Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బుద్ధుడు చెప్పిన మోక్షం మానవునికి ఈ విధంగా కలుగనుందా!!??


                              


 



49 రోజులు భోది వృక్షం క్రింద ధ్యానం చేసి గౌతమ బుద్ధులు వారు తెలిసికున్నదేమిటంటే మానవుడి దుఃఖానికి కోర్కెలు కారణం,అవి అనంతం కాబట్టి,వాటిని విడిచి పెట్టనిదే దుఃఖం నుండి మనిషి విముక్తుడు కాడు అని.సరే కోర్కెలను మన నుండి వెల్లగొట్టడం కష్టం కాబట్టి ఎలాగో కష్టపడి బౌద్ధ ధర్మాన్ని ఇండియా అంచుల వరకూ తరిమి బుద్ధుని పేరు మీద కార్యక్రమాలు జరుపుకునే అంత మేరకు కోర్కె ను నియంత్రించుకున్నాం.దేశం లో అక్కడక్కడ బుద్ధ మతం పేరుతో ఎదో చేయాలని ఆరాట పడుతున్న వారు,బుద్ధుని బోధనలు మీద మమకారం తో కాక,హిందూ ధర్మం మీద ప్రతికారంతో ఎగురుతుండడం వల్ల వారిలో కూడా కోర్కెలు ఏ మాత్రం తక్కువ కాలేదు. బుద్ధుని బోధన లో ఒకటైన బ్రహ్మచర్యం వల్ల మనిషి సంతతి తగ్గి చివరకు మానవ జాతికి భూమి నుండి మోక్షం లభిస్తుంది. ఈ రకమైన మోక్షాన్ని మనిషి సాధించటం కష్టం కాబట్టి ,మానవ ఆవిష్కృత సైన్స్ ఆ పని చేయటం మొదలు పెట్టినట్లుంది. ఆధునిక మానవుడు ఉపయోగిస్తున్న సాంకేతిక పనిముట్లు,కారకాలు వలన పర్యావరణం కలుషితమై దాని ఫలితంగా పురుషుల్లో సంతాన ఉత్పత్తి శక్తి తగ్గిపోతుంది అంట. ప్రస్తుతం 40%మందిలో ఉన్న ఈ సమస్య ,2045 నాటికి 90% కు చేరవచ్చు అంటున్నారు దీని మీద అధ్యయనం చేసిన పర్యావరణ వేత్తలు.ఈ సమస్య వల పురుషులలో సంతానోత్పత్తికి కారణమయ్యే అంగాలు కుంచించుకొని పోవడం వలన మనిషి లో కోర్కెలు ఉన్న చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి,మగాళ్ల మీద మగవాళ్లకు,ఆడవాళ్ళ మీద ఆడవారికి మోహం పెరిగి సేమ్ సెక్స్ మేరేజెస్ జరుగుతాయి.ఎలాగూ వాటిని చట్టబద్ధం చేయాలనే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి,2050 నాటికి స్వజాతి జంటలు ఎక్కువుగా ఉండవచ్చు.మనుషుల్లో సహజ సంతానోత్పత్తిని నియంత్రించడం లో సక్సెస్ అయిన సైన్స్ ఆసలు మానవ ఉత్పత్తి అనేది కాకుండా అప జాలదు. ఎందుకంటే  స్వజాతి సంపర్కుల్లో కూడా పిల్లలు కావాలన్న కోర్కె బలియంగా ఉంటుంది కాబట్టి.అందువల్ల కృత్రిమ సంతానోత్పత్తి పరిశ్రమ కు బాగా డిమాండ్ ఉంటుంది.ఈ విదంగా సమాజం లో కుండగోళక సంతానం అంటే కౌరవుల మాదిరి టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడతారు.వారిలో కొందరు మహా సెంటిస్తులు అయి,ఈ భూమి మీద వెలగబెట్టింది చాలు,ఇక ప్రక్క గ్రహాల మీద మన విజ్ఞాన ప్రతాపం చూపిద్దాం అని గ్రహాంతర ప్రయాణాలు చేస్తూ యమా బిజీగా ఉంటే వారితో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇతర గ్రహాలను ఆక్రమించి అక్కడ కూడా వెంచర్లు వేసి అమ్ముతుంటారు.ఇక డబ్బున్న  ప్రజలు కూడా గ్రహాంతర వలసలు వెళతారు కాబట్టి భూమి మీద సామాన్య కృత్రిమ సంతానం మిగులుతుంది.ఈ లోపు భూమి మీద పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది కాబట్టి వరదలు,భూకంపాలు ఏర్పడి భూమి మీద ఉన్న సామాన్య కృత్రిమ మానవ సంతతితో పాటు అక్కడక్కడ మిగిలిపోయిన సహజ మానవులు కూడా అంతరించి పోతారు.అప్పుడు భూమి మీద అంతా హారప్ప మొహంజో దారో లాంటి వాతావరణ మే ఉంటుంది. ఇలా బుద్ధులు వారు చెప్పిన మానవునికి మోక్షం అనే కార్యక్రమం భూమి మీద విజయవంతంగా పూర్తి చేయబడుతుంది.ఆలా జరగటానికి వీలు లేదు ఇలాంటి బుద్ధమోక్షం మాకొద్దు అని ఎవరైనా భావిస్తే దాని నివారణకు పర్యావరణ వేత్తలు చెప్పే కాలుష్య నియంత్రణ సూచనలు పాటించాలి మరి.అది కష్టం లే మనకి ఎందుకంటే కోర్కెలు అనంతం కదా!




This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

బుద్ధుడు చెప్పిన మోక్షం మానవునికి ఈ విధంగా కలుగనుందా!!??

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×