Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమ్మను మించిన దైవం, "అమ్మపాలు " ను మించిన అమృతం, కలవే ఇల యందు ?!!

                                                                     



                                    "అమృతం "! దీని కోసం దేవతలు ,రాక్షసులు మద్య గొప్పయుద్ధం  జరిగింది . చివరకు రాజీపడి క్షీర  సాగర మధనం  జరిపితే అందులోనుండి ఉద్బవించింది జనన మరణాలను లేకుండా చేసె "అమృతం ". ఆప్కోర్స్ అమృతం పంపకం విషయం లోకూడా, మాకు ముందు అంటే ,మాకు ముందు అంటూ దేవ దానవుల మద్య తగాదా ఏర్పడితే ,విష్ణువు "మోహిని అవతార మెత్తి ,దానవులను తన అంద చందాలతో మైమరపింప చేస్తూ ,దేవతలకు మాత్రం "అమృతం పంచుతూ ఉండడం ,దానిని గమనించిన రాహు కేతువులు అనే రాక్షసులు ,దేవతల వేషాలతో వారి పంక్తి లో కూర్చుని తామూ అమృతం తాగబోవడం ,అది గమనించిన విష్ణువు వారి కంఠాలను తన చక్రాయుధంతో ఖండించడం ,అప్పటికే అమృతం గొంతువరకు దిగి ఉండడం తో వారు శిరస్సు లు తో చిరంజీవులు అయి గ్రహ రాసులలో కలసి పోవడం అనేది మనకు ఉన్న పురాణా గాదల్లో ఒకటి .

  పైన చెప్పినది కేవలం పుక్కిటి పురాణం అనుకుంటే దానిని గురించి మాట్లాడాల్సింది ఏమి లేదు .కాని నేడు శాస్త్రజ్ఞులు పరిశోదించి కనుగున్న ఒక గొప్ప విషయం గురించి తెలుసుకున్నాక  ,"క్షీర సాగర మధనం " కధ  కేవలం పుక్కిటి పురాణం కాదని ,అది మన ప్రాచిన సైంటిస్టులు (ఋషులు ) కనుగున్న ఒకా నొక గొప్ప సత్యం తాలూకు ప్రతీకాత్మక కదా విశేషం అని తెలుస్తుంది . మన ప్రాచిన సైంటిస్టులు ఏమి చెప్పారో వివరించే ముందు ,ఇప్పటి సైంటిస్టులు ఏమి చెపుతున్నారో క్రింద ఇవ్వబడింది . 
                                                                           
 


                                     పైన తెల్పిన దాని ప్రకారం "అమ్మపాలు "వలన మంచి తెలివి తేటలే కాక , చదువుల్లో రాణించడం ,అర్జనా సామార్ద్యం పెంపొందిందించడమ్ ద్వారా వ్యక్తిగత ,సామాజిక స్తాయిల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్నారు . మరి క్షీర సాగర మధనం  కథను చూస్తే ,  అన్నదమ్ములైన దేవ దానవులు తమ అమరత్వం(జీవించే శక్తి ) కోరి "క్షీరం "అంటే పాల సముద్రాన్ని చిలికారు . ఆ మధనం లోనుంచి సంపద ఇచ్చె లక్ష్మి , చల్ల దన్నాన్ని ఇచ్చె చంద్రుడు , కోరుకున్నది ఇచ్చె కామధేనువు ఇలా మనిషి అభివృద్దికి తోడ్పడే ఎన్నో ఉద్బవించాక చివరకు అమృతం పుట్టింది . అంటే తల్లి పాలు అమృతం తో సమానమని ,దానిని సేవించిన వారు దేవతలు లాగ అనేక ఉపయోగాలు పొందుతారని ,తాగని వారు రాక్షసులు లాగా మందమతులు అవుతారు అని ప్రతీకాత్మక దోరణిలో తెలియ చెయ్యడం జరిగింది . 

                                 ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటె కొంతమంది స్త్రీలు , తమ అందం ఎక్కడ తగ్గిపోద్దొ అని పిల్లలకు తమ పాలు ఇవ్వకుండా పోత పాలు పడుతుండడం , తమ భార్యల అందచందాల మైమరపుల లో పిల్లలు కు పోత పాలు పట్టడాన్నిపురుషులు దానిని  ప్రశ్నించక పోవడం చూస్తుంటే,పురుషుల లోని రాక్షస గుణం ,స్త్రీలలోని మోహిని మోహం కి ఎలా బానిస అయిందో ,అర్ధం కావడం లేదూ ? పిల్లలకు స్తన్యం ఇవ్వని స్త్రీలు ,వారిని ప్రోస్తాహించె పురుషులు తప్పకుండా రాక్షస సంతతియె అయి తీరుతుంది . కాబట్టి తల్లి పాలు అమృతం తో సమానం అని , దానిని ప్రసాదించే అమ్మ ను మించిన దైవం భూమి మీద లేదని, మంద మతులు ఇప్పటికైనా అర్ధం చేసుకుని  తమ పిల్లలకు అమ్మపాలు అందించి  తమ జన్మను సార్ధకం చేసుకుంటారని ఆశిద్దాం . 
                                                  (19/3/2015 Post Republished)




This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

అమ్మను మించిన దైవం, "అమ్మపాలు " ను మించిన అమృతం, కలవే ఇల యందు ?!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×