Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

                                                                                     

నేను ఇదే బ్లాగులో  వెనుకటి టపాలలో చెప్పినట్లు, ప్రస్తుతం మనకు లభిస్తున్న  "మనుధర్మం " అనే గ్రందం ఒకరి చేత రచింపబడినట్లు కనపడటం లేదు. మనువు రాసిన మూల గ్రంధాన్ని ఆ యన తర్వాతి రచయితలు లేక రుషులు అప్పటి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ రావడం చేతనే అందులోని ఒక శ్లోకానికి , మరొక శ్లోకానికి వైరుధ్యాలు ఏర్పడి ఒక దానికొకటి పొంతన లేకుండా పోయింది . ఇది మనుదర్మం ని ఆసాంతం జాగర్తగా పరిసీలించే వారివారి కైనా ఇట్టె అర్దమవుతుంది . క్రమబద్దమైన  జీవన విదానం   గురించి ప్రస్తావించిన నా టపా"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."  లో ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగినది. .

     ఉదాహరణకు స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించవలసిన తీరు గురించి మొదట్లో శ్లోకాలు ఎంతో ఉద్దాత్తంగా ఉన్నాయి . స్త్రీలను గౌరవించని , పూజించని కులం లేక జాతి సర్వనాశనం అవుతుందని చెప్పిన మనువు మహాశయుడు ఆ తర్వాతి శ్లోకాలలో స్త్రీలను దారుణంగా అణచివేసి తమ ఆదిపత్యంలో ఉంచుకుని వారికి స్వాతంత్ర్యం లేకుండా చేయాలని చెప్పడం విడ్డూరమే ! కావాలంటే మను విరచిత తాత్పర్య సహిత శ్లోకాలు  చిత్ర రూపంలో  ఇవ్వబడినవి . చూడగలరు .
                                                                       




                                 పై విషయం బట్టి మనకు అర్ధమవుతున్నది ఒకటే . మను ధర్మం కాలం నాటికి స్త్రీల మీద అంక్షలు లేవు . వారిని గౌరవ , పూజాబావాలతో చూడమనే చెప్పడం జరిగింది . కాని రాను రాను సమాజంలో బుద్దుడు, జైన ప్రబావం తో స్త్రీ, పురుషులు  సంసారాలు వదిలేయడమో  లేక పెండ్లి పెటాకులు లేకుండా ఊళ్ళ వెంబడి తిరుగుతూ  , ప్రకృతికి విరుద్దమైన "కోరికలు లేకుండా జీవించాలీ  ,కోరికలు లేకుండా జీవించాలీ"  అనే బోదలు, పగలల్లా  ప్రజలకు చేస్తూ , రాత్రయ్యేసరికి ఆ కోరికలకు తామే తాళలేక ఒకరితో ఒకరు కలిసి పోతూ , చివరకు బౌద్దారామాలు గర్బపు గ్రక్కులతో మారుమ్రోగి పోతుంటే , అటువంటి వారిని చూసి అసహ్య హించుకున్న వారెవరో , దీని అంతటికి కారణం స్త్రీలు పెండ్లి పెటాకులు లేకుండా  బౌద్ద సన్యాసినిలు మారి పోవడమే అని , వారిని కట్టడి చేయకపోతే సమాజంలో ఒక క్రమబద్దమైన జీవనం సాద్యం కాదని తలచి "మను దర్మం " ని తదనుగుణంగా ప్రక్షిప్తం చేసి ఉంటారు. పెచ్చరిల్లిన బౌద్దుల ఆగడాలు ను అశ్యహించుకున్న ఆ నాటి ప్రజలు ప్రక్షిప్తమయ మనుధర్మం ని ఇష్టం లేకపోయినా సమాజ బాగు కోసం అంగీకరించి ఉండబట్టె అది చాన్నాళ్ళు అమలులో ఉండి ఉండవచ్చు .

     మనుదర్మం ప్రక్షిప్తం అయ్యే కాలానికి ఎటువంటి దౌర్బాగ్య పరిస్తితులు  సమాజం లో ఉన్నాయో , అంతకంటె ఘోరమైన పరిస్తితులు నేడు ఈ  సమాజం లో ఉన్నాయి. అప్పటి  "బడ్డు బైరాగి వాదం" స్త్రీ పురుషులలో విశ్రుకంలతను ప్రోత్సాహిస్తే , ఇప్పుడు "మై చాయిస్ వాదం " అంతకంటె దారుణమైన విశ్రుంఖలతను వ్యాప్తి చేస్తుంది . అప్పుడు పెండ్లిళ్ళు పెటాకులు వద్దు అన్నారు. ఇప్పుడు దానితో పాటు అడాళ్ళను ఆడాళ్ళు , మగాళ్ళని మగాళ్ళు పెండ్లిళ్ళు చేసుకుంటాం అని అనటమే కాదు , తాము చేసే ప్రక్రుతి విరుద్దమైన పనులకు చట్టబద్దత తెచ్చుకున్నారు. స్త్రీలు పట్ల పురుషులు , పురుషులు పట్ల స్త్రీలు ఒక రకమైన ఏహ్యబావం పెంచుకోవటం వలననే వారు స్వజాతి పట్ల ఆకర్షితులై గలీజు పనులకు పాల్పడుతున్నారు. ఒక క్రమబద్దమైన కుటుంబ జీవనం విదానం అనేది లేకపోతే నేటి మై చాయిస్ వాదులే రేపటి "జంతు ప్రేమికులై " తాము జంతువులనే పెండ్లాడి వాటితోనే సంసారం చేస్తామన్నా ఆశ్చర్య పోనవసరం లేదు.
                                                                       

                       కాబట్టి పై  రుగ్మతలకు మందు కనిపెట్టాల్సిన తరుణం ఆసన్నమయింది . సహజసిద్దమైన స్త్రీ పురుషుల కలయికతో,కూడిన కుటుంభ జీవన విదానం ని అంకిత బావంతో కొనసాగించడమే  దీనికి సరి అయిన మందు . దానిని ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .సమాజంలో , కుటుంభం లో  స్త్రీ పురుషులూ ఇరువురూ సమానులే అనే బావజాల వ్యాప్తికి క్రుషి చేయాలి . స్త్రీ పురుషులను కుటుంబ జీవన విదానానికి కట్టడి చేయాలి. వ్యక్తీ స్వేచ్చ సహజ కుటుంబ స్వేచ్చలో బాగంగా ఉందాలి తప్పా , దానికి వెలుపల ఉండరాదు. ఈ  నియమం స్త్రీ పురుషులకు సమానంగా వర్తించాలి. పనికిమాలిన స్త్రీ వాదం, పురుషవాదాలు పక్కనపెట్టి , అంతర్జాతీయ న్యాయ సూత్రాలు గుర్తించిన కుటుంబ పరిరక్షణ వాదమే మానవ వాదంగా మారాలి . అదే నిజమైన మన వాదం .
                                                       (5/2/2016 Post Republished). 


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×