Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!

                                                                       

భారత రాజ్యాంగం తన పౌరులకు సమానత్వం ని ప్రసాదించింది. దీనికి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల కృతజ్ఞుడి గా ఉండాల్సిందే. ఎవరి దృష్టిలో ఎలా ఉన్ననా , రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. అందులో ఆడ, మగ ,థర్డ్ జెండర్ అనే లింగ వివక్షత అనేది చూపించటానికి విలు లేదు. అదిగో అదే కారణం చూపిస్తూ మొన్ననే సుప్రీం కోర్టు భారతీయ శిక్షా స్మృతి లోని  497 సెక్షన్ ,అడల్త్రి నేరానికి శిక్ష పొందే విషంలో స్త్రి పురుషుల పట్ల వివక్ష చూపించడమే కాక, భార్యను భర్త యొక్క ఆస్తిగా బావించే పాత తరం వారి బూజు పట్టిన బావ జాలానికి అడ్డం పట్టేల ఉందని ప్రకటిస్తూ , అసలు అ సెక్షనే నేటి తరానికి పనికి   రాదనీ 4:1 మెజార్టి తో అత్యున్నత న్యాయస్తానం కొట్టివేయడం జరిగినది. అయితే 497  సెక్షన్ లో నేరానికి బాద్యుడిగా పురుషుని మాత్రమె చేయడం వెనుక , అడల్త్రి నేరం విషయం లో నాటి సమాజం నేరస్తురలైన స్త్రి పట్ల చూపించిన హిన దృష్టి ,పురుషుని పై చూపించడం లేదు కాబట్టి, కేవలం పురుషున్ని శిక్షిస్తే సరిపోతుందని చట్ట నిర్మాతలు బావించి ఉంటారని ఇదే బ్లాగు లో ఇంతకు ముందు ప్రచురించిన పోస్టు లో చెప్పడం జరిగింది.

   కాని ఇంకొంచెం లోతుగా అలోచించి చూస్తే, అ నాటి సమాజం లో మేజార్తిగా (ఇప్పటికి కూడా )  ఉన్న హిందూ ప్రజలు అనుసరించే మహత్తరమైన హిందూ తాత్విక ద్రుక్పడానికి అనుగుణంగా  497 సెక్షన్ పెట్టి ఉంటారు అని కూడా అనుకోవచ్చు. వివాహ వ్యవస్తలో భార్యా భర్తలు సమానులు అనేది విదేశి బావాజాలాల నుండి కాపి కొట్టిన సిద్దాంతం అది. కాని హిందూ తాత్విక దృక్పదం ప్రకారం " పెండ్లి అయ్యే అంతవరకే స్త్రి పురుషులు వేరు వేరు. ఒక్క సారి పెండ్లి జరిగి ఒకరి చేయి ఒకరు పట్టుకున్నాక ,వారివురు ఒకటిగా అయి పోయి అర్ద నారీశ్వర స్వారుపం పొందుతారు. ఈ విషయం లోనైనా వారివురి చర్యలు ఏక వ్యక్తీ చర్య గానే పరిగణించాలి . అందుకే భర్త  లో  సగ బాగమైన   భార్యను, భర్త అనుమతి లేకుండా కలవడం అనేది కేవలం భర్తకు మాత్రమె కాక , యావత్ కుటుంబానికి చెందిన పరువు ప్రతిష్టలకు బంగం కలిగించే విషయమని బావించటం వలన , సగటు బారతీయ పురుషుడి మనోద్రేకాలు దృష్టిలో పెట్టుకుని ,ఇటువంటి వి సమాజం లో పెచ్చరిల్లితే ,భార్యా భర్తలు మద్య గొడవలతో కుటుంబ కలహాలు ,తద్వారా కుటుంబ విచ్చిన్నలు కావడమే కాక , నిందితుడైన పురుషుడి పట్ల భర్త అతని తరపు వారి  పగలు ప్రతీకారాలు తో హత్యలు,ఆస్తి ద్వంసాలు జరిగి  సమాజం  సంక్షోబ  స్తితికి నెట్ట బడుతుందని బావించటం 
వలననే అ సెక్షన్ పెట్టి ఉంటారు. అయితే ఎవరు ఎవరి మిద కేసు పెట్టాలి అనే ప్రశ్నవచ్చినప్పుడు ,హిందూ తాత్విక దృక్పదం ప్రకారం భార్య భర్తలు ఇరువురూ ఒకటే కాబట్టే ,ఒకరి మిద మరొకరు కేసు పెట్టుకుంటే ,అది తన మిద తానె పెట్టుకున్నట్లు అవుతుందని బావించి , నిందితుడైన పురుషుడి మిద ,బాదితుడైన పురుషుడు కేసు పెట్టె విదంగా ఏర్పాటు చేసి ఉంటారు. కాక పొతే పైన చెప్పినట్లు అప్పటి సమాజ పరిస్థితులు ద్రుష్టిలో లో ఉంచుకుని, స్త్రీ కి సమాజం విదిస్తున్న  "హినదృష్టి " శిక్ష చాలు ప్రత్యేకంగా రాజ్యదండన అవసరం లేదని బావించటం వలననే , నిందితురాలైన స్త్రి మిద కేసు పెట్టె అవకాసం నిందితుడి భార్యకు కల్పించి ఉండక పోవచ్చు. 
                  అయితే ఇప్పటి రాజ్యాలు వాటి ద్వారా నిర్మితమయ్యే చట్టాలు అన్ని సమానత్వ ప్రాతిపదికగా  ఉన్నాయి కాబట్టి ,అందుకు విరుద్దంగా ఉన్న సెక్షన్ 497 ని సుప్రీం కోర్టు వారు కొట్టేశారు. కాని ఇది భార్యా భర్తలు ఇరువురూ ఒకటే అనే మహత్తర హిందూ తాత్విక దృక్పదం తో నడుస్తున్న హిందూ జీవన విదానం కి గొడ్డలి పెట్టు అని న్యాయమూర్తులు ఆలోచించలేదు. ఇరువురును సమానం గా చూడటం వేరు. ఇరువురిని ఒక్కటిగా చూడటం వేరు. సమాన దృష్టికి ఇద్దరూ కావాలి. కాని హిందూ భార్యాభర్తల్లో ఇద్దరు ఉండరు ఇద్దరూ ఒకటే కాబట్టి వారిని ఒకే శరీరం లో ఉన్న కుడి చేయి ,ఎడమ చేయి గా చూడాలి తప్పా ,ఇరువురూ వ్యక్తులుగా చూడరాదు. ఒక వేళ  తమకు వివాహం కంటే  వ్యక్తిగత స్వేచ్చాయే ముక్యం అనుకుంటే "హిందూ వివాహ పద్దతి "ని విడచి తమకు నచ్చిన వానితో సహజీవనం చేయొచ్చు . లేదా వీరే పద్ధతిలోపెండ్లి చేసుకోవచ్చు అ వెసులు బాటు మన చట్టాలు కల్పిస్తున్నప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సేక్షన్ 497 కొట్టివేయడం ,ఈదేశం లో మెజార్టి ప్రజలు అనుసరిస్తున్న హిందూ జీవన విదానం కి వ్యతిరేకమైనదని గౌరవనీయ సుప్రీం కోర్టు వారి దృష్టికి రివ్యూ పిటిషన్  ద్వారా తీసుకురావలసిన అవసరం ఉంది.

       బిన్న తాత్విక ద్రుక్పదాలను గౌరవిస్తాం అని గొప్పగా చెప్పుకునే మన దేశం లో మెజార్టి ప్రజలు ఎన్నో ఏండ్లుగా సక్సెస్పుల్ గా అనుసరిస్తున్న "అర్ద నారీశ్వర " అనే హిందూ తాత్విక ద్రుక్పదాన్ని , విదేశి సమానత్వ బావం తో పోల్చి చూసి , భార్య భర్తల బందాన్ని తుచ్చమైన ఆస్తుల బంధంగా చిత్రికరిస్తూ ,ఎంతో విశిష్టమైన హిందూ వివాహ వ్యవ స్తాను అవమాన పరచేటట్లు ఉన్న తీర్పులోని వ్యాఖ్యలు పట్ల యావత్ హిందూ సమాజం స్పందించి తమ నిరసనను ప్రబుత్వాలకు తెలియచేసి, తద్వారా గౌరవనీయ కోర్టు వారి దృష్టికి తీసుకు వెళ్ళాలి. దంపతులు ఇరువురూ సమానులే అనేది గే ,లెస్బియన్ దంపతులకు లేదా విదేశీ వివాహ పద్ధతులద్వారా దంపతులైన వారికి  వర్తిస్తుంది తప్పా, భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనే హిందూ తాత్విక దృక్పదం తో ఏకమైన హిందూ బార్యబర్తలకు కాదని ప్రపంచానికి చాటి చేపాల్సిన తరుణం ఆసన్నమైంది.

             (ఈ బావం  పది మందికి చేరేలా షేర్ చేయగలరని మనవి)

        


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×