Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

స్త్రీ జాతిని హతమారుస్తున్న, ఆ వ్యాపారులెవ్వరో తెలుసా?


                                                         
 

                                    ఇంకెవరు! సాక్షాతు మన "అమ్మ"లలో దాగి ఉన్న ’వ్యాపార ద్రుక్పదం" అనే బూతం. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ఎలా వచ్చిందో తెలియదు కాని, ఈ దేశంలో చాల మంది తల్లులు ఆడ పిల్లలు పట్ల "అమ్మ తల్లులు" అవుతున్నారని చెప్పడానికి సిగ్గుపడాల్శిన అవసరం ఉంది.ఈ మద్య వరంగల్ కి చెందిన ఒక ప్రజా నాయకుడు తాను స్వయంగా చూసిన సంఘటనలు  గురించి చెపుతూ, కన్న తల్లులు తాము కన్నది "ఆడపిల్ల" అని తెలియగానే వారిని "వడ్ల గింజ" తో హతమారుస్తున్నారు అని చెప్పారు. నిజానికి ఇవన్నీ అధికార లెక్కలోకి రానటు వంటివే అయినా దాని పలితం మాత్రం మనకు తెలిసిపోతూనే ఉంది. అదే ఈ మద్య విపరీతగా పడిపోతున్న  స్త్రీ పురుషుల సగటు నిష్పత్తి. ఒకప్పుడు ప్రతి వేయి జనాబాకి976  మంది స్త్రీలు ఉంటే, ఇప్పుడు అది 942  కు పడి పోయింది. దీనికి ప్రదాన కారణం పైన తెల్పిన "అమ్మ తల్లులు", పట్టణాలోని "స్కానింగ్ సెంటర్" లు.

   మగ పిల్లవాడు పుడితే "ప్లస్", ఆడపిల్ల అయితే "లాస్" అనుకునే నేటి తరం తల్లితండ్రుల వ్యాపార ద్రుక్పదాలే, ఈ ఆడ జాతి అంతానికి కారణమవుతున్నది. నిర్లజ్జగా, ఏ మాత్రం పాపబీతి లేని ఈ నవ జాతి, మానవ జాతిని సాక్ష్యాలు లేకుండా,గుట్టుచప్పుడు కాకుండా చంపుతుంది. వెనుక కలరా, మశూచి లాంటి ప్రాణాంతక వ్యాదులు వచ్చినపుడు, వాటికి కారణలు తెలియక "అమ్మ తల్లులు"(మైసమ్మ, పోచమ్మ) ని పూజించి పిల్లని కాపాడమని వేదుకునే వారు. ఈ "అమ్మ తల్లులు" కి జాతి బేదం లేదు, "గత్తర" రూపంలో ఆడ మగ అనే తేడా తెలియకుండా  అందర్ని తీసుకుపోయేది. కాని మనకు సైన్స్  జ్ణానం పెరిగాక, రోగ కారణలు కనుగొన్నాక, "గత్తర" లని ఆపగలిగాము కాని "అమ్మ తల్లులు"ని ఆపలేకపోయాము!

  ఇప్పుడు ఆ అమ్మ తల్లులే ఏకంగా "అమ్మ" లలో ప్రవేశించారేమో, వారే తమ ఆడ శిసువులని ’వడ్ల గింజ" ప్రక్రియ తో పైకి పంపేస్తున్నారు. ఇకపోతే "అమ్మ తల్లులు" దగ్గర ఉండే కొన్ని పిశాచ గణలు పట్టణాలు చేరి సైన్స్ నేర్చుకుని, "స్కానింగ్ సెంటర్" లు పెట్టినట్టునాయి!. పిల్ల పుట్టడమెందుకు? తొమ్మిది నెల్లలు వేశ్ట్ చెయ్యడమెందుకు? కడుపులో పిల్లని కడుపులోనే ఖాళి చేస్తామని హామిలిచ్చి మరీ కడుపులు తీస్తునారు. మరి ఈ విదంగా ఆడపిల్లల్ని సాక్ష్యాలు లేకుండా చంపుతున్న వారిని దేవుడు అనే వాడు ఏమి చెయ్యలేడు, ఎందుకంటే వారికి జ్ణానం అబ్బింది కాబట్టి, ఇక విజ్ణాన వేదికలు వాళ్ళు ఏమన్నా చేయ్యగలరా అంటే వారు హాని చెయ్యని ఆశాశ్త్రీయ ఆజ్ణానులను అడ్డుకోవడానికే మక్కువ చూపుతారు తప్పా, జాతిని హతం చేస్తున్న సో కాల్డ్ సెన్స్ లెస్ సైన్స్ వ్యాపారులని ఏమి అనరు.

  అయ్యో ఆడపిల్లా, నీకెవరు దిక్కు తల్లీ, ఒకప్పుడు "ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందన్న" జాతేనా ఇది? పుట్టకముందే తల్లులు రూపంలో మీజాతే(ఫెమినిస్ట్ సిద్దాంతం ప్రకారం) మిమ్మల్నే పొట్టన పెట్టుకుంటుంటే ఇంకెవరినైనా ఏ మనగలరు తల్లీ? ఈ "అమ్మ తల్లుల" పీచమణచ ఆ ఆదిశక్తి ఉద్బవం ఎప్పుడవుతుంది? ఆ పరాపత్పరుడే చెప్పాలి మరి!  
                                                   (3/5/2013 Post Republished).    
  


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

స్త్రీ జాతిని హతమారుస్తున్న, ఆ వ్యాపారులెవ్వరో తెలుసా?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×