Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పేబ్రవరి 14 ,ఈ రోజు రహస్య ప్రేమికుల దినం ! ఎందుకో చూడండి .

                                                                 

               
                               ఈ రోజు వాలెంటైన్స్ డే ! దీనిని ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినం గా బావించి జరుపుకుoటుంటారు . కాని ఈ రోజు ను వాలెంటైన్స్ డే గా పిలవబడటానికి కారణమైన వాలెంటైన్స్ చరిత్ర తెలుసుకుంటే దీనిని ప్రేమికుల దినంగా కాకుండా "రహస్య ప్రేమికుల దినం" గా పిలవాల్సి ఉంటుంది . ఆ కదేమిటో చూదాం !

               వాలెంటైన్  అనే గ్రీసు దేశానికి చెందిన క్రైస్తవ మత పెద్ద ని పేబ్రవరి 14 వ తేదిన ఉరి తీసారట ! అయన చేసిన నేరం ఏమిటంటే చర్చ్ కు వచ్చె యువతి యువకుల మద్య పెద్దలకు తెలియకుండా జరిగే రహస్య ప్రేమలను ప్రోస్తాహిస్తూ వారికి రహస్యంగా తన చర్చ్ లోనే పెండ్లిళ్ళు చేసే వాడట . ఇది క్రీ శ 270 సంవత్సరంలో జరిగింది . అ రోజులలో ఇలాంటి రహస్య ప్రేమలు , పెండ్లిళ్ళు చేయడం నేరం . అది కాక గ్రీసు  దేశం విదేశి దండ యాత్రలతొ సంక్లిష్ట పరిస్తుతుల్లో ఉన్న సమయం . రాజు వద్దని వారించినా వినకుండా మొండిగా ఎదురు తిరిగినందుకు అతనిని ఉరి తీసారట !. అ తర్వాత కాలంలో పాప్ గెలిలియోస్  అనే అయన పిబ్రవరి 14 ను ప్రేమికుల దినం గా ప్రకటించాడు అట . ఈ విదంగా ఇది ఒక మత పరమైన ఆచారం . దీనికి మన దేశ సంస్కృతికి సంబందం లేదు . అందుకే ఇన్నాళ్ళు మన దేశం లో ఎవరూ పాటించ లేదు . పేరుకు ప్రేమ అని పైకి చెపుతున్నా , నిజమైన ప్రేమికులు కంటే చాటు మాటున కలుసుకునే రహస్య ప్రేమికులే ఈ రోజును ఎక్కువుగా ఇష్ట పడుతున్నారట !.


      అయితే  మన దేశం లో వ్యాపార సంస్కృతీ పెరిగాక దాని తాలూకు విదానాలు , వ్యాపార సంస్కృతీ  అభివృద్ధి కి అనుకూలమైనటు వంటి వాటిని ప్రోత్సాహించడం వ్యాపార వాదులకు అనివార్య మైంది . అందుకే ఇప్పట్టి పరిస్తితులకు ముక్యంగా మన దేశ  సంస్కృతిని నాశనం చేసే ఇటువంటి "ప్రేమికుల దినం'" లను కొంత మంది వ్యాపార వాదులు , కుహనా స్వేచ్చా వాదులు ప్రోత్సహిస్తున్నారు . దిని వలన "బహుమతులు" పేరిట కోట్ల కొద్ది వస్తు వ్యాపారం జరుగుతుంది, వ్యాపార వాదులకు లాభం . కాని వయసు వ్యామోహం లో బంగారు బవిశ్యత్ ను పాడు చెసుకుo టున్న భారతీయ యువతకు "ప్రేమికుల దినం" పనికి రానిదే . ప్రేమల పేరుతొ ఇచ్చ వచ్చినన్నాల్లు కన్ను మిన్ను కానక తిరిగే యువతి యువకుల్లో , ప్రేమికుడు కాదన్నాడని పోలిస్ స్టేషన్ లో కేసులు పెట్టె వారు తక్కువేమీ కాదు మన సమాజంలో . మరి ప్రాస్చ్యాత దేశాలలో డేటింగ్ చేసే వారు అనక కాదంటే పోలిస్ కేసులు పెడతారా ? పెట్టరు. ఎందుకని ? ప్రేమ పేరుతొ కాని మరే పేరుతొ కాని ఒక స్త్రీ ఒక పురుషునితో తిరిగితే అతడినే  పెండ్లి చేసుకోవడం మన సంస్కృతిలో బాగం . అంతే  కాని టెస్టింగ్ ల పేరుతొ డేటింగ్ లు చేసే సంస్కృతీ కాదు మనది .


                             స్వేచ్చా శృంగార వాదం  అనేది మన దేశం లో గిరిజన సంస్కృతిలో బాగంగా ఒకప్పుడు ఉండేది అట . ఎప్పుడో నాగరికత పుట్టకముందు.. పాత రాతి యుగంలో... మనిషి బట్ట కట్టడం నేర్వకముందు సామూహిక శృంగారం అమలులో ఉండేది. అప్పటి నాగరికతకు సంబంధించి మానవులకు ఒక పద్ధతి అంటూ ఉండేది కాదు. నచ్చినవారితో విచ్చలవిడి శృంగారం లేకుంటే సామూిహకంగా కూడా శృంగార కార్యకలాపాలను బాహాటంగా చేసేవారట. ఆ తర్వాత కాలంలో రవికెల పండగ...అనే ఒక దురాచార సంస్కృతీ  ఉండేదట . ఇటువంటి సంస్కృతి కొండ జాతుల్లో ఉండేదట. దానికి అందంగా వాళ్లు పెట్టిన పేరు రవికెల పండగ.అదేమిటంటే  నెలలో వచ్చే పున్నమి రోజున యువతీయువకులు అంతా ఊరి చివర ఒక గుహ వద్దకు చేరుకుంటారు. ముందుగా యువతులు ఆ గుహలోకి వెళ్లి తమ రవికెలు విప్పి బయటకు విసిరేస్తారు. అన్ని రవికెలు కలిపి కులపెద్ద పెద్ద బుట్టలో వేసి మగవారికి కళ్లకు గంతలు కట్టి రవికెలు తీయిస్తారు. ఎవరికి ఏ రవికె వస్తే ఆ రోజు ఆమెతో అతడు శృంగార కార్యకలాపంలో పాల్గొనాలి. అయితే ఎవరికి వారు జంటలను ఎన్నుకోగానే... అంతా కలిసి చీకటి గుహలో సామూహికంగా సృష్టికార్యం గుట్టుగా నిర్వహించేవారు.ఇటువంటి అనాచారం వలననే "పండుగ నాడు కూడా పాత మొగుడేనా " అనే సామెత వచ్చింది !.ఇప్పటికి కొన్ని ప్రాస్చ్యాత దేశాలలో కొన్ని "రహస్య క్లబ్ " లు ఇలాంటి తప్పుడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి అట ! అయితే విచ్చల విడి శృంగార స్వెచ్చతొ "ఎయిడ్స్ " అనే బూతానికి బలి అవుతున్న యువతను రక్షించడానికి సంబందిత ప్రబుత్వాలు వీటి మిద తీవ్ర చర్యలు చేపట్టి నియత్రిస్తున్నాయి అట !

                        ఏది ఏమైనా భారత దేశం వంటి సంప్రదాయక దేశాలలో ఇటువంటి కుహన ప్రేమ కార్యకలాపాలకు తావులేదు. మన ధర్మం ప్రకారం మనవారు నూరేళ్ల దాంపత్య జీవనానికి మూడుముళ్ల బందం ప్రాతిపదికగా కట్టు బడి ఉంటారన్నది నిజం.చిన్నప్పుడు తల్లి తండ్రులు , తోడబుట్టిన వారి ప్రేమలో , యవ్వనంలో బార్యా పిల్లల ప్రేమలో , వృద్దాప్యంలో పిల్లల ప్రేమలో ఇలా నిరంతరం ప్రేమైక  జీవితాన్ని గడిపే మనకు ప్రత్యేకంగా "ప్రేమికుల దినం" ఏమిటి ? తద్దినం లాగా !? 

                        ఇటు వంటి రహస్య ప్రేమికులు గురించి ఒక సినిమా పాట  కూడా ఉంది.
                                            (14/2/2014 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

పేబ్రవరి 14 ,ఈ రోజు రహస్య ప్రేమికుల దినం ! ఎందుకో చూడండి .

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×