Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Thati Bellam: తాటి బెల్లం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Palm Jaggery దీనిని తెలుగులో Thati Blam తాటిబెల్లం అని పిలుస్తారు. రోజువారీ జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం దీనికోసం కొంతమంది వారి శరీరానికి తగ్గ డైట్ ఫాలో అవుతూ ఉంటారు అయితే మంచి శరీర ఆకృతి రావాలన్నా, మంచి హెల్త్ కావాలన్నా శరీరం రోగాల భారిన పడకుండా ఉండాలనా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ఏదోరకంగా ప్రతీరోజూ అందిస్తూ ఉండాలి.

దీనికోసం చాలా మంది హై డోస్ సుప్లిమేంట్ ట్యాబ్లేట్స్ వాడుతూ ఉంటారు వీటితో మొదట మంచి రిజల్ట్స్ వచ్చినా తర్వాత సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉంటాయి అందుకే అలాంటివేవీ లేకుడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే Palm Jaggery గురించి మరియు హెల్త్ బెనిఫిట్స్ గరించి తెలుసుకుందాం.

Thati Bellam ఎలా తయారు చేస్తారు 

thaati bellam: తాటి గెలలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటిపై నాట్లు పెట్టి గెల యొక్క చివరి భాగాన్ని చీరతారు అప్పుడు ఒక్కొక్క బొట్టు నీరా చెట్టుకు కట్టిన కుండలో పడుతుంది అయితే దీనిని సేకరించిన తరువాత దానిని ఒక ఇనుప కళాయిలో పోసి మరగాబెడతారు అది పాకంలా మారాక దానిని దకరకు వచ్చే వరకూ కలుపుతూనే ఉంటారు దగ్గరకు వచ్చి పాకం గట్టిపడిన తరువాత కొన్ని గంటలపాటు దానిని అలాగే వదిలేసి తరువాత బెల్లాన్ని Palm Jaggery ముక్కలుగా కట్ చేస్తారు.

  • మలబద్దకం నివారించడంలో Thati Bellam
  • తాటి బెల్లంతో డీహైడ్రేషన్ దూరం
  • తాటి బెల్లంతో కాల్షియం లోపం నివారణ
  • రక్త హీనత నివారిస్తుంది
  • నరాల బలహీనతను తగ్గిస్తుంది
  • గుండె మరియు ఊపిరి తిత్తుల సమస్యలకు
  • నెలసరి నొప్పి సమస్యలకు
  • బీ కాంప్లెక్స్ లోపం నివారణకు
  • డయాబెటిస్ కంట్రోల్

1. మలబద్దకం నివారించడంలో Thati Bellam

ఎన్నో ఏళ్లుగా మలబద్దకంతో బాదపడుతున్న వారు తాటి బెల్లంతో మలబద్దకాన్ని అతి సులువుగా నివారించవచ్చు శరీరానికి అవసరమైన ఫైబర్ తాటి బెల్లంలో సంవృద్దిగా లబిస్తుంది దీనిని తీసోకోవడం వల్ల ప్రేగులలో పెరుకుపోయిన వ్యర్ధాలను బయటకు నేట్టడంలో ఒక క్లిన్సర్ లా పనిచేస్తుంది. దీనితో పేగులలో ఉన్న వ్యర్ధాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోవడం వల్ల తిన్న ఆహారంలోని న్యూట్రియన్స్ శరీరానికి సక్రమంగా అందడమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడి మలబద్దకం క్రమంగా నివారించబడుతుంది.

2. Thati Bellam తో డీహైడ్రేషన్ దూరం

ప్రతీ ఒక్కరికీ శరీరం నుండి నీరు చెమట రూపంలో బయటకు వెళుతుంది కాని డీహైడ్రేషన్ తత్త్వం గల శరీరస్తులకు ఈ చెమట మిగతా వారితో పోలిస్తే రెండు రెట్లు అధికంగా బయటకు వెళ్ళిపోవడం తో పాటు ఈ చెమట ద్వారా శరీరంలో ఉండే శరీరానికి కావాల్సిన మినరల్స్ కూడా ఈ చెమట ద్వారా బయటికి వెళ్ళిపోతాయి.

దీనితో నోరు తడి ఆరిపోయినట్లు ఉండడం, డ్రై స్కిన్, మూత్రం రంగు మారడం, అలసట, తలపోటు, తల తిరగడం వంటివి ఈ డీహైడ్రేషన్ వల్లే వస్తాయి ఇలాంటి సమస్యలకు Thati Bellam అద్బుతంగా పనిచేస్తుంది. దీనికి 30గ్రాముల తాటిబెల్లం 1/2 టీస్పూన్ ఉప్పు ఒక లీటర్ గోరు వెచ్చని నీళ్ళలో వీటిని కలిపి కొద్ది సేపటికి ఒకసారి త్రాగినట్లయితే ఈ సమస్య నుండి బయట పడతారు.

3. తాటి బెల్లంతో కాల్షియం లోపం నివారణ

కాల్షియం డెఫిసెన్సీ ఉన్నవాళ్ళు ఎన్నో వేలుకు వేలు పెట్టి కాల్షియం ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకు తాటి బెల్లం తో తక్కువ ఖర్చులోనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. తాటి బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని సుద్ది చేసి కొత్త రక్తం వృద్ది చెందేటట్లు చేస్తుంది. 100గ్రాముల తాటి బెల్లంలో 80mg కాల్షియం లబిస్తుంది దీనితో ఎముకలు దృడంగా తయావుతాయి. ఎదిగే చిన్న పిల్లలకు తాటి బెల్లం ఇవ్వడం వల్ల బోన్ వీక్ నెస్, కాల్షియం లోపం వంటివి నిరోదించవచ్చు.

4. రక్త హీనత నివారిస్తుంది Thati Bellam

తాటి బెల్లంలో పొటాసియం, కాల్షియం సంవృద్దిగా ఉండడం వల్ల దీనిని తీసుకునే వారికి రక్త హీనత సమస్య తొలగిపోతుంది.

5. నరాల బలహీనతను తగ్గిస్తుంది Palm Jaggery

మన శరీరంలో శక్తి పుట్టాలంటే కణజాలం హీట్ ను నరాల ద్వారా శరీరం అంతటికీ రిలీజ్ చేస్తాయి అలాంటి శక్తిని పుట్టించాలంటే కావాల్సిన ఎంజైమ్స్ రిలీజ్ చెయ్యాలి దీనికి తైమిన్ సహాయ పడుతుంది అలాంటి తైమిన్ Thati Blam తీసు కుంటే కణజాలం శక్తి ఉత్పత్తి చేసి నరాల బలహీనత రాకుండా ఉంటుంది.

6. గుండె మరియు ఊపిరి తిత్తుల సమస్యలకు Palm Jaggery 

100గ్రాముల తాటి బెల్లం, 100గ్రాముల శొంటి, 100 గ్రాముల తుంగ మస్తలు ఈ మూడింటినీ చూర్ణం లా చేసి రోజూ క్రమం తప్పకుండా ఈ చూర్ణాన్ని సేవించినట్లైతే గుండె సమస్యలకు మరియు ఊపిరి తిత్తుల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాక ఊపిరి తిత్తుల్లో పేరుకుపోయిన ఖఫం తొలగిపోతుంది.

7. నెలసరి నొప్పి సమస్యలకు Palm Jaggery

తాటి బెల్లం మరియు కొద్దిగా సొంటి పొడి తీసుకుని రెండింటినీ కలిపి సేవిస్తే నెలసరిలో వచ్చే నొప్పి సమస్యను నివారిస్తుంది.

8. బీ కాంప్లెక్స్ లోపం నివారణకు

చాలా మందికి బీ కాంప్లెక్స్ లోపం ఉంటుంది అలాంటి వారు తాటి బెల్లం సేవించడం వల్ల బికాంప్లెక్స్ లోపం నుండి బయట పడతారు.

9. డయాబెటిస్ కంట్రోల్ 

కొంత మందికి ఒక్కోసారి లో షుగర్ తో ఒక్కసారిగా చమటలు పట్టి నీరసం రావడం వంటివి జరుగుతాయి అలాంటి వారు క్రమం తప్పకుండా తాటి బెల్లం తీసుకోవడం వల్ల లో షుగర్ కంట్రోల్ లోకి వచ్చి అధిక నీరసాన్ని తగ్గిస్తుంది.

S.NO Nutrients Per 100
1 కాల్షియం  0.86
2 పాస్పరస్ 0.05
3 ఖనిజ లవణాలు 3.15
4 కేలరీస్  978mg
5 మాంసకృతులు 1.6
6 ఫ్యాట్ 0.1
7 చక్కెర 1.6
8 సుక్రోజ్ 76.8
9 తేమ 8.6
10 తైమిన్ 24mg
11 రెబోఫ్లావిన్ 432mg

గమనిక : పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పాటించే ముందు డాక్టర్ సలహా తప్పక                          తీసుకోగలరు.

Read Also…Ajwain in Telugu | వాము యొక్క ఆరోగ్య అద్భుత ప్రయోజనాలు | Vamu

The post Thati Bellam: తాటి బెల్లం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు appeared first on Prajavaradhi.com.



This post first appeared on Prajavaradhi | Telugu News | Latest Telugu News, please read the originial post: here

Share the post

Thati Bellam: తాటి బెల్లం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

×

Subscribe to Prajavaradhi | Telugu News | Latest Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×