Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిర్భయ చట్ట భయం తోనే నందిగామ అమ్మాయి "పూజిత"ను హత్య చేసారా ???

                                                                             

  నేను ఇంతకు ముందు  నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!? అనే టపాలో
  నిర్భయ చట్టం వలన అమ్మాయకులైన ఆడపిల్లలు బలి అయ్యే ప్రమాద ముందని   చెప్పాను . మొన్న హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీసర్స్  కాలనీలో, తగలబడిన శవం రూపంలో కన్పించి , సంచలనం సృష్టించిన "పూజిత " అనే నందిగామకు చెందిన విద్యార్దిని కేసు కూడా అందులో బాగమే అని అనుమానం కలుగుతుంది . వివరాలు లోకి వెలితే ,

  పూజిత విజయవాడలో చార్టర్డ్ అకౌంట్ విద్యార్దిని , ఈమె స్వగ్రామం నందిగామ .ఈమె కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండి చార్టర్డ్ అకౌంట్ ట్రైనింగ్ తీసుకుందట . అప్పుడు బీహార్ కు చెందిన ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు ఈమెకు బాయ్ ప్రెండ్ అయ్యాడు . ఆమె ఆ తర్వాత విజయవాడ వచ్చినా వారి ప్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉందట . మొన్న ఆమె తన బాయ్ ప్రెండ్ కోసం సికంద్రా బాద్ వెళ్లి ,అక్కడ ఇద్దరు డిన్నర్ చేసారు అట. అప్పుడు పూజిత తన బాయ్ ప్రెండ్ కి ఒక టీ షర్ట్ బహుమతిగా ఇచ్చిందట .ఆమె అదే రాత్రి ఆమెను విజయవాడ రైలు ఎక్కించి ఆమెకు ఘనంగా వీడ్కోలు చెప్పాడట . ఆ తర్వాత తన రూమ్ కు వచ్చి బబ్బున్నాడు అట .తెల్లారి లేచి చూసే సరికి తన గర్ల్ ప్రెండ్ కాలిపోయిన విగత జీవిగా ,పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో పడి ఉందని , T.V చానల్లలో వార్తలు వస్తుండడం చూసి ,నిర్ఘాంత పోయి ఆమె ఇచ్చిన T షర్ట్ జేబులో వెతికితే ఆమె రాసిన సూయి సైడ్ నోట్ దొరికేసరికి ,పోలీసులకు విచారణలో సహకరిదామని చెప్పి ,అదర బదరా పోలిస్ స్టేషన్ కి వచ్చి విషయం చెప్పి లొంగి పోయాడు అట. ఇది పూజిత బాయ్ ప్రెండ్ చెపుతున్న కహాని . ఈ కహాని లో ఉన్న డౌట్ లు ఏమిటో చూదాం .

ఇప్పటివరకు పోలిసులు మీడియాకు చెప్పిన విషయాలు,బాయ్ ప్రెండ్ చెప్పిన కహాని  విశ్లేషిస్తే . అసలు పూజిత అనే చార్టర్డ్ అకౌంట్ స్టూడెంట్ ,తను చదువుకుంటున్న విజయవాడ నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి అని హైదరాబాద్ రావడమేమిటి ? వచ్చిన ఆమె తనకు తెలియని , సంబందంలేని పంజాగుట్ట పోలిస్ కాలనీలో ఆత్మహత్య ,అది కూడా ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని,ఎంతో బాదాకరమైన  బలవన్మరణానికి పాల్పడడం ఏమిటి ?ఆమే ఆత్మ హత్య  విషయం  కూడా ఆమె బాయ్ ప్రెండ్ షర్ట్ జేబులో ఉంచబడిన లెటర్ ద్వారానే బయట పడడం ఏమిటి? రాత్రి 10 తర్వాత తాను స్వయంగా ఆమెను విజయవాడ ట్రైన్ ఎక్కింఛి సెండాఫ్ ఇచ్చాను  అని ,ఆమె బాయ్ ప్రెండ్ చెపుతుంటే ,తెల్లారి పాటికి ఆమె కాలిన శవం గా పంజాగుట్ట IPS కాలనీలో దర్శనమివ్వడమేమిటి ? ఆమె ఒళ్ళు కాలి పోతున్న దశలో కూడా ఏ మాత్రం చలించకుండా ఉందా ? బాదతో పరుగులు పెట్టకుండా ఉంటుందా ?పరుగులు పెడితే అక్కడ ఆ ఆనవాళ్ళు ఎందుకు లేవు? అక్కడ పెట్రోల్ ,కిరోసిన్ బాటిల్ కాకుండా మద్యం బాటిల్ ఎందుకు పడి ఉంది ? ఎవరైనా పెట్రోల్ లాంటిడి పోసుకుని తగలపెట్టుకుంటె పై బాగం ఎక్కువ గాను ,క్రింది బాగం తక్కువ గాను తగలబడాలి . మరి ఆమె శరీరమ్ ఏవరో జాగర్తగా దగ్గరుండి తగుల బెట్టినట్లు ,సమానంగా ఎలా తగుల బడింది?

                         ఇవ్వన్ని చూస్తుంటె కామన్ సెన్స్ ఉన్న ఎవ్వరికైనా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కేసు అని అర్ధం అవుతుంది. ఆమె బ్రతికి ఉండి నోరు తెరిస్తే , తనకు అపాయం  అని బావించిన వారే ఆమెను కిరాతకంగా పెట్రోల్ పోసి తగల బెట్టి ఉండాలి . మాములుగా చంపితే ఆమె శవ పరీక్షలో ఆమె మీద జరిగిన లైంగిక పరమైన దాడి లేక తత్సంబంద ఇతర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున ,ప్రస్తుతం అమలులో ఉన్న "నిర్భయ "చట్ట నిభందనలు ద్రుష్టిలో ఉంచుకుని ,పోలీసులకు ఏ మాత్రం అటువంటి సాక్ష్యాదారాలు దొరకకుండా చేసేందుకే ,ఆమెను ఎక్కడొ హత్య చేసి ,నిందితులకు  సేప్ అయిన ప్రాంతం లో ఆమెను తగల బెట్టి ఉండాలి .ఆమె రాసినట్లు చెప్పబడుతున్న సూయి సైడ్ నోట్ లో పైన "my suicide note" అని అగ్రిమెంట్ టైటిల్ లాగ రాయడం చూస్తుంటె ,ఆమె ను ఎవరో మభ్య పెట్టి ఆ లెటర్ రాయించారు అనిపిస్తుంది .ఈ కేసును ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపితే తప్పా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం  లేదు.   మరి ఈ విషయం లో హైద్రా బాద్ లోని మహిళా సంఘాలు ఎందుకు స్పందించటం లేదు?

నాకైతే ఇది నిర్భయ కేసు బయంతో చేసిన పనే అని తెలుస్తుంది .ఈ రోజే ఇంకొక వార్తాT V లోస్క్రోలింగ్ అవుతుంది . ఎవరో దుండగలు 25 యేండ్ల యువతి శవాన్ని పెట్రోల్ తో తగల బెట్టి వెళ్ళారని. నేను పై పోస్టులో చెప్పిందే  నిజమయితే ప్రతి రేప్ కేసు మర్డర్ కేసు గా మారి పోవడం ఖాయం . నిర్భయ చట్టం మ్రుగాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుందో లేదో కాని ,లైంగిక బాది త స్త్రీల విషయంలో   "మరణ మృదంగం " మోగిస్తుంది . దీని గురించి చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలిసిన అవసరం ఉంది.పూజిత కేసు గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియో ను చూడండి  .

                   

                                        (24/3/2015 Post Republished).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

నిర్భయ చట్ట భయం తోనే నందిగామ అమ్మాయి "పూజిత"ను హత్య చేసారా ???

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×