Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎనిమిదేళ్ళ వదువు, నలబై యేండ్ల వరుడు, తొలి రేయి తో అమ్మాయి బ్రతుకు తెల్లారి పోయింది.!


                                                                

                                 అరబ్ చట్టాలు, అరబ్ చట్టాలు. ఈ మద్య ఇండియాలో స్త్రీల మీద లైంగిక దాడులు విపరీతంగా మ్మా పెరిగిపోతున్నందుకు కొంత మంది (నాతో సహా) సూచిస్తున్న పరిష్కారం అరబ్ దేశాలలో మాదిరి తీవ్ర శిక్షలు ఉండాలి అని. కానీ అదే అరబ్ దేశాలలో బాలికల పరిస్తితి ఎంత దయనీయంగా ఉంది అనేది తెలిపెదే ఈ ఉదంతం.

  పశ్చిమ ఆసియా దేశాలలో యెమెన్ ఒకటి. ప్రాచీన  నాగరికత విలసిల్లిన ప్రాంతం. కానీ ప్రస్తుతం ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఎంత పేదరికం అంటే తల్లి తండ్రులు తమ ఆడపిల్లలని బాల్య వివాహాల పేరుతో అమ్మివేసే అంతగా!అలాంటి ఒక నిర్బాగ్య బాలిక పేరు రావన్. ఆ అమ్మాయి కి ఎనిమిదేళ్ళు రాగానే వారి సాంప్రాదాయం ప్రకారం (అట?)ఒక వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసారు తల్లితండ్రులు(అమ్మివేశారు), వరుడు వయస్సు నలబై యేండ్లు. అంటే బాలిక వయస్సు కన్నా కేవలం ఐదురెట్లు ఎక్కువ. వారి మత పెద్ద  ఎనిమిదెళ్ళకే వివాహం చేసుకో మన్నాడని ఆ పెద్ద మనిషీ చేసుకున్నాడట!

  వారి సాంప్రదాయం ప్రకారం పెండ్లి  చేసుకున్న రోజే కార్యం కూడా ముగించాలి కాబట్టి ఆ ఎనిమిదేళ్ళ మేక పిల్లని ఈ నలబై యేండ్ల తోడేలుని ఇద్దరిని గదిలోకి పంపారు. పాపం! ఆ అల్లా దయ ఆ ఆడబిడ్డ మీద లేదేమో!ఆ పశువు ఆడిన రాక్షస రతి క్రీడకు అమ్మాయి మర్మాంగం చిద్రమై, అంతులేని బాద ననుభవిస్తుంటే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు అంట.కాని డాక్టర్లు అమ్మాయిని బ్రతికించలేక పోయారు. ఒక వేళ బ్రతికినా , రోజూ తోడేలుతో కాపురం చెయ్యడం కష్టమే కాబట్టి దేవుడు తన దగ్గరకు తీసుకు వెళ్ళాడేమో!ఇక పోతే అక్కడ ఈ విషయమై బందువులు  ఎవరూ పిర్యాదు చేయలేదట. కానీ కలియుగంలో భగవంతుడు సామాజిక కార్య కర్తల రూపంలో భూమి మీద సంచరిస్తున్నాడు కాబట్టి, అక్కడ ఆర్వఒతమన్ అనే సామాజిక కార్యకర్త చొరవతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి అక్కడి చట్టాలు ఏమంటాయో మనకి తెలియదు. ఒకవేళా చట్టాలు నిందితులను శిక్షించడానికి ప్రయత్నించినా అక్కడ సాక్ష్యం చెప్పి సహకరించడానికి ఎవరూ సిద్దంగా లేరట!

   ఇతర ప్రపంచ దేశాలోని ముస్లిం మత పెద్దలు స్తిల వివాహా వయసును పద్దెనిమిదేళ్ళ నుండి పద్నాలుగు యేండ్లకు తగ్గించమని, అది తమ మత సాంప్రదాయమని సంబదిత ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఏ మతమైనా మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా తమ ఆచార సాంప్రదాయాలు మార్చుకోవడం లో తప్పేమి లేదు. అది అవసరం కూడా. ప్రస్తుతం ఆదునిక స్త్రీల విశ్రుంఖల స్వేచ్చా విదానం, స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులు వల్లా, చాందస మత పెద్దల వాదాలను ఎదుర్కోవడం సామాజిక మార్పు కోరే వారికి కష్టం  అవుతుంది. అటు నియంత్రణ పేరుతో, ఇటు స్వేచ్చ పెరుతో అంతిమంగా  స్త్రీల మీద దాడులు పెరుగుతున్నవే తప్పా పరిష్కారం దొరకడం లేదు. ఏ మత ప్రవక్త అయినా  తమ మత ఆడబిడ్డల నాశనాన్ని కోరుకోడు.ఆ నాటి పరిస్తితులానుసారం , స్త్రీల ను కాపాడు కోవడం కోసం కొన్ని నిబందనలు పెట్టి ఉండవచ్చు . స్తిలకు రక్షణ అనేది కట్టుబాట్లు తో కూడిన సమాజం లోనే సాద్యం. ఆ కట్టు బాట్లు కూడా వారి బుద్ది వికాసానికి దోహదం చేసేదిలా ఉండాలి తప్పా,వారిని రక్షించడం చేతగాని మగాళ్ళు పెట్టె అంక్షలు లా ఉండ రాదు. నియంత్రణ అనేది స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకూ  వర్తిస్తుంది .

  ఆడపిల్లల బుద్ది వికాసానికి స్వేచ్చ నివ్వండి . వారి నైతిక  పతనానికి దారి తీసే విశ్రుంఖల స్వేచ్చా విదానానికి అడ్డుకట్ట వేయండి. ఈ ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మమే వారిని రక్షించి తీరుతుంది. "యత్ర నార్యంతు పూజ్యతే, తత్ర రమయతే దేవతా".  
                                            (18/09/2013 post Republished).      


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఎనిమిదేళ్ళ వదువు, నలబై యేండ్ల వరుడు, తొలి రేయి తో అమ్మాయి బ్రతుకు తెల్లారి పోయింది.!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×