Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఒక దున్న🐃, ఒక సింహం🦁, ఒక👩‍🚀👩‍🚒 అతివ🤱👰

Tags: agravedeg

బ్లాగ్-లోక గురుబంధుమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

అణువు నుంచీ ఆకాశం వరకూ …..

అంతరంగం నుంచీ అంతరిక్షం వరకూ …..

అంతటా వ్యాపించిన ప్రకృతి (నామ,రూప, పదార్థాల సమాహారం) పురుషులు (జాగృతి = చైతన్యం = జ్ఞానం = ఆత్మ) ఒకరినొకరు గుర్తించి, ఒకరు లేకుండా మరొకరి అస్థిత్వానికి ఆధారం, అర్ధం లేవని తెలుసుకున్న రోజు విజయదశమి అని …

ఈ తెలుసుకునే ప్రాసెస్ లో ప్రకృతి -పురుషులు పడిన స్ట్రగులే తొమ్మిది రోజుల యుద్ధం అని …

తమోగుణాన్ని రజోగుణం, రజోగుణాన్ని సత్వగుణం డామినేట్ చెయ్యాల్సిన అవసరాన్ని, ఎత్తి చూపడమే దున్నపోతుని చెండాడుతున్న సింహం, ఆ సింహాన్ని అధిరోహించి అదుపులో వుంచిన దుర్గాదేవిల వెనకవున్న సింబాలిజం, అంతరార్ధం అని …

… అంటున్నాయి ఇవాళ అంతరంగ “తరంగాలు”.

సమస్తదేవతాశక్తుల సమన్వయ రూపమైన దుర్గ స్త్రీ రూపంలో ఎందుకుందని అడుగుతున్న ఆలోచనా’తరంగాల’కి ….

సమాజం కానీ, సంస్కృతి కానీ, ప్రభుత్వం కానీ ఇవన్నీ జీవ చైతన్యానికి, మానవ బుద్ధి వికాసానికి ప్రతీకలు అనుకుంటే వీటన్నిటిలో పురుష సహజమైన ధృఢత్వం, గాంభీర్యాలకంటే స్త్రీ సహజమైన లాలిత్యం, ప్రేమ, మమకారాలు ఒక్క పిసరు ఎక్కువ మోతాదులో వుండాలని సూచించడమే దుర్గారూపాన్ని దర్శించిన ద్రష్టల ఆంతర్యం అయ్యంటుందని అంతఃపరావర్తన (Internal Reflection) పొందిన అం”తరంగాలు” సమాధానం చెప్తున్నాయి.

పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాదరాలు ఏమిటో భవిష్యత్తు (అంటే, ఈనాటి గర్ల్ ఛైల్డ్ పరిస్థితి) చూసిన ఋషులు ఈ విధంగా చెప్పారేమో!?! అనుకుంటున్నాయి హృదయాం”తరంగాలు”.

ఇలాంటి ఆలోచనలు వదిలేసి మహిషాసుర మర్దనలో కుల స్పర్ధలని, మనిషి అభ్యుదయానికి పనికిరాని రాజకీయాలని వెతుక్కోవడం జగన్మాతకి నచ్చదేమోనని ముక్తాయిస్తున్నాయి విచక్షణాం”తరంగాలు”.

మరోసారి విజయదశమి శుభాకాంక్షలతో …

బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

ఒక దున్న🐃, ఒక సింహం🦁, ఒక👩‍🚀👩‍🚒 అతివ🤱👰

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×