Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రేమ పెండ్లిళ్ళు విషయంలో "మనవు" వాదానికి బలం ఇచ్చిన కేరళ హైకోర్టు వారి డివిజన్ బెంచ్ తీర్పు !.





                నేను నిన్నఒక బ్లాగు మిత్రుడి ద్వారా ఒక  విషయం తెలిసి చాలా ఆనందించాను . ఎందుకంటే నేను 14 అక్టోబర్ 2012 న ఇదే బ్లాగులో "తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన"అనే టపా పెట్టడం జరిగింది . అందులో
    "ఈ సమాజంలో ఏ వ్యక్తి స్వయంభువు కాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగ జన్మించిన వాడు కాడు. అతని జననానికి కారకులు తల్లి తండ్రులు. ఒక వ్యక్తి ఇరువురి ఇచ్చా రూపమే కాదు వారి అనువంశిక లక్షణాల స్వారూపం కాబాట్టీ తను బవిష్యత్తులో ఎవరితో కలిసి తమ వంశానుక్రమాని అభివ్రుద్ది పరచుకోవాలి అనే విషయములో ఆ వ్యక్తి తల్లి తండ్రులకు సంపూర్ణ అదికారముంది. దానిని కాదనే హక్కు రాజ్యా వ్యవస్తకు  ఉండటం అభిలషనీయం కాదు. ఇది కచ్చితంగా ఒక కుటుంభ పరిరక్షణ హక్కులకు బంగం కలిగించడమే అని మా అభిప్రాయం.
       యవ్వన్నం లో మనిషి బుద్ది చపలంగా ఉంటుంది . ఆ దశ లో అతను లెక ఆమే కుటుంభం కంటె తమ లోని కామ ప్రాకోపాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. దానికి ప్రేమ అనో మరేది అనో ఒక అందమైన పేరు తగిలించుకుని ముందు వెనుక కానక కలిసిపొఈ జీవీతాలు నాశనం చేసుకుంటారు. ఇండియన్ కాంట్రాక్ట్ ఏక్ట్ ప్రకారం కూడ ఏదైనా ఉన్మాద స్తితిలో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. కాని కేవలం కామ ఉన్మాదంలో చేసుకుంటున్న ఇటువంటి పెళ్ళిలను కేవలం వయసు ప్రాతిపదికగా అనుమతించడం  ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రతి వివాహానికి తల్లితంద్రుల అనుమతి తప్పనిసరి చేయాలి. ఒకవేళ వివాహం విషయమ్లో తల్లి తండ్రుల నిర్ణయం కుటుంబ అబివ్రుద్దికి గాక స్వార్ద పూరితమైందని పిల్లలు బావిస్తే దానిని కుటుంబ న్యాయ స్తానాల రుజువు చేసి అట్టి కోర్టుల అనుమతితోనే వివాహం చేసుకునేతట్లు చట్ట సవరణ తెస్తే మంచిదని మా అభిప్రాయం’"
   అని చెప్పడం కూడా జరిగింది . ఆ  టపాకు విజ్ఞుల నుండి సద్విమర్సన లతో కూడిన స్పందనలు రాగా నా వాదాన్ని బల పరచుకుంటూ ప్రతి స్పందించడం కూడా జరిగింది . నేను రాసిన టపాలలో అత్యదిక కామెంట్లు పొందిన టపా కూడా అదే !

   ది 01-3-2014 న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆన్లైన్ ఎడిషన్ లో ప్రచురితమైన "Parents Have a Say in Marriage of Their Children: Kerala HC" అనే టైటిల్ సారాంశం  పై టపాలోని నా వాదనకు బలం ఇస్తుంది . అందుకే నాకు ఆనందం . .. పూర్తీ సారాంశం ఏమిటంటే ,

   కేరళ లోని అంగమలి కి చెందినా లాల్ పరమేశ్వర్ కూరకంచ్రే జిల్లా ఆసుపత్రిలో జిల్లా  మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు . అయన కి కూరకంచ్రే లోని ఎలైట్ మిషన్ హాస్పిటల్లో పని చేస్తున్న "గ్రీష్మ " అనే రెసిడెంట్ డాక్టర్ తో పరిచయం ఏర్పడి అది ప్రణయంగా మారింది . వారివువురూ వివాహం చేసుకుందామని ప్రయత్నిస్తుంటే అది తెలిసిన గ్రీష్మ తల్లి తండ్రులు సదరు లాల్ పరమేశ్వర్ తో వివాహం తన కుమార్తె బవిశ్యత్ కు ప్రమాదమని బావించి ఆమెను కట్టడి చేసినట్లు తెలుస్తుంది . దానికి అబ్యంతరం పెడుతూ  డాక్టర్ లాల్ పరమేశ్వర్ కేరళ హై కోర్టులో హెబియస్ కార్పస్ పెటిషణ్ వేసి , తన ప్రియురాలిని కోర్టు ముందు హాజరు పరచేలా పోలిస్ వారికి అదేసాలిచ్చి , ఆపై ఆమెకు స్వేచ్చను కలిపిస్తే తాము వివాహం చేసుకునే విలు కలుగుతుందని కోరాడు . దానికి స్పందించిన హై కోర్టు గ్రీష్మ తండ్రికి సమన్లు జారి చేయగా అయన కోర్టుకు హాజరై . తాను  తన కూతురిని చట్ట వ్యతిరేకంగా నిర్బందియించ లేదని, తన ఏకైక కుమార్తె సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని , ఆమె బాగోగులు చూచే తనకున్న సహజ హక్కును వినియోగించుకోవడం తప్పా , తానేమి చట్ట వ్యతిరేకం పని చేయలేదని , కోర్టు వారికి విన్న వించాడు . ఆ సందర్బంగా అయన తన కుమార్తె వాడిన 3 మోబైల్లలో ని కొన్ని sms లు _లాల్ పరమేశ్వర్ , గ్రీష్మ ల మద్య జరిగిన ప్రేమ సందేశాలు - చూపడం జరిగింది . వాటన్నిటిని పరిశిలించిన జస్టిస్ అంటోని డోమేనిక్ మరియు జస్టిస్ అనిల్ K నరెంద్రన్ తో కూడిన డివిజన్ బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ లాండ్ మార్క్ జడ్జ్ మెంట్ వెలువరించింది .

   "పెండ్లి విషయం లో తమ పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి తల్లి తండ్రులు నోరు మూసుకుని చూస్తూ ఉండజాలరు . పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్చా , స్వాతంత్ర్యపు హక్కులు ,  సామాజిక కట్టుబాట్లను ద్వంసం చేయడానికి  అయుదాలుగా ఉపయోగించరాదు . పిల్లలు మేజర్ లు అయినo త మాత్రానా తమ వివాహం  గురించి తప్పుడు మరియు అపరిపక్వ నిర్ణయాలు తీసుకుంటుంటే,  తల్లి తండ్రులు ఏమి చేయని నిస్సహాయ స్తితిలో  ఉన్నప్పుడు,  " వ్యక్తులు  మేజర్లు కాబట్టి , వారికి వారి వివాహం విషయంలో స్వతంత్రులు లు, తల్లి తండ్రులు , అన్ని పరిస్తితుల్లో తమ మేజర్ పిల్లలకున్న స్వేచ్చా నిర్ణయ అదికారానికి  తలోగ్గవలసిo దే "అనే దానిని సాదారణ న్యాయ సూత్రం గా అంగికరిo చలేము . జీవితంలో ని ఇతర అంశాల మాదిరే , సామాజిక విలువలు , నైతిక విలువలు లో మార్పులు వస్తుంటాయి .వాటిని గుర్తించడం అవసరం ". అని చెపుతూ లాల్ పరమేశ్వర్ రిట్ పిటిషన్ ను కొట్టి వేయడం జరిగింది .

  ఇది భారతీయ న్యాయ వ్యవస్థ ,  మన  సమాజం లో అత్యంత వేగంగా పతన మవుతున్న కట్టుబాట్లు , నైతిక విలువల పరిణామాలను గుర్తిoచింది అనడానికి  ఒక నిదర్సనం . దీనిని సుప్రీం కోర్టు వారు ఆమోదిస్తే వివాహ చట్టాలలో సవరణలు తీసుకువచ్చి  భారతీయ కుటుంబ వ్యవస్తను పరి రక్షించ వచ్చు . నేను పై టపాలో చెప్పిన విదంగా ఉన్మాదం లో చేసుకునే ఏ ఒప్పందాలు చెల్లనప్పుడు , ప్రేమొన్మాదం లో చేసుకునే వివాహ ఒప్పందాలు ఎలా చెల్లుతాయి ? ఖచ్చితంగా వాటిని సమాజం తరపున తల్లి తండ్రులు కాని , కోర్టులు కాని సమీక్షించి వివాహాలకు ఆమోదo తెలిపేలా చట్ట సవరణలు రావాల్సిందే . ఉదాహరణకు పై కేసులో ఇద్దరూ డాక్టర్లు అయినప్పటికీ వారి వైవాహిక నిర్ణయాన్ని హై కోర్టు అంగికరిమ్చలెదు అంటే , వారి మద్య ఇచ్చి పుచ్చుకున్న SMS లు పరిసిలించాక  వారిద్దరూ లేక వారిలో ఒకరు   అపరి పక్వ మనస్కులు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే   హై  కోర్టు పై విదంగా వ్యాక్యలు  చేసి ఉంటుంది .డాక్టర్లే  తమ వివాహం విషయం లో అంత అపరిపక్వంగా ఉంటె మరి మనదేశం లో సామాన్యులు , వారి వయసు వేడిలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి . ఆలోచించండి !.

    కేరళ హై కోర్టు వారి తీర్పును ప్రచురించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ కోసం క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి
http://www.newindianexpress.com/cities/kochi/Parents-Have-a-Say-in-Marriage-of-Their-Children-Kerala-HC/2014/03/01/article2083620.ece#.UxUjUc5ADYf

    అలాగే  తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన అనే టపా కోసం " http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html ని క్లిక్ చేయగలరు
                                                  (3/4/2014 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ప్రేమ పెండ్లిళ్ళు విషయంలో "మనవు" వాదానికి బలం ఇచ్చిన కేరళ హైకోర్టు వారి డివిజన్ బెంచ్ తీర్పు !.

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×