Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంటర్నెట్లో వీర్యం!ఇంట్లో సిరంజీ కార్యం!

                                                                 
                                                    


                        సంసారం అంటే సర్థుకు పోవటమే. అంతకు మించి మరేది సంసార సాఫాల్యానికి అవసరం లేదు. ఈ ఒక్క గుణం లేకపోతే ఎన్ని సుగుణాలున్నా అవన్నీ వ్యక్తిగత ఖాతాలో జమ అయ్యేవే కాని, సంసారానికి ఉపయోగపడవు. ఈ మద్య కాలంలో దంపతుల మద్య అవగాహాన బొత్తిగా కొరవడి విడాకుల రేటు అధికమవుతుంది. తాము చిన్నప్పటినుండి ఎంతో గారాబంగా, జాగ్రత్తగా పెంచుకున్న తమ "ఈగోనెస్", ఆఫ్ట్రాల్ నిన్న గాక మొన్న వచ్చిన లైఫ్ పార్ట్నర్ల కోసం త్యాగం చెయ్యడం ఏమిటి? అని నవతరం ఆలోచిస్తున్నట్లుంది. అందుకే పెళ్లైన మూన్నెల్లోపే విడాకులకు సై అంటున్నారు. ఏదో పిల్లల్ని కనడం, వారిని పెంచి పోషించడం అనేవి సంసార కార్యాలు  కాబట్టి వాటి కోసం ఈ లంపలాట ని భరిస్తున్నాం కాని, లేకపోతే ఈ బాదలు మాకెందుకు అని నిట్టూర్పులు వీడుస్తూ బరువుగా సంసార బారాన్ని ఈడుస్తున్న వారు మన సమాజంలో తక్కువేమి కాకపోవచ్చు.అయితే ఇటువంటి వారికి ఒక శుభ వార్త!

  ఎటువంటి సహజీవన సంసార కార్యం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో, కోరుకున్న వారి వీర్యంతో పిల్లల్ని కనడం లో బ్రిటన్ లో ఒక మహిళ చేసి చూపింది. ఇప్పటి వరకు "సంతాన సాఫాల్య కేంద్రాలు’ నిర్వహిస్తూ లక్షలు గుంజుతున్న డాక్టర్లకు కూడ ఇది పెద్ద దెబ్బే కావచ్చు. ఇప్పటి వరకు పశువుల క్రుత్రిమ సంతానొత్పత్తి విదానంలోనే ఇటువంటి ప్రక్రియ ఉపయోగిస్తునారు. అదే విదానం మనుషులకు కూడ వర్తింప చేసి సఫలీక్రుతురాలైంది ఆ బ్రిటన్ లోని అమెరికా మహిళా!

  సదరు మహిళకు పిల్లల మీద ఆశ ఎక్కువట. ముగ్గురిని దత్తత తీసుకున్నా ఆమెకు మమకారం తీరక "ఇంటర్ నెట్"లో వీర్యాన్ని కొని అది తన కూతురికి సిరంజి ద్వారా ఎక్కించి, ఆమెను గర్బవతిని చేసి పండంటి మనవడిని పొందిందట! అబ్బా! ఎంత శుభవార్త! వ్యక్తిగత స్వేచ్చకు పూర్తి అవకాశానిచ్చే ఇటువంటి ప్రక్రియను కనుగొన్న ఆ మహిళా మణికి ఎన్ని దండలు వేసినా తక్కువే. కాని బ్రిటన్లో చట్టాలు దీన్ని ఒప్పుకోక ఆమె మీద కేసు పెట్టాయట! ఆ, అదెంత ప్రాబ్లం లెండి! స్వలింగ సహజీవనానే చట్టబద్దం చేస్తున్న వారికి ఈ "సిరంజీ సంతానాన్ని" చట్టబద్దం చెయ్యడం పెద్ద కష్టం కాక పోవచ్చు. మరి స్త్రీలకు అయితే పర్వాలేదు, ఇంటర్నెట్లో వీర్యం దొరుకుద్ది, మరి పురుషుల సంగతేమిటని ఆలోచిస్తున్నారా? అదీ పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే కొంచం ఖర్చెక్కువ అవుద్ది. అదే నండి "అద్దె గర్భమూ,ఆర్థిక బారమూ" అంతే!ఇక సంసారాల్ జంజాటాలు  అఖ్ఖర్లేదు, కాసులు ఉంటె చాలు, నచ్చిన ఏకాకి జీవితం ఎల్ల కాలం అనుబవించ వచ్చు. అన్నీ ఇంటర్నెట్లొనే కొనుకోవచ్చు, ఇంట్లో అనుభవించవచ్చు. అటువంటి "స్వేచ్చా యుగం" మనకు తొందర్లోనే రానుంది కాబోలు. ఎంత అద్రుష్ట వంతులం!

          భవిష్యతులో పిన్నల్ని ఆశ్వీరదించడానికి "చిరంజీవ, చిరంజీవ" అనే బదులు "సిరంజీవ, సిరంజీవ" అంటె సరిపోతుందేమో! నిజంగా సిరంజీ కార్యం తో గర్బం దాల్చడం సాద్యమేనా అని అనుమానపడే వారు క్రింది లింక్ ను చూడవచ్చు.
SOURCE:http://www.conceiveeasy.com/get-pregnant/can-i-get-pregnant-using-a-syringe/

                  (Republished Post. OPD:30-4-2013).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఇంటర్నెట్లో వీర్యం!ఇంట్లో సిరంజీ కార్యం!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×