Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సాక్షాత్తు లక్ష్మీ నరసింహా స్వామీ సన్నిధి లోనే అక్రమాలకు పాల్పడిన ఎండోమెంట్ అధికారులు !!!

                                                                   


                    హిందూ మతాధికారులు లేక పీఠాధిపతుల పాలనలో హిందూ దేవాలయ నిర్వహణ,అవినీతి మయంగా లోపభూయిష్టంగా ఉందనే వంకతో , జస్టిస్ చల్లా కొండయ్య గారి కమిషన్ సెలవిచ్చింది అని చెప్పి , 1987 లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టానికి సవరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా సెక్యులర్ అధికారుల చేతిలో దేవాలయ నిర్వహణ బాధ్యతలు పెట్టింది అప్పటి N.T.R గారి ప్రభుత్వం . చివరకు సెక్యులర్ అధికారుల పరిపాలన ఎలా ఉందని రుజువు అయిందంటే, "గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు , బర్రెలను తినువాడు వస్తాడయ్యా " అన్న బ్రహ్మం గారి మాటను నిజం చేసినట్లు అయింది. సాక్షాతూ N.T.R గారి పాలనలోనే దేవాలయాలు లోని సెక్యులర్ ఆదికారులు తమ స్వార్థం కోసం  ఎంతకు తెగించారో , నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో ఈ  రోజు  ఈ  నాడు దినపత్రికలో వచ్చిన ఈ  క్రింది ఐటెం ఉదాహరణ.

                                                                                   
                                                                   


                                  సాక్షాతూ తెలంగాణా తిరుపతి అని పేరుగాంచిన  యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ సన్నిధిలో , E.E , DEE గా A.EE లు  గా ఉన్నత పదవులలో ఉన్న వారు ఆ పదవుల్లోకి రావడానికి ఎలాంటి అక్రమ మార్గం అవలంబించారో తెలుసుకుంటేనే ఎవరికైనా విస్మయం కలుగక మానదు. వాళ్ళు అసలు ఏమి చదివారో ఎవరికీ తెలియదు. 1989 లో మామూలు N.M.R గా పనిలో చేరిన కూలి, కేవలం ఒకే ఒక సంవత్సర కాలంలో 3 పదోన్నతులు పొంది డ్రాప్ట్స్ మెన్ అవతారం ఎత్తాడు . ఆ తర్వాత తప్పుడు పత్రాలు సమర్పించి నిబంధనలకు విరుద్దంగా A.EE, D.EE,E.E గా ఒక అవతారం తర్వాత మరొక అవతారం ఎత్తుతూ , యాదగిరి కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామీ యే ముక్కున వేలేసుకుని "ఔరా ఏమి ని లీలలు " అని ఆశ్చర్య పోయేలా చేస్తున్నాడు అంట. తాను కేవలం ఒక్కడే ఆ మహిమాన్విత తప్పుడు పత్రాల సృష్టి  దారిలో  లబ్ది పొందితే ఎలా అనుకున్నాడో ఏమో , తన అనుకూలురుకు ఈ తంత్ర మహిమ తెల్పి వారూ తన దారిలోనే పయనించేలా చేసాడు అంట. ఇప్పుడు అతని క్రింద పని చేసే D E.E , ఎలెక్రికల్ EE  అదే బాటలో నడచి లబ్ది పొందిన వారేనట. 

   మరి ఇంత  భయంకరమైన అక్రమం యాదగిరి గుట్ట మీద నడుస్తుంది అంటే , పై అధికారులకు తెలియకుండానే కొనసాగుతుందా? యావత్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అవినీతి మయం కాకుండా ఉండి  ఉంటె  ఈ అక్రమ అధికారులు ఇంత  నిర్బీతిగా తమ అక్రమాలను కొనసాగిస్తారా ? నెవ్వర్? కేవలం లోకాయుక్త ఆదేశాల మేరకు ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు వీరికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు  తప్పా, స్వయంగా ఎండోమెంట్  డిపార్ట్మెంట్ వారు పూనుకుని చేపట్టిన  చర్యలు కావు. 1987   నుండి నేటి వరకు అవినీతి తో బ్రష్టు పట్టి ఉన్న ఒకానొక వ్యవస్థలో అవినీతి పరులైన అధికారులు మీద నిశ్పాక్షికంగా చర్యలు కొనసాగుతాయి అని భావించడం భ్రమే అవుతుంది. ప్రభుత్వం వారో లేక  హై కోర్టు పర్వవేక్షణలోనో  స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఏర్పాటు చేసి , దేవాదాయ ధర్మాదాయ శాఖలో కొనసాగిన , కొనసాగుతున్న అక్రమ , అవినీతి అధికారుల బాగోతం చిట్టాను వెలికి తీయకపోతే , హిందూ దేవాలయాలు , హిందూ మతసంస్థలు కాపాడబడజాలవు . 
                             హిందూ సంస్థలను కాపాడుకోవడం ప్రతి హిందువు యొక్క ప్రధాన కర్తవ్యం . భక్తుడు అంటే కేవలం గుళ్లకు వెళ్లి మొక్కులు తీర్చుకు రావడమే కాదు. తాము చెల్లిస్తున్న మొక్కులు హిందూ సంస్థల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయా ? లేక అవినీతి పరుల స్వార్థానికి ఉపయోగపడుతున్నాయా ? అనేది అప్పుడప్పుడు ఆరా తీస్తూ ఉండాలి. అలా ఆరా తీసే వారు తక్కువ అవుతుండబట్టే పై తెల్పిన అవినీతి , అక్రమార్కులు దేవాలయాలను తమ అక్రమ పనులకు ఆలంబనగా చేసుకుని బొజ్జలు పెంచుకుంటున్నారు. వీరు చేసే పనులకు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వలన , భక్తులు కూడా ఏమి చేయలేని పరిస్థితి  ఉంది . కాబట్టి వ్యక్తులుగా కాకుండా ఒక సామూహిక ఉద్యమ శక్తిగా హిందూ శక్తులు ముందుకు కదలక పొతే ఈ అక్రమార్కుల అట కట్టించడం కష్టం. అవసరమైతే రాష్ట్ర హై కోర్టు తలుపు తట్టి అయినా సరే , ప్రభుత్వాన్ని మేలుకొల్పాల్సిన సమయం ఆసన్నమయింది . దుష్ట సెక్యులర్ అధికార భూతాలనుండి హిందూ సంస్థలను కాపాడుకుందాం . అవసరమయితే , ఈ విషయం లో మద్దతు తెలిపే రాజకీయ పార్టీకే భవిష్యత్ లో తమ మద్దతు ఉంటుందని హిందూ సమాజం ఏక  గొంతుకతో చెప్పాల్సి ఉంటుంది. 

              హిందూ ధర్మం అంటే శిష్టులను రక్షించడం మాత్రమే కాదు , దుష్టులను శిక్షించడం కూడా . అట్టి ధర్మాన్ని పాటిద్దాము .నిజమైన హిందువులుగా నిలబడదాం . 

  ఇదే విషయం పై ఇంతకూ ముందు రాసిన టపా కోసం క్లిక్ చేయండి 

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

జై హిందూ !!                                                              జై జై హిందూ !!



This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

సాక్షాత్తు లక్ష్మీ నరసింహా స్వామీ సన్నిధి లోనే అక్రమాలకు పాల్పడిన ఎండోమెంట్ అధికారులు !!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×