Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

                                                                           
ఖమ్మం లోని నరసింహా స్వామీ గుట్ట దేవాలయం 
                                                              
                                                                     ఖమ్మం! ఈ పేరు స్తంభాద్రి అనే గుట్ట వలన వచ్చిందంటారు. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో అత్యంత చెత్యన్య వంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా కు పేరుందని మురిసి పోతుంటారు జిల్లా వాసులు. కాని అదే జిల్లాకి ముఖ్యపట్టణమైన ఖమ్మం నడి బొడ్డులో ఒక ఘోరమైన అన్యాయం "ఖమ్మం" పట్టణానికి పేరు రావడానికి కారణమైన "స్తంబాద్రి" గుట్ట మీద వెలసిన’ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి  కి జరిగితే అడిగే దిక్కు లేకుండా పోయింది. కారణం బహూశా ఇక్కడంతా "ఎర్ర చైతన్యమే" తప్పా మత చైతన్యం లేక పోవడం కావచ్చు. ఏదైనా హిందూ మతానికి కాని మత సంస్తకి కాని అన్యాయం జరిగినపుడు, ఏ అర్.ఎస్. ఎస్. వాళ్ళో,బి.జె.పి వాళ్ళొ, అందోళన చెస్తే తప్పా, మతం అంటే "అంట రాని తనం" గా బావించే "ఎర్ర పార్టీల వారు పట్టించుకోరు. మరి ఖమ్మం జిల్లాలో "ఎర్ర పార్టిల" ఆదిపత్యం కాబట్టి హిందువులంతా వెర్రోల్లలాగే ఉండి పోవచ్చు.

     ఖమ్మం పట్టణంలో నడి బొడ్డున ఉన్న పురాతన పర్వతం "స్తంబాద్రి". దాని మీద కొలువై ఉన్న దేవ దేవుడు "శ్రీ లక్ష్మి నరసింహా స్వామి". దీనినే "స్తంబాద్రి గుట్ట" అని కూడ అంటారు. కొన్ని శతబ్దాలుగా ఈ క్షేత్రం హీందువులకు ఆరాద్య క్షేత్రంగా బాసిల్లుతుంది. ఈ గుట్ట యొక్క విశాల్యం సుమారు 40 ఎకరాలు లోపు ఉంటుంది. ఇది పర్వత మయం కావడం వలన అటు వ్యసాయానికి కాని, ఇటు నివాస యోగ్యం కాని కాదు. కాని ఆ దేవ దేవుడు వెలసిన ప్రాంతం కావడం వల్ల ఒక పవిత్ర క్షేత్రమయింది. గవర్నమెంట్ రికార్డుల ప్రకరం ఇది సర్కారీ వారి బూమి గా నమోదై ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పర్వతాన్ని అధికారికంగా దేవాలయానికి ఇవ్వవలసిందిగా కోరినప్పటికి ప్రబుత్వం సాచేత దోరణి అవలంబిస్తూ వచ్చింది. ఎండోమెంట్ వారు కూడా రాజకీయ జ్యోక్యం వల్లా ఏమి చెయ్యలేక మిన్న కున్నారు.

  ఇదే ఖమ్మం పట్టణానికి పడమర వైపు,మున్నేరు వాగు వొడ్డున సుమారు రెండు వేల ఎకరాల సుసంపన్నమైన స్తలం ఉంది. ఇది పట్టణానికి ప్రక్కనే ఉండడం వలన ప్రస్తుతం దాని రేటు ఎకరకి కోటి రూపాయల పైనే ఉండవచ్చు.ఇట్టి స్తల్లాన్ని ౨౦౦౭ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేకర రెడ్డి గారు తనకున్న మతాభిమానంతో నామమాత్రపు రేటుతో "కరుణగిరి" కి కట్ట బెట్టారు. మతాలన్నింటిని సమానంగా చూస్తామనే "లౌకిక రాజ్య" ముసుగులో ఒక మత వాది చేసిన అన్యాయంగా దీని చెప్ప వచ్చు. ఒక వేళా మతాలన్ని సమానమని బావిస్తే వారి, వారి జనాబా నిష్పత్తులానుసారం ఒకే రేటుకి ఆ భూమిని ఇస్తే అది ధర్మమఈన పని గా బావించ వచ్చు. ఈరోజు ఖమ్మలో ఏ దార్మిక సంస్త స్తాపించాలన్నా హిందువులకు బూమి లేని పరిస్తితి.ఒక వేళా లౌకిక అవసరాకు అయినా సరే ఒక సెంటు భూమి ప్రబుత్వానిది లేకుండా పోయింది.

    నేను ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు, మా తాతలు, తండ్రులు  దేవాలయాలకు ఇచ్చిన భూములు ఎండోమెంట్ వారి పుణ్యమా అని పరుల ఆదీనంలోకి వెళ్ళి పోయాయి. ఏదైనా ప్రభుత్వ భూమి ఉందా అంటే, అది కరుణామయులైన ప్రభుత్వ పెద్దల కరుణకు కరిగిపోయింది. ఇక బవిశ్యత్తులో హిందువు అనే వాడు ఏ ధార్మిక సంస్త స్తాపించ లేడు. కారణం కోట్ల రూపాయలు భూమి కొనుగోలుకే సరిపోతుంది. ఇది బహూశా ఖమ్మంలోని హిందువులకే కదు, రాష్ట్రం లోని హిందువులందరిది ఇదే పరిస్తితి కావచ్చు.
       అందుకే హిందూ దాతలారా, మీరు మీ బూములు ఏమైనా దేవాలయలకు కాని, దార్మిక సంస్తలకు కాని దానం చేసి వాటి మీద  ప్రబుత్వానికి అధికారాలు కల్పించకండి. మీ అదీనంలొనో, అది వీలు కాని పక్షంలో, ఒక స్వయం ప్రతిపత్తి విదానం ఉన్న ట్రస్టుకో అప్ప చెప్పండి. ప్రబుత్వ భూములలో కూడా మన జనాభా నిష్పత్తి ననుసరించి హిందూ ధార్మిక సంస్తలకు భ్హూ కేటాయింపు జరగాలి. లేకుంటే దేవాలయాలు కూడా అపార్ట్మెంట్లో స్తాపించే దుర్దశ మనకు పడుతుంది. 

     నోటు:- ఈ "కరుణగిరి" వ్యవస్తాపక డైరెక్టర్ లో ఒకరు ప్రస్సిది గాంచిన "అగస్టా హెలికాప్టర్" కుంభకోణంలో ముక్య సూత్రదారి. ఈ కరుణ గిరి వెనుక  పెద్ద కుట్ర ఉందని అనుమానం కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మరింత సమాచరం తెలిసికోవచ్చు. http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2280665/YSR-family-comes-helicopter-cloud.html  

                                               (18/5/2013 Post Republished).   


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×