Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఏసు ప్రభువు ఇండియా వచ్చాడా ? మేరి మగ్దలీనా ను మారేజ్ చేసుకున్నాడా?

                                                                   

               
                                    యేసు ప్రభువు ఇండియా వచ్చాడు , ఇక్కడి పండితుల దగ్గర జ్ఞాన బోద పొందిన  తర్వాతనే క్రీస్తు గా మారి యూదులకు ప్రభువు అయ్యాడు అని కొందరు కహనీలు చెపుతుంటే , మరి కొందరేమో ఏసు క్రీస్తు అంటె సాక్షాత్తు ఈశ్వరుని ప్రతి రూపమేనని ,కాబట్టి క్రిస్టియన్ మతానికి మూలం భారతదేశం లోని వేదాలలోనే ఉందని, కాబట్టి హిందువులు క్రిస్టియన్ లుగా మారడం అంతే తమ మూల మతం లోకి వచ్చేయడం తప్పా వేరు కాదని , మోకాలికి బట్ట తలకు ముడి వేసే జిమ్మిక్కు కదలు   డంఖా బజాయించి చెపుతుంటే  , మెజార్తీ ప్రజలు అయిన  హిందువులు వారు చేస్తున్న గిమ్మిక్ కధలు తో  కూడిన ప్రలోబాలు వలన హిందూ జాతికి బవిష్యత్ లో కలిగే నష్టాలను ఏ మాత్రం పట్టిచుకోకుండా ఉదాసినంగా ఉండడం చాలా ప్రమాదకరమైన దోరణి. బహూశా హిందువులలో ఇలాంటి ఉదాసిన దోరణి గమనించే కాబోలు బ్రదర్ అనిల్ లాంటి మత మార్పిడి దారులు , ఇండియాలో 1950 నాటికి క్రిస్టియన్ మతస్తులు   50% పైగా ఉంటారు అని చెపుతుంది.

              అసలు ఏసుక్రీస్తు చరిత్ర పరిసిలిస్తే అయన గారు ఇండియా  వచ్చిన దాఖాలాలు లేవు. అసలు ఆయనకు భారతదేశం గురించి తెలుసో తెలియదో ? అయన గారు జీవిత చరిత్రలో 12 సంవత్సరాల నుంఛి 30 సంవత్సరాలు అంటె సుమారు 18 ఏండ్ల పాటు ఏమి చేసాడో , ఎక్కడున్నాడో , అయన గురించి చెప్పిన New Testament  లో చెప్పబడలేదు అంట. దానిని సాకుగా తీసుకుని కొంతమంది ఈ  కాలంలోనే యేసు ఇండియాకి వచ్చి పండితుల దగ్గర జ్ఞాన బోద పొందాడని కహనీలు అల్లేసారు. వీరికి ఇలాంటి కట్టుకదలు సృష్టించడం లో అసలు ఉద్దేశ్యం,క్రీస్తు మతం లోకి చేరడానికి ఇబ్బంది పడె సాంప్రాదాయ హిందువులకి , క్రీస్తు కూడా హిందు పండితుల శిష్యుడె అని చెప్పితే మత సంకరం సులువు అయిపోతుందని. 
 
                   అలాగే ఇంకొంతమంది సంకర పండితులు మరోకరకమైన కహాని చెపుతున్నారు. యేసు గారిని శిలువ వేసాక అయన దాని మీదే 2 రోజులు ఉండి మరలా 3 వరోజున లేచి , అక్కడనుండి బయలుదేరి ఇండియా వచ్చాడని ,కాశ్మీర్ లో తన దివ్య అవతారం చాలించాడు అని ,అక్కడే సమాధి కాబడ్డాడు అని గ్రందాలు రాస్తే , చెవిలో పువ్వులు పెట్టుకుని చదువుతూ తన్మాయనందమ్ చెందుతున్నారు మతం మారిన హిందువులు. మరి ఇలాంటి కదలు సృష్టించడానికి కారణం ఉండాలి కదా .ఉంది మరి !

    హిందూ దేవుళ్ళు అందరూ సినిమాల్లో హీరోలు వలే రాక్షసులను సంహరించి వీరత్వం ప్రదర్శించిన వారు. వీరికి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ తప్పా , దుర్మార్గుల చేతిలో దిక్కు లేని చావు చావడమంటే ఏమిటో తెలియదు. మరి వారిని అరాదిస్తున్న హిందువు లలో, ఎన్ని డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టినా , దుర్మార్గుల  చేతిలో చంపబడిన  వారిని దేవుడు అని అంగీకరించ లేని పరిస్తితి . కాబట్టి పై కధను సృష్టించడం ద్వారా ఏసుక్రీస్తు వారు శిలువ పై మరణించలేదని , 3 రోజుల తర్వాత లేచి ఇండియాకే వచ్చి , కాశ్మీర్ లో స్తిరపడి ఇండియన్ గాడ్ గా మారాడని చెప్పడం వెనుకాల ఉన్న దురుద్దేశ్యం.

       బైబిల్ లో ఉన్న చరిత్ర ప్రకారం అయినా మనకు అర్దం అయ్యేది ఒకటే . ఏసుప్రభువు దేవుడు కాడు. అతడు దేవుని కుమారుడు . తను నమ్మిన సిద్దాంతం ని ప్రజలకు ఎరుకపరచాడు. అది కొంత మంది అప్పటి సాంప్రదాయవాదులకు నచ్చక రాజులకు పిర్యాదు చేసి , వారి ద్వారా ఈయనని మరికొంతమంది ని కలిపి శిలువ వేయించారు. అయన మౌనంగా అ బాదను భరిస్తూ "కరుణామయుడిగా " మిగిలిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే మన బాగవతం లోని ప్రహ్లాదుడుకి ఈయనకి  పోలికలు ఉన్నాయి. ప్రహ్లాదుడు అంతే కదా! తను నమ్మిన సిద్దాంతం ని అందరికి చెప్పేవాడు. ఇది తండ్రి అభీష్టానికి విరుద్దమైనది అని తెలిసి  కూడా వెరువలేదు. చివరకు తండ్రి చేతిలోనే నానా బాదలు పడినా , నమ్మిన దేవున్ని, "ఇందుగలడు అందులేడను సందేహం వలదు " అన్న సత్యాన్ని నిరంతరం ప్రబోదిస్తూ , చివరకు దానిని రుజువు చేసాడు. కాక పోతే ఏసు ప్రభువు కి , భక్త ప్రహ్లాదుడికి తేడా ఏమిటంటె , తన భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు , అయన కొలిచే విష్ణుమూర్తి నిరంతరం కాపాడుతూ , చివరకు కు నరసింహావతారం లో వచ్చి బాదలు పెట్టె తండ్రి రాక్షసుడిని సంహరించి భక్తుడిని కాపాడితే, దేవుడు  కుమారుడు ఏసు  ను రక్షించడానికి ఏ దేవుడు రాలేదు కాబట్టి అయన సిలువ అయ్యాడు. అదీ తేడా! తత్తిమాదంతా నూటికి నూరు పాళ్ళు కల్పితమే! 

  ఇంకొంత మంది అయితే ఏసు ప్రభువు అవివాహితుడు కాదని , అయన మేరీ మగ్దలీనా అనే ఆవిడను వివాహమాడాడు అని గ్రందాలే రాసారు. ఈ  కదలు నమ్ముతూ పోతే  , ఏసు ప్రభువు ఇండియా వచ్చాడు   మేరి మగ్దలీనా ను మారేజ్ చేసుకున్నాడు , వారి సంతానమే ఇండియాలో క్రిస్టియన్ లంతా అని చెప్పినా చెవిలో పువ్వులు పెట్టుకుని వినాల్సి వస్తుంది. 

   ఏసు ప్రభువు దేవుని నమ్మిన వాడు. ఎవరేమి చేసినా తానూ నమ్మ్మిన సిద్దాంతాన్ని ప్రవచించిన మహనీయుడు. శిలువ వేస్తున్న చలించని ధీరుడు. తనను శిక్షించే వారిని కూడా క్షమింపుము అని దేవున్ని వేడుకున్న కరుణా మయుడు. అయన  చెప్పిన మాటల్లో నాకు నచ్చిన మాటలు ఇవి 

     " ప్రజలారా , నా కోసం ఏడ్వకండి . మీ కోసం మీబిడ్డలు కోసం పాటుపడండి " అనే విలువైన అయన అంతిమ సందేశాన్ని అర్దం చేసుకోకుండా , అయన పేరుతో ఖండాతరాలు దాటి మత మార్పిళ్లు చేయడం, వేదికలు ఎక్కి ఎగిరెగిరి దూకుతూ , అర్దం కాని బొదలు చేస్తూ జనాల్ని పిచ్చోళ్ళు చేయడం చూస్తుంటే , ఇండియాలో ఏసు ప్రభువు పేరు మీద ఎలాంటి ఘోర కృత్యాలు చేస్తున్నారో అర్దమవుతుంది. ఎవరైతే సన్మార్గం లో నడుస్తూ , తన కోసం తన కుటుంబం కోసం పాటుపడుతూ ఉన్నారో వారంతా ఏసు మార్గం ని అనుసరిస్తున్నట్లే లెక్క.అటువంటి వారే ఏసు ప్రభువుకు ప్రియమైన వారు . ఎవరి కుటుంబాన్ని వారు అభివృద్ధి చేసుకుంటే , అది దేశాభివ్రుద్దిలో బాగమే కాబట్టి ఇంతకంటె దేశం కోసం పాటు పడాల్సింది మాత్రం ఎముంటుంది. ? కాబట్టి కుటుంబం పట్ల  నీ కనీస  కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు! పలితం పై వాడికి వదిలేయి! సర్వదా సుఖపడుదువు గాక!
                              (20/2/2016 Post Republished)  



This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఏసు ప్రభువు ఇండియా వచ్చాడా ? మేరి మగ్దలీనా ను మారేజ్ చేసుకున్నాడా?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×