Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వరలక్ష్మి వ్రత విధానం పాటించాల్సిన నీయమాలు | Varalakshmi Vratam | Varalakshmi Vratham

Varalakshmi Vratam :  ప్రతీ సంవత్సరం వచ్చే శ్రావణమాసం ప్రతీ మహిళకూ చాలా ముఖ్యమైనది. సంవత్సరమంతా ఇంటిల్లపాదీ సుఖ-సౌఖ్యాలతో తులతూగాలంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తీ, శ్రద్దలతో ఆచరించడం ద్వారా ఆ ఇంటిలో ధనానికి, సౌభాగ్యాలకూ, ఆయురారోగ్యాలకూ కొదవఉండదు.

ఆ లక్ష్మీ దేవిని ఇంటిలోకి మన పూజల ద్వారా ఆహ్వానించి మన కామ్యాలను నెరవేర్చుకోవడం మామూలు రోజుల్లో కొంచెం కష్టమే అందుకే ఇంత అద్భుతమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ మానవాళికి అందించడం జరిగింది.

సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఇంత మంచి వ్రతాన్ని నిర్వహించి Lakshmi Devi ఇంటిలోకి ఆహ్వానించ గలిగితే ఆమెతో పాటు సిరి సంపదలు ఎలాగూ వస్తాయి లక్ష్మీ తో పాటు ఆ గోవిందుడు మన ఇంటిలోనే కొలువై ఉంటాడు. కావున వరాలను ప్రసాదించే ఆ తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి నీయమాలు కానీ నిష్టలు కానీ అవసరం లేకుండానే లక్ష్మీ దేవి మీద పూర్తిగా మనస్సును లగ్నం చేసి ద్యానించాలి.

వరలక్ష్మి వ్రత విధానం – Varalakshmi Vratham

ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందుగా  ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటి వకిట్లో ఆవు పేడతో కళాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి. తరువాత ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి.

ఇక ఇంట్లో మనం ఎక్కడైతే కలశం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుద్ధి చెయ్యాలి అనగా గోమయం తో భూమిని శుద్ది చెయ్యాలి. తరువాత పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మండపం మీద బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ మండపాన్ని పసుపు కుంకుమలతో ఆలంకరించుకోవాలి.

దీనిపై జాకెట్ వస్త్రాన్ని దానిపై వేసుకోవాలి దీనిపై అమ్మవారి ఫోటో పెట్టాలి. కలశం పెట్టుకునే వాళ్ళు మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని పీటంపై వేసి దానిమీద తమలపాకు ఉంచి ఎవరికి వారు వారికి తగిన స్తోమతతో బంగారు, వెండి లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకోవచ్చు అంత స్తోమత లేని వారు కలశాన్ని పెట్టుకోవాలి.

Varalakshmi pooja కు కలశం పెట్టుకునే విధానం – Varalakshmi Vratham Kalasam

సుభ్రంచేసిన ఒక రాగి చెంభు తీసుకుని దానికి పసుపు రాసి దానికి కుంకుమతో బొట్లు పెట్టాలి. తరువాత మూడు లేదా ఐదు వరుసల తెల్ల దారం తీసుకుని దానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్ముని తీసుకుని దానిపై మామిడాకు చుట్టి వాటిని దారంతో కట్టి కలశానికి కట్టాలి.

తరువాత రాగి చెంభు లో నీళ్ళు తీసుకుని దానిలో కుంకుమ, పసుపు, గంధం, అక్షింతలు, పొక్క, కర్జూరం, వెండి తామర పువ్వు, తామర గింజ, లక్ష్మీ గవ్వలు, గోమతీ చెక్రాలు, చిల్లర డబ్బులు ఆ కలశంలో వెయ్యాలి.

తరువాత ఆ కలశం పై ఒక ఐదు మామిడాకులు లేదా తమపాకులు పైన ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన కొబ్బరికాయను ఎరుపు జాకెట్ వస్త్రాన్ని గోపురం ఆకారంలో చుట్టి దానికి స్వస్తిక్ సింబల్ రాసి  దానిని కలశం మీద పెట్టిన కొబ్బరికాయపై పెట్టాలి దీనితో కలశం పెట్టె విధానం పూర్తి అవుతుంది.

తరువాత మండపం పైన రెండు దీపపు కుందెలను పెట్టి వాటిలో స్వచ్చమైన ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె తో ఒక్కొక్క దానిలో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. తరువాత అమ్మవారికి పసుపు కుంకుమతో కట్టిన తాళిని ఏర్పాటు చేసుకొని ఆ కలశంపై ఉన్న అమ్మవారికి వెయ్యాలి.

                                                         

             Varalakshmi Vratham

తోరం ఎలా తయారు చేసుకోవాలి? | Varalakshmi Vratha Thoram

ఒక తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులుగా తీసుకుని ఆ తొమ్మిది పోగుల దారానికి పసుపు రాయాలి. తరువాత ఆ దారానికి వరుసగా ఐదు లేక తొమ్మిది పువ్వులు కట్టి ముడులు వెయ్యాలి. అంటే ఐదు పోగుల దారానికి ఐదు ముడులు లేక తొమ్మిది పోగుల దారానికి తొమ్మిది ముడులతో పువ్వులు కట్టి  తోరాన్ని తయారుచేసి, దాన్ని పీఠం వద్ద పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలు వేస్తూ పూజించాలి ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత ఈ క్రింద ఇచ్చిన మంత్రాలతో తోరాన్ని పూజ చెయ్యాలి.

                      varalakshmi vratam

Varalakshmi Vratam pooja సామగ్రి

  1. వరలక్ష్మి దేవి ఫోటో (కూర్చుని ఉన్న ఫోటో )
  2. పసుపు
  3. కుంకుమ
  4. గాజులు-12
  5. గంధం
  6. తమలపాకులు-ఒక మోదు
  7. వక్కలు-100గ్రా..
  8. ఖర్జూరం-20గ్రా..
  9. అగరబత్తులు-1పేకెట్
  10. టెంకాయ
  11. పూలు
  12. పూల దండలు
  13. అరటి పళ్ళు-ఒక డజను
  14. అక్షింతలు
  15. ఆవు పాలు -25ఎం.ఎల్
  16. గంట
  17. ముద్ద కర్పూరం
  18. చిల్లర డబ్బులు
  19. దీపం

పైన చెప్పిన విధంగా సామాగ్రి సిద్దం చేసుకున్నాకా ముందుగా ఒక పళ్ళెం తీసుకుని తరువాత మంచినీళ్ళ గ్లాసు తో మూడు సార్లు కుడి చేతిలో ఆ నీళ్ళను పోసుకుని ఆ నీళ్ళని త్రాగాలి. తరువాత చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకుని ఆచమన మంత్రాలు చదువుతూ ఆ నీటిని పళ్ళెంలో విడిచిపెట్టాలి. తరువాత చేతి లోకి కొన్ని అక్షింతలు తీసుకుని భూసుద్ది మంత్రాన్ని చెప్పి వాటిని ఎడమవైకు ఆ అక్షింతలను విడిచిపెట్టాలి.

తరువాత కొన్ని అక్షింతలు తీసుకుని మన సంకల్పాన్ని చెప్పుకోవాలి తరువాత చేతిలోని అక్షింతలను అమ్మవారి దగ్గర విడిచి పెట్టాలి. ఇక అమ్మవారి దగ్గర పెట్టిన కలశంలో నీటిని సుద్ది చేయడానికి ఆ కలశంపై చేతిని ఉంచి మంత్రాన్ని చెప్పడం ద్వారా కలశంలోని జలం శుద్ధి అవుతాయి.

Varalakshmi Vratham చేసే  ముందు గణపతి పూజ – Ganapathi Pooja

ఎలాంటి వ్రతానికైనా, పూజకైనా ముందుగా ప్రార్ధించాల్సింది ఆది దేవుడు గణపతి దీనికి గాను పసుపుతో కూడిన గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆ ప్రతిమను తమలపాకులో అక్షింతలు వేసి దానిపై వినాయకుడిని పెట్టాలి. తరువాత ఆ వినాయకునికి పూలు అలంకరించాలి. ఇక ఈ Varalakshmi Vratam చేసే ముందు వ్రతానికి సంబంధించిన సామాగ్రి మొత్తం సిద్దం చేసుకోవాలి.

క్రింద తెలపబోయే మంత్రాలతో వినాయకుని పూజ చెయ్యాలి 

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే 

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

అని పైన శ్లోకం చదువుతూ గణపతిపై అక్షతలువెయ్యాలి. తరువాత యధాశక్తి గణపతి కి  పూజ క్రింది ఇచ్చిన అష్టోత్తరం చదువుతూ షోడశోపచార చేయాలి.

  1. ఓం సుముఖాయ నమః}
  2. ఓం ఏకదంతాయ నమః}
  3. ఓం కపిలాయ నమః}
  4. ఓం గజకర్ణికాయ నమః}
  5. ఓంలంబోదరాయ నమః}
  6. ఓం వికటాయ నమః}
  7. ఓం విఘ్నరాజాయ నమః}
  8. ఓం గణాధిపాయ నమః}
  9. ఓంధూమకేతవే నమః}
  10. ఓం వక్రతుండాయ నమః}
  11. ఓం గణాధ్యక్షాయ నమః}
  12. ఓం ఫాలచంద్రాయ నమః}
  13. ఓం గజాననాయ నమః}
  14. ఓం శూర్పకర్ణాయ నమః}
  15. ఓం హేరంబాయ నమః}
  16. ఓం స్కందపూర్వజాయనమః}
  17. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః}

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అని చదివి పుష్పాలను స్వామి వారికి సమర్పించి నమస్కారం చేసుకోవాలి.

గణపతికి దూప, దీప నైవేద్యాల సమర్పణ

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి (దూపం వెలిగించాలి)
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి   (దీపం వెలిగించాలి తరువాత గంట మ్రోగించాలి)
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి (పంచ పాత్రలోని నీళ్ళతో నైవేద్యాలపై కొంచెం నీళ్ళు చల్లి తరువాత నైవేద్యం సమర్పించాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ || నీటిని నివేదించిన నైవేద్యంపై జల్లుతూ..సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి…

  • ఓం ప్రాణాయ స్వాహా
  • ఓం ఆపానాయ స్వాహా
  • ఓంవ్యానాయస్వాహా
  • ఓం ఉదానాయ స్వాహా
  • ఓం సమానాయ స్వాహా
  • ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి
  • మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీటిని విడవాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. { పచ్చ కర్పూరం వెలిగించి స్వామికి  నీరాజనం ఇవ్వాలి} ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు  వినాయకునికి నమస్కారం చేసి గణపతికి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి షోడషోపచార పూజ పూర్తి చేసిన తరువాత వరలక్ష్మీ వ్రతాన్ని మొదలు పెట్టాలి.

వరలక్ష్మీ వ్రతం చేసే ముందు క్రింద ఇచ్చిన వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి Lakshmi Ashtottara Satanamavali చదవాలి.

  1. ఓం ప్రకృత్యై నమః
  2. ఓం వికృత్యై నమః
  3. ఓం విద్యాయై నమః
  4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
  5. ఓం శ్రద్ధాయై నమః
  6. ఓం విభూత్యై నమః
  7. ఓం సురభ్యై నమః
  8. ఓం పరమాత్మికాయై నమః
  9. ఓం వాచే నమః
  10. ఓం పద్మాలయాయై నమః
  11. ఓం పద్మాయై నమః
  12. ఓం శుచ్యై నమః
  13. ఓం స్వాహాయై నమః
  14. ఓం స్వధాయై నమః
  15. ఓం సుధాయై నమః
  16. ఓం ధన్యాయై నమః
  17. ఓం హిరణ్మయ్యై నమః
  18. ఓం లక్ష్మ్యై నమః
  19. ఓం నిత్యపుష్టాయై నమః
  20. ఓం విభావర్యై నమః
  21. ఓం అదిత్యై నమః
  22. ఓం దిత్యై నమః
  23. ఓం దీప్తాయై నమః
  24. ఓం వసుధాయై నమః
  25. ఓం వసుధారిణ్యై నమః
  26. ఓం కమలాయై నమః
  27. ఓం కాంతాయై నమః
  28. ఓం కామాక్ష్యై నమః
  29. ఓం క్రోధసంభవాయై నమః
  30. ఓం అనుగ్రహపరాయై నమః
  31. ఓం ఋద్ధయే నమః
  32. ఓం అనఘాయై నమః
  33. ఓం హరివల్లభాయై నమః
  34. ఓం అశోకాయై నమః
  35. ఓం అమృతాయై నమః
  36. ఓం దీప్తాయై నమః
  37. ఓం లోకశోక వినాశిన్యై నమః
  38. ఓం ధర్మనిలయాయై నమః
  39. ఓం కరుణాయై నమః
  40. ఓం లోకమాత్రే నమః
  41. ఓం పద్మప్రియాయై నమః
  42. ఓం పద్మహస్తాయై నమః
  43. ఓం పద్మాక్ష్యై నమః
  44. ఓం పద్మసుందర్యై నమః
  45. ఓం పద్మోద్భవాయై నమః
  46. ఓం పద్మముఖ్యై నమః
  47. ఓం పద్మనాభప్రియాయై నమః
  48. ఓం రమాయై నమః
  49. ఓం పద్మమాలాధరాయై నమః
  50. ఓం దేవ్యై నమః
  51. ఓం పద్మిన్యై నమః
  52. ఓం పద్మగంథిన్యై నమః
  53. ఓం పుణ్యగంధాయై నమః
  54. ఓం సుప్రసన్నాయై నమః
  55. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
  56. ఓం ప్రభాయై నమః
  57. ఓం చంద్రవదనాయై నమః
  58. ఓం చంద్రాయై నమః
  59. ఓం చంద్రసహోదర్యై నమః
  60. ఓం చతుర్భుజాయై నమః
  61. ఓం చంద్రరూపాయై నమః
  62. ఓం ఇందిరాయై నమః
  63. ఓం ఇందుశీతులాయై నమః
  64. ఓం ఆహ్లోదజనన్యై నమః
  65. ఓం పుష్ట్యై నమః
  66. ఓం శివాయై నమః
  67. ఓం శివకర్యై నమః
  68. ఓం సత్యై నమః
  69. ఓం విమలాయై నమః
  70. ఓం విశ్వజనన్యై నమః
  71. ఓం తుష్ట్యై నమః
  72. ఓం దారిద్ర్య నాశిన్యై నమః
  73. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
  74. ఓం శాంతాయై నమః
  75. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  76. ఓం శ్రియై నమః
  77. ఓం భాస్కర్యై నమః
  78. ఓం బిల్వనిలయాయై నమః
  79. ఓం వరారోహాయై నమః
  80. ఓం యశస్విన్యై నమః
  81. ఓం వసుంధరాయై నమః
  82. ఓం ఉదారాంగాయై నమః
  83. ఓం హరిణ్యై నమః
  84. ఓం హేమమాలిన్యై నమః
  85. ఓం ధనధాన్య కర్యై నమః
  86. ఓం సిద్ధయే నమః
  87. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
  88. ఓం శుభప్రదాయై నమః
  89. ఓం నృపవేశ్మ గతానందాయై నమః
  90. ఓం వరలక్ష్మ్యై నమః
  91. ఓం వసుప్రదాయై నమః
  92. ఓం శుభాయై నమః
  93. ఓం హిరణ్యప్రాకారాయై నమః
  94. ఓం సముద్ర తనయాయై నమః
  95. ఓం జయాయై నమః
  96. ఓం మంగళాయై నమః
  97. ఓం దేవ్యై నమః
  98. ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
  99. ఓం విష్ణుపత్న్యై నమః
  100. ఓం ప్రసన్నాక్ష్యై నమః
  101. ఓం నారాయణ సమాశ్రితాయై నమః
  102. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
  103. ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
  104. ఓం నవదుర్గాయై నమః
  105. ఓం మహాకాళ్యై నమః
  106. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
  107. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
  108. ఓం భువనేశ్వర్యై నమః

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం.

 ఈ క్రింది ఇచ్చిన Varalakshmi Vratham కథ చదవాలి | Varalakshmi Vratham

                                                 

                       varalakshmi vratam
                           varalakshmi vratam

పైన తెలిపిన విధంగా వరలక్ష్మి వ్రత కథ చదివి చేతోలోని అక్షింతలు అమ్మవారి దాగ్గర కొన్ని వేసి మిగిలినవి శిరస్సుపై వేసుకోవాలి. 

Questions & Answers 

Q.  గర్భవతులు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా? 

A.  ఈ వ్రతం వచ్చిన నాటికి గర్భవతులకు ఐదవ నెల వచ్చే లోపు వరకూ ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. ఐదు నెలలు దాటిన తరువాత వస్తే ఆఇంట్లో తన అత్తగారు,



This post first appeared on Prajavaradhi | Telugu News | Latest Telugu News, please read the originial post: here

Share the post

వరలక్ష్మి వ్రత విధానం పాటించాల్సిన నీయమాలు | Varalakshmi Vratam | Varalakshmi Vratham

×

Subscribe to Prajavaradhi | Telugu News | Latest Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×