Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !



                                  పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే అనిపించే సంఘటన మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి , కన్నడ రాజధాని నగరం బెంగళూరులో లో జరిగింది అట . నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు లోని M.G  రోడ్డులో సుమారు 60 వేల  మంది జనం పోగయ్యారు అట . అందులో జంటలు తో పాటు ఒంటరి యువతులు ఉన్నారట. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరుగకుండా 1600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారట . అయినా సరే ఒంటరి ఆడపిల్లలకు లైంగిక వేధింపుల తిప్పలు తప్పలేదట. అదెలా జరిగింది అంటే ,
    
                      అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా  ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి  చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , లేదు . జరిగేది ఇంగ్లిష్ కల్చర్ ఈవెంట్ కాబట్టి , ఇంగ్లీసు డ్రెస్ మాదిరి కురచ దుస్తులులోనే వెళ్లారు . 1600 మంది పోలీసులు ఉంటె మనకింకేమి భయం లే అనుకున్నట్లు ఉంది . అందరితో కలసిపోయి ఎగరడం మొదలుపెట్టినట్లు ఉంది . ఇక వాళ్ళని చూసి పోకిరి గాళ్ళకి ఎలా ఉంటుంది? 

                                                                 

   

                                             అసలే కోతి ! ఆ పై కల్లు  తాగింది , అన్న చందాన సదరు ఆకతాయిల దృష్టిలో పడ్డారు కురచదుస్తుల్లో ఉన్న ఒంటరి యువతులు . ఇంకేముంది ! వెకిలి చేష్టలు చేస్తూ వారి వెంటపడి లైంగిక వేధింపులకు గురి చేస్తే , పాపం దిక్కు తోచని స్థితిలో, తమ మాన రక్షణకు పరుగులు తీసారట. ఇలా పరుగులు తీయడానికి కూడా సహకరించని తమ హై హిల్డ్  చెప్పులను చేతులో పట్టుకుని మరి పరుగులు తీశారు అట . చివరకు మహిళా పోలీసులు కనపడితే వారిని పట్టుకుని బావురుమని ఏడ్చారు అట . అంటే కానీ ఎవరి మీదా పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేక పోయారు అట. అలా ఇవ్వడానికి , అలా తమ వెంటపడిన వారి గురించి వీరికి తెలిస్తే కదా? చివరకు గస్తీకి నియమించిన పోలీసులు ఎందుకు పనికొచ్చారయ్యా అంటే , వారిని పట్టుకుని బావురు మని ఏడవడానికి అన్నమాట . 

             ఈ  సంఘటన మిదా స్పందించిన కర్ణాటక హోమ్ మినిష్టర్ "ఈ ఏడ్పులు  ప్రతియేడు ఉండేవే . కొంతమంది ఆడపిల్లలకు కురచదుస్తులు వేసుకుని ఈవెంట్ లలో పాల్గొనే అలవాటు ఉంటె , వారిని వేధించి  ఏడిపించడం మరి కొంతమంది మగపిల్లలకు అలవాటు . కురచ దుస్తులు వేసుకోకుండా కన్నడ దుస్తులు వేసుకోమనే అధికారం మాకు లేదు ,అలాగే కంప్లైంట్ లు లేకుండా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో కూడా మాకు తెలియదు" అన్నారు . దానికి తీవ్రంగా స్పందించిన  జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గారు ,  స్త్రీల దుస్తులు గురించి కామెంట్ చేసినందుకు కర్ణాటక హోమ్ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని  , ఎవరూ కంప్లైంట్ ఇవ్వకున్నా పేపర్లలో  వచ్చిన క్లిప్పింగ్ లు ఆదారంగా పొలిసు కేసులు పెట్టి విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. 

                                                                               

  
                           అది మన దేశం లో ఉన్న దౌర్బాగ్యం. జాగ్రత్తగా ఉండండి అమ్మా అని ఆడపిల్లలకు కు చెప్పే పరిస్థితి కానీ, ఖబర్దార్ వెధవల్లారా అని కంప్లైంట్ లేకపోయినా కంత్రీగాళ్లని హెచ్చరించే పరిస్థితి కానీ లేవు . ఈ  సంఘటనలో గమనించవలసిన విషయం ఏమిటంటే , లైంగిక వేధింపులకు గురి అయినా ఆడపిల్లలు అందరిలో కొన్ని  విషయాలు  కామన్  గా ఉన్నాయి  . అవి 

    (1). వారంతా ఒంటరిగా హ్యాపీ న్యూ ఇయర్ లో పాల్గొన్నవారు . వారి వెంట వారి సంబందీకులు  ఎవరూ లేరు . 

     (2) వారు ప్రాశ్చ్యాత పద్ధతిలో కురచ దుస్తులు వేసుకుని ఈవెంట్ లో పాల్గొన్నారు . 

     (3).పారెన్ పద్దతిలో దుస్తులు వేసుకున్నా ,  ఆకతాయిలు వెంటపడినప్పుడు , ఇండియా పద్దతిలో పరిగెత్తి కానిస్టేబుళ్లను పట్టుకుని బావురుమన్నారు తప్పా , కేసులు మాత్రం పెట్టలేక పోయారు. 

       కాబట్టి  కర్ణాటక మంత్రి గారి మాటలు కొంతవరకు బాధ్యతా రాహిత్యమైనప్పటికీ , అందులోను చాలావరకు వాస్తవం ఉంది అని మహిళలు గుర్తించి ఆడపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పగలిగితే ఇలా చెప్పులు చేత్తో పట్టుకుని, భయం తో  బజార్లో పరిగెత్తాల్సిన దుస్థితి వారికుండదు కదా !. 


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×