Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కొడుకు వయసు ఉన్న కుర్రాడితో 'లవ్ గేమ్ " ఆడిన&#

                                                                   
     


                               వెర్రీ వేయి విదాలు అంటారు . అందులో ప్రేమ వెర్రి ఒకటి . ఉచ్చ నీచాలు , వావి వరుసలు, వయసు తారతమ్యాలు ఇత్యాది వి అన్ని మరచి పోయి , మోస పూరిత విదానాలతో ఒక కుర్రాన్ని రెండు న్నర్ర సంవత్సరాల పాటు ప్రేమ పేరుతొ వెరెత్తిoచిన ముగ్గురు పిల్లల్లున్న తల్లి  చివరకు అ కుర్రాడి చేతిలోనే దారుణంగా హత్య చేయబడింది . వివరాలు లోకి వెళితే ,

                       చిన్న వాళ్ళు , పెద్ద వాళ్ళు  అనే బేద బావం లేకుండా , అందరి మనో వికారాలను సంతృప్తి పరస్తుంది , సామాజిక సైట్ "పేస్ బుక్" . అందులో ఎవరైనా సరే తమ గురించి అబ్బద్దపు సమాచారంతో ఖాతా ఓపెన్ చేసి , తమ మనసులో ఉన్న వికారాలు అన్ని ప్రదర్సించ వచ్చు. అది నిజమే అని నమ్మి కొంత మంది బకరాలు అయి చివరకు బలి పశువులు అయిన ఉదంతాలు ఎన్నో !. అదిగో అలాoటి ప్రేమ వికారం పుష్కలంగా ఉన్న స్త్రీయే జబల్ పూర్ కి చెందిన 45 సంవత్సరాల జ్యోతి కరోనా . ఆమె కు 21 సంవత్సరాల వయసు గల కూతురుతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు . భర్త ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో క్లర్క్ గా పని చేస్తున్నాడు . ఆమెకు 45 యేండ్ల వయసు వచ్చినా ఇంకా పిల్ల బుద్దులు పోనట్లుంది . అందుకే పేస్ బుక్ లో వేరే పేరుతొ , వేరే పోటో తో తన వయసు 21 గా చూపిస్తూ ఖాతా ఒకటి తెరచి , ముజపర్నగర్ కి చెందినా 22 సంవత్సరాల  వినిత్ సింగ్ అనే కుర్రాడితో పరిచయం చేసుకుంది . రాను రాను ఆమెలో పైత్యం ముదిరి అ కుర్రాడితో పేస్ బుక్ సాక్షిగా ప్రేమాయాణం సాగించింది . ఇలా 3 సంత్సరాలు కొనసాగిందట .

                   అలా తమ మద్య జరుగుతున్నా ప్రేమ తతంగం ను , ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోవాలని కోరిక కలిగింది కాబోలు , సదరు వినిత్ సింగ్ తను ,జ్యోతి కోరి ని కలుసుకోవడానికి వస్తున్నాను అని ఆమెకు  చెప్పి , జబల్ పూర్ బయలు దేరాడు . అతని ఇంట్లో , ఉద్యోగానేవేషణకు అని చెప్పి బయలు దేరాడు . ఇక ఇక్కడ్డ జబల్ పూర్ లో తన కుర ప్రేమికుడిని కలుసుకోవాలనే వెర్రి  తపనతో , కోరి కూడా తన పుట్టింటికి అని చెప్పి బయలు దేరింది . ఇద్దరూ జబల్ పూర్కి సమీపంలోని చిన్న నది ఒడ్డున కలిసారు . తను తన పేస్ బుక్ ప్రేమికురాలిని కలుబోతున్నాను అనే ఆనందంలో ఉన్న వినిత్ కు అ చిన్న నదియే యమునా నది గాను , ఆ  పరిసర ప్రాంతాలు ఒక బృందావనం గాను , తానూ నల్లనయ్య గాను, తన కోసం వస్తుంది రాధ గాను అనిపించ సాగింది . అలా ఊహించుకుంటూ ఎన్నో మడురోహల్లో తేలి పోతున్న సింగ్ గారికి , హట్టాతుగా తన ఎదుట ముదురు వయసు రాద ప్రత్యక్ష మయ్యేసరికి , కాసేపు నోట మాట రాలేదు అట . అ తర్వాత ఆమె ద్వారా అసలు విషయం తెలిసి , తనేoత బకరా అయ్యాడో అర్ధం అయ్యేసరికి అరి కాలి మంట నేతికేక్కింది అట .

                   అంతే ! ఒక సారిగా తన దగ్గరున్న పిస్టల్ తో ఆమెను కాల్చి పారేసాడు అట . అ తర్వాత పశ్చాతాపం  తో తనూ కాల్చుకుని , రక్తమోడుతున్న బట్టలతో పక్కన్నే ఉన్న పార్కులోకి రాగా , అతనిని చూసిన కొo దరు పోలీసులకు సమాచారం ఇచ్చారట . వారు అతన్ని హాస్పిటల్లో చేర్పిమ్చినా ప్రయోజనం లేక పోయింది . ఆతను కూడా హస్పిట్టల్లో మరణించాడు . అలా పోలిస్ వారికి ఎక్కువ శ్రమ పడకుండానే కేసు క్లోజ్ చేసుకునేలా సహకరించాడు అన్న మాట ! ఇలా ఒక ముదురు ప్రేమికురాలి చిత్త చాపల్యం రెండు నిoడు జీవితాలను బలి కొంది. చివరకు పేస్ బుక్ బలి  కాతాలో మరో ఇద్దరు చేరారు . ఇన్నాళ్ళు పేస్ బుక్ వలన యువతే చెడి పోతుంది అనుకుంటే , ఆ  జాడ్యం మద్య వయస్కులకు కూడా అంటుకుంది అని తాజా ఉదంతం తెలియ చేస్తుంది . కాబట్టి తస్మాత్! జాగ్రత్త!
                              (Republished Post). 


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

కొడుకు వయసు ఉన్న కుర్రాడితో 'లవ్ గేమ్ " ఆడిన&#

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×