Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అత్యాచార నిరోదానికంటే, అప్పులు వసూలు చేసుకోవడానికి ఎక్కువుగా ఉపయోగపడుతున్న "నిర్భయ" చట్టం


         


                                     ఈ దేశంలో కఠిన చట్టాలు చేయడానికి మన ప్రజా ప్రతినిదులకి నెలరోజులు పడితే దానిని దుర్వినియోగం చేయడానికి కేటుగాళ్లకు ఒకే  ఒక రోజు చాలు ! డిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన అందోళన ల వల్ల , స్త్రీల మిద జరుగుతున్నా లైంగిక దాడులను నిరోదించే ఉద్దేశ్యంతో "నిర్భయ " చట్ట సవరణలు చేసారు . ఈ కఠిన చట్ట సవరణల వల్ల స్త్రీల మిద అత్యాచారాలు అగుతాయని చట్ట నిర్మాతల తో పాటు ప్రజలూ ఆశించారు . కాని విచిత్రంగా డిల్లిలోనే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా లైంగిక దాడులు తగ్గినట్లు లేదు . అయితే నిoది తులకి ఈ  కేసుల్లో బెయిల్ ఇవ్వడమనేది ఉండదు కాబట్టి , విచారణ కూడా త్వరగానే పూర్తీ చెయ్యడం వలన కేసుల డిస్పోజల్స్ కూడా త్వరగానే జరిగాయి . కాని సంవత్సరం తర్వాత గణాంకాలు పరిశిలిస్తే దిమ్మ తిరిగే నిజాలు వెల్లడి అయ్యాయి . చివరకు వేశ్యలు  అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా పోలీసులను మేనేజ్ చేసి రేప్ కేసులు పెడుతున్నారు అంటే ఈ దేశం లో కఠిన చట్టాలకు పట్టిన దుస్తితి ఏమిటో వేరే చెప్పక్కర లేదు !.

    డిల్లీలో 2012 సంవత్సరంలో మొత్తం 661 రేప్ కేసులు నమోదు అయితే అందులో 304 కేసులు తప్పుడు కేసులు గా నిర్దారణ అయి నిందితులు విడుదల చేయబడ్డారు . అంటే తప్పుడు కేసులు శాతం 46%. అదే నిర్భయ చట్ట సవరణల తర్వాత 2013 లో మొదటి ఎనిమిది నెలలలో అంటే ఆగస్ట్ వరకు విచారిoచబడిన 318 రేప్ కేసులలో 237 కేసులు లో నేర నిరూపణ కాక నిందితులు విడుదల చేయబడ్డారు .అంటే సుమారు 75% తప్పుడు కేసులు అన్న మాట . ఆ  తర్వాత నమోదైన కేసులలో కూడా ,ఈ సంవత్సరం లో విచారణ పూర్తీ చేసుకున్న వాటిలో 70% కేసులలో నిందితులు విడుదల చేయబడే అవకాశ ముందని పోలిస్ వర్గాల సమాచారం . అత్యాచారాల కేసులలో నిజమైన బాదితులు ఎవరు కూడా నిందితులతో రాజీపడే అవకాశ ముండదు . మర్డర్ చేసినా క్షమించవచ్చేమో కాని మానబంగo చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అనేది సాంప్రదాయ బావన . కాని మరి ఎందుకు డిల్లీలో 75% కేసులలో నిందితుల మిద నేర నిరూపణ కావడం లేదూ అంటే ఆ కేసులు పెట్టడం వెనుక ఉన్న మతలబె వేరట ! అవేమిటో చూదాం

   ఒక కాల్ గర్ల్ బేరం కుదుర్చుకుని, పని పూర్తయ్యాక విటుడు అనుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తే వాడి మిద రేప్  కేస్ బుక్ అయినట్లే ! అలాగే ప్రేమ పేరుతొ ఇష్టం వచ్చినంత కాలం తిరిగి తీరా పెండ్లాడమంటే ముఖం చాటు వేసే ప్రియుల మిద "నిర్భయ " చట్టం ప్రయోగించడమే . మొండి బకాయిలు ఎంతకీ సెటిల్ కాకపొతే , పోలిస్ వారి సౌజన్యంతో అత్యాచార కేసు నమోదు చేస్తే 3 నెలల్లో డబ్బు అణా పైసలతో సహా తిరిగి రావాల్సిందే !. వివాహేతర సంబందాలు పెట్టుకుని కొంతకాలం తర్వాత జ్ఞానోదయం అయి దానిని వదిలించుకొవాలనుకునె వారు మర్యాదగా ఒక రేప్ కేసు పెట్టించుకుని , మాటర్  సెటిల్ చేసుకున్నాకే ఎక్ష్త్రా మారిటల్ రిలేషన్ వదులుకోవాలి తప్పా అన్యదా కాదు . ఇలాంటి అన్ని కేసులకి అత్యంత తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించ గల దమ్మున్న చట్టం , నిందితుల  దుమ్ము లేపే చట్టం "నిర్భయ" . అందుకే దానికంత డిమాండ్ !.

   నువ్వు ఒకందుకు పోస్తే , నెనొకoదుకు తాగా ! అని సామెత . అలాగే అత్యాచారాల నిరొదాల కోసం ఉద్దేశిం చబడిన ఒక కఠిన చట్టం ఇలా దుర్వినియోగం కావడానికి మూల కారణం ప్రజలలో తప్పుడు కేసులు పెడితే ప్రాసిక్యూషన్ కి గురి కావాల్సి వస్తుందనే భయం లేకపోవడం . కోర్టులలో అబద్ద మాడితే ప్రాసిక్యూట్ చేసి శిక్షించ వచ్చు . కాని న్యాయ మూర్తులు అందుకు సిద్దంగా ఉండరు . ఎందుకంటే అటువంటి కేసులలోకేసు విచారించిన న్యాయమూర్తులే వేరొకరి ముందు సాక్షులుగా హాజరై తమ కోర్టులో నిందితుడు అబద్దం సాక్ష్యం చెప్పాడని చెప్పాలి . కాబట్టి ఆ రిస్క్ తీసుకోరు . అది కాక ఇలా కోర్టుల్లో సాక్ష్యం చెప్పే వారిని శిక్షిo చడం మొదలు పెడితే , నిజమైన బాదితులు కూడా నిర్బయంగా ముందుకు ముందుకు రాలేరని అంటుంటారు . అలాగే తప్పుడు ప్రాసిక్యూషన్ కి పోలిస్ వారి మిద కూడా కేసులు పెట్టి వారిని ప్రాసిక్యూట్ చెయవచ్చు . కాని చేయలేరు . ఎందుకంటే సేమ రీజన్ . దానికి పోలిస్ వారి మనో స్తైర్యం సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి . "సత్యవమెవ జయతే " అని అదికార నినాదం కలిగిన దేశంలో ప్రజలు ఇలా తప్పుడు కేసులకు కఠిన చట్టాలు ఉపయొగిo చుకున్టుంటే వారి మిద చర్యలు తీసుకోలేని ఔదార్యత్వమ్ మన న్యాయ మూర్తుల్లో ఉన్నంత కాలం ఎ చట్టమైనా చేయగలిగింది ఏమి ఉండదు అనుకుంటా ?

   నగర రాజ్య పాలన సరిగా నడపాలంటే పాలకుడు తత్వవేత్త అయినా కావాలి లేదా తత్వ వెతలు అయిన వారే పాలకులు గా రావాలి అంటాడు "ప్లేటో ". భారత దేశ0 లో  తత్వ వేతల పాలన కంటే తప్పించుకు పోయే నేతల పాలనే సమర్ద పాలన అని ప్రజల విశ్వాసం . యదా ప్రజా ! తదా రాజా .! 
                        (23/2/2014 Post (except image)  Republished).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

అత్యాచార నిరోదానికంటే, అప్పులు వసూలు చేసుకోవడానికి ఎక్కువుగా ఉపయోగపడుతున్న "నిర్భయ" చట్టం

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×