Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

"యమ వాహనం " ను దొంగిలించబోయి,"యమ లోకం " కు వెళ్ళిపోయిన "యమ దొంగ " !!!


                                                                 

ఈ వింత సంఘటణ ఆగ్రాకు సమీపంలో ఉన్న నాగల మణి అనే గ్రామంలో జరిగింది . ఆ గ్రామంలో సత్య ప్రకాష్ అనె ఆసామికి 'యమ వాహనం ' ని తలపించే మాంచి గేదె  ఒకటి ఉంది .దానిని రోజూ లాగే తన పశువుల దొడ్లో కట్టేసి ,నిశ్చింతగా పడుకుండి పోయాడు ఆసామి సత్య ప్రకాష్ .

   అర్దరాత్రి వేళ ఒక జంతువుల దొంగ సత్య ప్రకాష్ దొడ్లోకి ప్రవేశించి సదరు గేదె ను  చూసాడు .దానిని చూడగానే అతడికి 'యమ ఆశ 'కలిగింది .బాగా బలిసి ఉన్న అ గేదె కు  మార్కెట్లో మంచి గిరాకి ఉంటుందని తలచి ,మెల్లగా దానిని  పలుపుతో సహా తప్పించి తన వెంట తీసుకు పోసాగాడు .ఆ మహిషి  కూడా వీడెక్కడికి తీసుకు వెళతాడో చుదామని సరదా పడి ,రెండు కిలో మీటర్లు వరకు కిమ్మనకుండా వెంట వెళ్లిందట.కాని రెండు కిలోమీటర్లు నడిచె సరికి కాళ్ళు నొప్పిపట్టి నాయేమో ఇక రాను అన్నట్లు మొండికేసింది కాబోలు ,దొంగ దానిని బలవంతంగా లాగ బోయి  ఉంటాడు . దానితో చిరెత్తుకొచ్చిన ఆ మహిషం కోపంతో తనను కట్టి ఉంచిన పలుపు తాడును గట్టిగా గుంజేసరికి సదరు దొంగ చేయి అందులో ఇరుక్కు పోయింది . అంతే ఒక్క ఉదుటున గేదె  వెనక్కు తిరిగి దౌడు తీయటం మొదలు పెట్టింది .

 దొంగకి,   రెండు కిలో మీటర్లు దున్నను తీసుకు వెళ్ళటానికి 1 గంట పైగా పట్టి ఉంటుంది .కాని రివర్స్ గేర్ లో,దొంగను  ఈడ్చుకు రావడానికి గేదె కు 15 నిమిషాలు మాత్రమె పట్టి ఉండాలి . అలా తనను ఈడ్చుకు వెళుతున్న గేదె లో  దొంగకి యమ వాహనం కన పడి ఉండాలి . రెండు కిలోమీటర్లు ఈడ్వబడటమ్ వలన ,సదరు దొంగ తీవ్ర గాయాల పాలై మరణించాడు .తెల్లారిన తర్వాత తన ఇంటి ముందు ఎదో కోలాహల ధ్వనులు వినిపించడం వలన ,అదేమిటొ చూద్దామని బయటకు వచ్చిన సత్య ప్రకాశకు ,ఇంటి ముందు తన మహిషం ,దాని ప్రక్కనే  గుర్తు తెలియని దొంగ శవం చూసి ఆశ్చర్య పోయాడు. గ్రామస్తులు అందరు వచ్చి తన గేదె  చేసిన వీర క్రుత్యం గురిoచి  పొగుడుతుంటే ఎంతొ పొంగి పోయాడు .చివరకు పోలీసులకు సమాచారం అందిస్తే , వారువచ్చి కేసు నమోదు చేసుకుని దొంగను గుర్తించే పనిలో పడ్డారు అట! అదీ కథ !

"తానొకటి తలిస్తే దైవమొకటి తలుచును" అనే దానికి ఈ ఉదంతం ఒక మంచి ఉదాహరణ .

SOURCE :http://timesofindia.indiatimes.com/city/agra/Buffalo-drags-thief-to-death-near-Agra/articleshow/46360148.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI

                                              (27/2/2015 Post Republished).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

"యమ వాహనం " ను దొంగిలించబోయి,"యమ లోకం " కు వెళ్ళిపోయిన "యమ దొంగ " !!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×