Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

స్త్రీల ర్రక్షణలో మోరల్ పోలిసింగ్ చేసే దమ్మున్న వారు ఇండియాలో 2% మాత్రమేనా ? అయితే ఎందుకలా ?

                                                                 


                            బి ఫర్ చేంజ్ అనే   స్వచ్చంద సంస్త వారికి , మన సమాజంలో స్త్రీల మిద జరుగుతున్నా అత్యాచారాలు ఇతర లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగి పోవడం పట్ల ఒక ఆలోచన కలిగిందట .అసలు మన సమాజం లో ఎంత శాతం ప్రజలు బహిరంగంగా స్త్రీల పైన జరిగే లైంగిక వేదింపులు ని అరికట్టడం లో తమ వంతు బాద్యతను నెరవేరుస్తున్నారు అని. వారు దానిని ప్రయోగాత్మకంగా పరిశిలించాలి అనుకుని కొంతమంది ఔత్సాహిక నటులుతో డిల్లీలో మరియు ముంబాయి నగరాల్లో ని పబ్లిక్ ప్లేస్ లలో ప్రయోగాలు చేసారు . దానికి సంబందించినదే క్రింద ఇవ్వబడిన విడియో .

    ఒకప్పుడు బజార్లో ఆడపిల్లలను ఎవడైనా ఆకతాయిలు వేదిస్తుంటే ,ఎక్కువ శాతం ప్రజలు వెంటనే రియాక్ట్ అయి వారికి బుద్ది  చెప్పే వారు . వారికి అంత దమ్ము ఉండేది . కాని లౌకిక రాజ్యం ఏర్పడ్డాకా ప్రజలలో "లౌక్యపు బుద్దులు " ఏర్పడి 'తప్పించుకు పోవువాడు భారతీయుడు సుమతీ " అని కామ్ గా వెళ్లి పోతున్నారంట . నిజమే మరి ! ఇలా భారతీయులు ఎందుకు అయ్యారు అనేది ఒక సారి ఆలోచిద్దాం
   (1)  లైంగిక దాడికి గురి అవుతున్న స్త్రీలు ఎటువంటి వారో? ఆమె మద్య , ఆ పురుషులు మద్య ఏమి గొడవలు ఉన్నాయో మనకెందుకులే ? అనే నిర్లిప్త బావం           

  (2).    ఒక వేళ ఏదైనా కలుగ చేసుకుంటే, దుండగలు చాకో బోకో తీసి పొడిస్తే తనకు దిక్కెవరు ? అనే భ యం ,

(3).  హీరోఇజాన్ని ప్రదర్శించి ,బాదిత స్త్రీలకు రక్షణ ఇస్తే , దుండగలు పగబట్టి ప్రతీకారానికీ వస్తే "గాలికి పోయే కంప ని ఒంటికి తగిలించుకోవడం అవుతుంది అనే బావం.
(4). ఏదైనా  కేసులు కి దారి తీస్తే సాక్ష్యాలు చెప్పడం  కోసం పోలిస్ స్టేషన్ లు , కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందనే బయం.
(5). స్త్రీలకు రక్షణ ఇవ్వడం పోలిసులు డ్యూటి కాబట్టి, ఆ విషయం గురించి వాల్లే చూసుకుంటారు లే అనే విదానం .

   ఇలా అనేక కారణాలు సగటు భారతీయుడ్ని అసమర్డుడిని చేస్తున్నాయి . ముఖ్యంగా నగరాల్లో  అసాంఘిక శక్తులు సంఘటితంగా ఉండి నేరాలకు పాల్పడుతూ ఉంటే , ప్రజలు మాత్రం విడి పోయి ఎవరికీ వారే లౌక్యం ప్రదర్శిస్తున్నారు . పోలిసులు , రాజకీయా నాయకులు కూడా సంగటిత అసాంఘిక శక్తుల వైపే అన్న బావన ప్రజలలో చాలా బలంగా ఉంది . ఆ కారణం చేతనే ప్రజలు ముందుకు రాలేని పరిస్తితి. పైగా ఈ మద్య ఎవరైనా ఒక మాట చెపితే, "మీకెందుకు సార్ మోరల్ పోలిసింగ్ " అనే  శ్రేయోభిలాషులు ఎక్కువౌతుంటే , ఒంట్లో వేడెక్కే రక్తం కూడా చప్పున చల్లారి పోయి , మనసు "లొక్యం' వైపు మళ్ళుతుంది .

    క్రింద ఇవ్వబడిన విడియో చూస్సారు కదా . అందులో అమ్మాయిని దుండగులు హిoసిస్తుతుంటె, 98% కేవం ప్రేక్షక పాత్ర వహించి చోద్యం చూసి వెళ్ళిపోతే ,అది తప్పు అని వారించి అమ్మాయిని రక్షింప చూసిన వారు 2% మాత్రమే అని ప్రయోగ నిర్వాహకులు తెలిపారు . వారికి ధన్యవాదాలు . స్త్రీల మీద అత్యాచారాలు జరగటానికి వారి వస్త్రదారణ , బెహేవియర్ కారణం అనే కొంత మంది వాదనలో నిజమెంత ఉందో తెలియదు కానీ , ప్రజలలో తప్పును తప్పు అని చెప్పగలిగే "దమ్ము" కొరవడడమే ప్రదాన కారణం అనీ, అందుకు పైన తెల్పిన కారణాలు దోహదపడుతున్నాయి నా అభిప్రాయం.

                  

                                         (19/7/2014 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

స్త్రీల ర్రక్షణలో మోరల్ పోలిసింగ్ చేసే దమ్మున్న వారు ఇండియాలో 2% మాత్రమేనా ? అయితే ఎందుకలా ?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×