Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?

                                                      

మనవు బ్లాగు వీక్షకులకు రధసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తో 


                                   నాకు "రధ సప్తమి" రోజు అంటే ఒక ప్రత్యెకమైన రోజు .ఎందుకంటే అ రోజు సూర్య భగవానుడి పుట్టిన రోజు అని మాత్రమె కాదు . నేను పుట్టిన రోజు కూడా .    మా నాన్న గారు వ్యాపారం నిమిత్తం కృష్ణా జిల్లా కవులూరు గ్రామం నుండి ఖమ్మం జిల్లా లోని మా స్వగ్రామం అయిన గార్లఒడ్డు కు వచ్చి కలప వ్యాపారం చేస్తున్న రొజులవి. నా కంటే ముందుగా జన్మించిన మా అన్నయగారు, అక్కలు ఇద్దరు కవులూరులోనే జన్మించారు . మా చిన్నక్క  గారు పసి పాపగా ఉండగానే కుటుంబం అంతా గార్లఒడ్డు వచ్చేశారు . అప్పుడు మా కుటుంబం ఒక పూరి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోనే  ఉండేది .

          నిజానికి గార్లఒడ్డు  ఒక కుగ్రామం . చుట్టూ పెద్ద అడవితో గుట్టల మద్య నిర్మించబడిన గ్రామం . మా ఇల్లు ఊరికి దూరంగా మా పొలంలో ఒంటరిగా ఉంటుంది .అది ఒకప్పుడు పులులు ఉండే ప్రాంతం అట . అయితే మా నాన్న గారు పారెస్త్ కాంట్రాక్టర్ కాబట్టి , మా ఇంటి చుట్టూ 200 మంది వర్కర్స్ ఇండ్ల సముదాయం , బొగ్గు బట్టీలు తో ఎప్పుడూ జనంతో కళ కళ  లాడుతూ అదే ఒక చిన్న ఊరిని తలపింప చేసేదట . అయితే ఇలా మా కుటుంబం చల్లగా వర్దిల్లడానికి   మూల కారణం మేము నమ్మి కొలిచిన మా ఇల వేల్పులైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మరియు నాగేంద్ర స్వామీ .ఎప్పుడో మా పూర్వికుని హయాంలో అది కూడా గుంటూర్ జిల్లాలోని కట్ట మూడి గోరంట్ల అనే గ్రామంలో మా ముత్తాత గారు గోదానాలు , బూదానాలు చేసే స్తాయి స్తితిమంతుడు అంట . కాని అయన గారి ఎముక లేని చేయి వలన మా తాతగారు వ్యవసాయ కూలిగా మారి తమ మేన మామల ఇంటికి కవులూర్ వచ్చెసారు. అలాగే సాదారణ వ్యవసాయ కూలిగా, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్న మా నాన్న గారు ముగ్గురు పిల్లలు కలిగాక వ్యాపారం నిమిత్తం ఖమ్మం జిల్లా వచ్చారు . ఖమ్మం జిల్లాలోని చాపరాల పల్లి, మాణిక్యారం , గుబ్బగుర్తి, ఆరికాయల పాడు, ఇమామ్ నగర్ మొదలగు చోట్ల వ్యాపారం చేసిన అయన చివరకు గార్లఒడ్డు లో స్తిరపడ్డారు .గార్లఒడ్డు లో  జమిందార్ తర్వాత జమిందార్ అని పేరు గాంచారు.
                                                         

ఓంభూర్భువస్సువ: తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్! 


  

                                           అది 1961 వ సంవత్సరం . మా కుటుంబం పూరి పాకలో ఉంటున్న రొజులు. మా అమ్మగారు ప్రసవ వేదనలు పడుతున్న సమయం . ఆ రోజు మాఘ శుద్ద సప్తమి. జనవరి 23 వ తారికు. అ రోజు మా తల్లి తండ్రులకు బాగా గుర్తు ఉన్న రోజు . ఎందుకంటే అగిరి పల్లి  లో రదసప్తమి రోజున శోభానా చల స్వామీ రదం మిద ఊరేగే రోజు అట . అటువంటి రోజున సూర్యుడు మా ఇంటి ఎదురుగా దూరంగా ఉన్న కల్లూరు గుట్టల మిద నుంచి ఉదయిస్తున్న వేళ , సరిగ్గా నేను బూమి మిద పడిన వేళ . అటు సూర్యుడు అరుణ కాంతితో ఉదయిస్తుంటే , నేను మాత్రం నల్లగా పుట్టాను అట .నేను పుట్టాకే మాకు అదృష్టం బాగా కలసి వచ్చిందని మా అమ్మ గారు అంటుండే వారు . అలా నేను , అ తర్వాత రెండేళ్ళకి మా చెల్లి పుట్టి మొత్తం మా తల్లి తండ్రులకు 5 గురు సంతానం అయ్యాం . గార్లఒద్దు వచ్చిన తర్వాత , మా ఇల వేల్పులుగా నాగ , నరసింహ దేవుళ్ళను పూజించడం వలన అక్కడ జన్మించిన నాకు "శివ నాగ నరసింహా రావు " అని పేరు పెట్టడం జరిగినప్పటికీ , బడిలో చేర్చిన సమయంలో కేవలం నరసింహ రావు అని మాత్రమే ఉంచారు . అలాగే ఇంట్లో ముద్దుగా "రాజు" అని పిలిచే వారు . ఇప్పటికి బందువులు అదే పేరుతొ పిలుస్తుంటారు . అది నా జన్మ వృత్తాంతం . నేను  సూర్య జయంతి నాడు జన్మించటం , నా శ్రీమతి పేరు "అరుణ కుమారి " కావటం అంతా యాదృచ్చికం అయినప్పటికీ  ఏదో అవినా బావ సంబందం ఉంది అని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది .

  అ విదంగా సూర్యుని పుట్టిన రోజు అయిన రద సప్తమి నాడు జన్మించాను కాబట్టి ఈ రోజు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉండటం లో ఆశ్చర్యం ఏమి ఉంది ? ! మరిన్ని వివరాలు కోసం క్రింది ఈ టపా లింక్ ని  కూడా చూడండి .

                "నాగుపాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు   

                                   (5/2/2014 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×