Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

"మను ధర్మం " లేని దేశం లో 43,200 సార్లు రేప్ కు గురి అయిన "మహిళా లాయర్ "!!!?

                                                                           


                                     భారతదేశం లో  స్త్రీలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు  తక్కువని , అదే అభివృద్ధి చెందిన ఆదునిక దేశాలలో అయితే స్త్రీలను పూలలో పెట్టి పూజిస్తారని, స్త్రీలు  కారు ఎక్కుతుంటె పురుషులు డోర్ తీసి వినయంగా నిలబడతారని,  దేనికైనా లేడిస్ పస్ట్ అంటూ స్త్రీలకు అత్యంత ప్రాదాన్యత ఇస్తారని , కొంతమంది విదేశి వ్యామోహపరులు చెపుతుంటే , నిజమే కాబోలు, మనం ఆ దేశాలలో పుట్టకుండా ,భారతదేశం లో ఎందుకు పుట్టామా ? అని మదనపడే వారికి షాకింగ్ న్యూస్ ఇది.

                 ఆధునిక సంస్క్రుతి వెల్లివిరిసే మెక్సికో నగరం ఒక లాయరమ్మ కన్నీటి గాధ. అప్కోర్స్ ఆమె వ్యధాభరిత జీవితమే ఆమెను లాయర్ అయ్యేందుకు పురికొల్పాయి.  మెక్సికోలో ఉంటోంది 23 ఏళ్ల కార్లా జాకింటో. ఆమె మనుషుల అక్రమరవాణాను నిరోధించే లాయర్. మెక్సికోలో ఆమెకి మంచి పేరుంది. అదంతా ఇప్పుడు... కానీ ఒకప్పుడు ఆమె వ్యభిచారంలో మగ్గి అందులోంచి లక్కీగా బయటపడిన పదహారేళ్ల అమ్మాయి. మెక్సికోలో ఎక్కడా హ్యుమన్ ట్రాఫికింగ్ మీద సదస్సు జరిగినా అక్కడా కార్లా మాట్లాడాల్సిందే. అంతేకాదు అమెరికన్ కాంగ్రెస్, వాటికన్ సిటీ... ఇలా ఎక్కడా సమావేశాలు జరిగినా అక్కడికి కార్లా వెళ్లి... తన కథనే వినిపిస్తుంది. ఆ కధ ఏమిటంటే 
                            
                   "కార్లా పదేళ్ల వయసులో ఒకసారి ఇంటికి లేటుగా వచ్చింది. దాంతో తల్లి ఆ రాత్రి తలుపు తీయకుండా బయటే ఉంచింది. తల్లి వ్యవహారంతో బాధలో ఉన్న కార్లాకి ఓ 22 ఏళ్ల స్నేహితుడు చేరదీశాడు. ప్రేమగా మాట్లాడడంతో అతనితో వెళ్లి పోయింది క్లారా. మూడునెలలు బాగానే చూసుకున్నాడు. ఆ తరువాత వ్యభిచార గృహం నడిపే రాక్షసుడికి అమ్మేశాడు. పదేళ్ల వయసులోనే చాలా కష్టాలు పడింది క్లారా. రోజుకి 30 మంది విటుల దగ్గరికి పంపించేవాడు ఆ రాక్షసుడు. ఉదయం పది గంటల నుంచి అర్థరాత్రి దాకా అదేపని. అలా నాలుగేళ్లు నరకం అనుభవించింది. పదిహేనేళ్ల వయసులో తల్లి అయి పాపకి జన్మనిచ్చింది. ఒక విటుడికి పుట్టిన ఆ బిడ్డని అతనే తీసుకెళ్లి పోయాడు. ఓసారి ఒక విటుడు కార్లా ని ప్రేమగా చూశాడు. ఆ విషయం తెలిసి వ్యభిచారం గృహం నడిపే రాక్షుసుడు... ప్రేమలో పడ్డావా అంటూ ఇనుప బెల్టుతో ఒళ్లంతా రక్తం కారేలా... కొట్టాడు. ఇలా... నాలుగేళ్లు నరకం అనుభవించింది క్లారా. తన అంచనా ప్రకారం ఆ నాలుగేళ్లో దాదాపు 43,200 సార్లు అత్యాచారానికి గురైనట్టు చెప్పింది. అదృష్టం బాగుండి ఒక రోజు పోలీసులు చేసిన 'యాంటీ ట్రాఫికింగ్ ఆపరేషన్' లో బయటపడింది. హోటల్లో అంతా పది నుంచి 16 ఏళ్ల అమ్మాయిలో పట్టుబడడంతో పోలీసులు మానవతా దృక్పథంతో వారిని సంరక్షణా కేంద్రాలకు పంపించారు. అలా కొత్త జీవితంలోకి వచ్చింది క్లారా. తనలా మరే ఆడపిల్లా బలవ్వకూడదని.. లా చదివింది. మనుషు అక్రమ రవాణాను అడ్డుకునే పనిని చేపట్టింది. మెక్సికోలో క్లారాలా పదేళ్ల వయసు నుంచి 20 ఏళ్లలోపే ప్రతియేటా కనీసం 20 వేల మంది అమ్మాయిలు వ్యభిచార కూపాల్లోకి లాగబడతున్నారు. వారందరినీ కాపాడే పనిని క్లారా మొదలుపెట్టింది".(టైమ్స్ అఫ్ ఇండియా వారి సౌజన్యం తో). 

                                           కాబట్టి ప్రపంచం లో ఏ ప్రాంతం అయినా స్త్రీకి ప్రత్యేక రక్షణ అవసరమే. ఆమెకు సహజ రక్షణ ఇచ్చేది కుటుంబమే. కుటుంబం లోనే ఆమెకు రక్షణ లభించని వేళ , మరెక్కడో అది దొరుకుతుందని ఆశించడం ఎండ మావులలో నీరు కోసం వెదుక్కోవడం లాంటిదే . తండ్రో, భర్తో, కొడుకో, అన్నో, ఎవరో ఒకరు స్త్రీకి రక్షణ ఇవ్వవలసిందే . అప్కోర్స్ కుటుంబ రక్షణ అనేది పాత చింత కాయ పచ్చడి లాంటి పనికి రాని బావం  అని అంటూ  ఆధునిక మహిళలు కొందరు "భాయ్ ప్రెండ్ ల కల్చర్ కి అలవాటు పడుతున్నారు. ఇది కూడా ఒక రకంగా పురుష ఆసరా స్త్రీ రక్షణ కు అవసరం అని చెపుతున్న సంస్క్రుతే. కాకపోతే అక్కడ కుటుంబ సబ్యుల తోడు శాశ్వతంగా ఉంటుంది , ఇక్కడ కోరుకున్న వారి తోడు కోరుకున్నంత కాలం ఉంటుంది.  అంతే తేడా? 

                        పై ఉదంతం పరిసిలిస్తే ,పదేళ్ల ప్రాయం లో తల్లి నిరాదరణ కు గురి అయిన కార్లా, 22 ఏండ్ల వాడి పంచన చేరింది. అతడు ఆ పసిదాన్ని వ్యభిచార గృహానికి అమ్మడం,అక్కడ వాళ్ళు ఆమెను రోజుకు 30 మంది విటులకు అప్ప చెప్పడం, ఆమె పిల్లకు తల్లి అయినా వదలకుండా గొడ్డును బాదినట్లు బాదడం , ఇలా 6 యేండ్ల పాటు నరకం చూపించడం లాంటి పనులు ఎవరు చేస్తారు? ఒక అమ్మా , బాబులకు పుట్టని అడ్డాల సంతతికి చెందిన వారు తప్పా! మరి అటువంటి సంతతి కలిగిన  సమాజం ఏ విదంగా స్త్రీలకు ఆదర్శ ప్రాయమవుతుంది? ఆలోచించండి. కాబట్టి స్త్రీ పురుషుల సమానత అనేది ఒక ఆదర్శం మాత్రమే. అది సాదించిన సమాజం లేదు. సాదించడానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం . అంతే ! సాదించే దాక అయినా ఎవరి జాగ్రత్తలో వారుంటే మంచిది . 
                                     మెక్సికో లో మగవారి బుద్దికి అద్దం పట్టె మరొక సంఘటణ గురించి ఇంతకు ముందు నేను రాసిన టపా ఒకటి చుడండి  

ఇండియా ఎడిటర్ అయినా ,మెక్సికో మేయర్ అయినా ఆమె "విషయం " లో ఒకటే అని నిరూపిస్తున్న వీడియో 

                          (29/1/2016 Post republished). 



This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

"మను ధర్మం " లేని దేశం లో 43,200 సార్లు రేప్ కు గురి అయిన "మహిళా లాయర్ "!!!?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×