. పెనుకొండ ఇన్ చార్జి బికె పార్థసారధి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సబిత పాదయాత్ర పొడవునా యువనేతను అనుసరిస్తూ కార్యకర్తలను అదుపుచేశారు. సభాస్థలం సరిపోక రోడ్లపై నిలబడి జనం ప్రసంగం విన్నారు.

యువనేతకు సంఘీభావం తెలిపిన ప్రముఖులు

యువగళం పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొని యువనేతకు సంఘీభావం తెలిపారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అమర్ నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు యువనేతకు సంఘీభావంగా కొంతసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

కుడిచేత్తో 10 ఇచ్చి ఎడమచేత్తో వంద కొట్టేస్తున్నారు!

వైసీపీ దగ్గర రెండు బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్ లో 10 రూపాయిలు పడతాయి. అదే బల్ల కింద రివర్స్ బటన్ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయిలు ఆయన ఖాతాలోకి వెళ్లిపోతాయి.  కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు, చెత్త పన్ను వేసాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇదే రివర్స్ బటన్. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు ఇవ్వడం లేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.  మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగస్తులను ఇబ్బంధి పెడుతున్నారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు.

యువత భవిష్యత్ తో వైసీపీ ఆటలు!

యువత భవిష్యత్తు తో ఆటలాడుతున్నారు వైసీపీ.  జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసారు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

బిసి, ఎస్సీ, మైనారిటీలపై అడుగడుగునా దాడులు

బీసీలకు తీరని అన్యాయం చేసింది వైసీపీ.  స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసారు.  బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టారు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.  వైసిపి పాలనలో దళితులకు రక్షణ లేదు. సిఎం సొంత జిల్లా లోనే దళితులకి రక్షణ లేదు. అచ్చెన్న ని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. వైసీపీ పాలన లో మైనార్టీలకు రక్షణ లేదు. మైనార్టీల కోసం ఏర్పాటు చేస్తామన్న ఇస్లామిక్ బ్యాంక్ హామీ ని మర్చిపోయారు.

రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు!

అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రిలయన్స్, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు ఖర్చుచేస్తే, జగన్ వెయ్యికోట్లు కూడా ఖర్చుచేయలేదు జగన్ రెడ్డి. ఇక్కడ ప్రజలకు మేలుచేసిన నిజమైన రాయలసీమ బిడ్డ చంద్రబాబునాయుడు.

పెనుకొండకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

 ఇక్కడో ఎంపి ఉన్నాడు. సమస్యలపై పోరాడాలని ప్రజలు డిల్లీ పంపిస్తే ఒక్క సమస్య గురించి కూడా ఆయన డిల్లీలో పోరాడలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం వచ్చిన జగన్మోహన్ రెడ్డి మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా గోరంట్ల మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. టిడిపి గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. పెనుగొండ నియోజకవర్గం లో కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇక్కడ  గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. రెండున్నర సంవత్సరాల కిందట ఇక్కడ  గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే అప్పుడు దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పటివరకు గొర్రెపిల్లని ఇచ్చిన పాపాన పోలేదు. గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం మంజూరు చేసామని చెప్పిన రెండు కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. పెనుగొండ కేంద్రంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం జగన్ రెండేళ్ల  క్రిందట ప్రకటించారు. రెండేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశాడు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలు పెడతామని నాలుగేళ్లుగా మాటలు చెబుతున్నారు తప్ప పునాదిరాయి వేసింది లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తిచేస్తాం.

మడకశిర బ్రాంచ్ కెనాల్ ను గాలికొదిలేశారు!

టిడిపి హయాంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ 90 శాతం పూర్తి చేసి మడకశిరలోని చెరువుకు నీరు అందించాం. అక్కడక్కడ బ్రిడ్జిలు, కల్వర్టులకు సంబంధించిన పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మడకశిర బ్రాంచ్ కెనాల్ ను గాలికి వదిలేసింది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా  పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే కాలువను పూర్తి చేసి మడకశిరలోని 100 చెరువులకు నీరు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్..ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.. బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తి  చేయకుండా.. ఇప్పుడు బైపాస్ కెనాల్ నిర్మిస్తామని కొత్త మాట చెబుతున్నాడు. ఉన్నదాన్ని పూర్తి చేయలేని వాడు కొత్త కాలువ నిర్మిస్తానని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. బైపాస్ కెనాల్ నిర్మాణంపై ప్రకటన చేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఒక్క గంప మట్టి అయినా తీశారా?

కమీషన్ల బెడద తట్టుకోలేక అనుబంధ పరిశ్రమలు తమిళనాడుకు!

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కియా అనుబంధం పరిశ్రమల కోసం ధర్నా అంటూ హై డ్రామా ప్లే చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు కమిషన్లు ఇచ్చుకోలేక వంద అనుబంధ సంస్థలు తమిళనాడుకు వెళ్ళిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుబంధ సంస్థలు మొత్తం పరిశ్రమలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండేవి.

కియా అనుబంధ పరిశ్రమలను వెనక్కి తీసుకొస్తాం!

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కియా అనుబంధ సంస్థలు అన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తాం. లేపాక్షి భూములు వెనక్కి తీసుకోని పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. హంద్రీనీవా పూర్తి చేసి నియోజకవర్గం లో సాగు, త్రాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. పెనుకొండ ను అభివృద్ది చేసింది టిడిపి. ఇక్కడ వేసిన రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులు అన్ని మా హయాంలో చేసినవే. వైసిపి చేసింది ఏమీ లేదు. పెనుకొండ మళ్ళీ అభివృద్ది బాట పట్టాలి అంటే టిడిపి ని గెలిపించండి. ఉమ్మడి అనంతపురం జిల్లా మా కుటుంబాన్ని ఆదరించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కంటే రెట్టింపు అభివృద్ది చేస్తాం. అన్న ఎన్టీఆర్, ముద్దుల మావయ్యను అభిమానించి గెలిపించిన జిల్లా అనంతపురం. రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తాం.

యువనేతను కలిసిన వడ్డెర సామాజికవర్గీయులు

పెనుకొండ నియోజకవర్గం చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులు యువనేత నారా లోకేష్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. చలమయ్యగారిపల్లి, చింతమానుపల్లి, రాగిమేకలపల్లి, రాంపురం, మల్లెల, మరువపల్లి, కొండాపురం గ్రామాల్లో వడ్డెర కులస్తులం అధికంగా ఉన్నాం. దశాబ్ధాలుగా స్థానికంగా నివాసముంటున్న మాకు ఉపాధి హామీ పథకం అమలుచేయడం లేదు. పక్కా ఇళ్లుగానీ, ప్రభుత్వ పథకాలు గానీ అందడం లేదు.  గత నాలుగేళ్లలో చలమయ్యగారిపల్లిలో ఇప్పటివరకు ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. సబ్సిడీపై మాకు ఎటువంటి లోన్లు మంజూరు చేయలేదు. టిడిపి అధికారంలోకి  వచ్చాక మాకు పక్కా ఇళ్లు నిర్మించి, పథకాలు అందించండి. వృత్తిపని చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు, క్వారీలు కేటాయించి ఆదుకోండి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో వడ్డెర్లతోపాటు అన్నిరకాల వెనుకబడిన కులాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. వడ్డెర్ల వృత్తిపని చేసుకునేందుకు గతంలో కేటాయించిన క్వారీలను వైసిపి నేతలు కబ్జా చేశారు. కుర్చీల్లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బిసిలను వైసిపి ప్రభుత్వం దగా చేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లులేని వడ్డెర్లకు పక్కా గృహాలు నిర్మిస్తాం. గతంలో వడ్డెర్లకు కేటాయించి అన్యాక్రాంతమైన క్వారీలను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పథకం కింద వడ్డెర్లకు పనులు కేటాయిస్తాం. వడ్డెర్లకు పెద్దఎత్తున సబ్సిడీ రుణాలు అందజేసి సొంతకాళ్లపై నిలబడేలా చేస్తామని చెప్పారు.

యువనేతను కలిసి సమస్యలను విన్నవించిన నాయీబ్రాహ్మణులు

పెనుకొండ నియోజకవర్గం జీనబండ్లపల్లిలో గోరంట్ల మండల నాయీబ్రాహ్మణులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. క్షౌర వృత్తిదారులు, వాయిద్య కళాకారులకు ప్రమాద బీమాసౌకర్యాన్ని కల్పించాలి. 50సంవత్సరాలు దాటిన నాయీ బ్రాహ్మణులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. శాసనమండలిలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలి. క్షౌర వృత్తిదారులకు బిసి కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణ సౌకర్యం కల్పించాలి. దేవస్థానాల పాలకవర్గాల్లో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో నాయీబ్రాహ్మణుల జీవనాధారమైన బార్బర్ షాపులపై కూడా వైసీపీ ప్రభుత్వం వివిధ రకాల పన్నుల భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక క్షౌర వృత్తిదారులు, వాయిద్య కళాకారులకు చంద్రన్న బీమా పథకం కింద రూ.10లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం. నాయీ బ్రాహ్మణులకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తాం. క్షౌరవృత్తిదారులకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తామని చెప్పారు.

Also, read this blog: Nara Lokesh’s Journey to Success in advancing to the Next Level in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

The post Nara Lokesh’s Uplifting Voyage in Yuvagalam appeared first on TDP.



This post first appeared on Great Honors And Recognition For N. Chandrababu Naidu Achievements, please read the originial post: here

Share the post

Nara Lokesh’s Uplifting Voyage in Yuvagalam

×

Subscribe to Great Honors And Recognition For N. Chandrababu Naidu Achievements

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×