Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అక్టోబర్ 2 అనే తారీఖుకి జాతకం మారి, దశ తిరిగి 150 ఏళ్ళు ….

అక్టోబర్ 2 ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యతతెచ్చిన వ్యక్తిపై వైముఖ్యత, ఆయన ఫిలాసఫీ మీద నిరాసక్తత, ఆ ఫిలాసఫీ అర్ధంకాని, పాటించలేని అశక్తత అన్నీ దేశంలో సమానస్థాయిలో పెరుగుతున్న ఈ రోజు,

అక్టోబర్ 2 అనే తారీఖుకి జాతకం మారి, దశ తిరిగి 150 ఏళ్ళు నిండిన ఈ రోజు గాంధీతాత తలంపుకి రాగానే ముందుగా మా ఇంట్లో పూసిన గులాబీ దగ్గర ఇలా చిన్న రెండుజడల పిల్లని చెయ్యి పట్టుకు నడిపిస్తూ కనిపించారు. హథ్రాస్ ఘటన గుర్తొచ్చింది. బొమ్మ పైన ఆ కాప్షన్ పెట్టేదాకా మనసొప్పలేదు.

సాయంత్రం మళ్ళీ మా ఇంట్లోనే ఆ వీణానాదంలో బాపూజీ అడుగుల సవ్వడి వినబడే వరకూ మనసు బాధగా మూలుగుతూనే వుంది. ఏమని? గాంధీతత్వాన్ని అందిపుచ్చుకునే అర్హత మనకింకా రాలేదేంటని.

ఆ తత్వం ఆత్మ స్వాతంత్ర్య తత్వం అని అర్ధమైనప్పుడు కదా అర్హత వచ్చేది.



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

అక్టోబర్ 2 అనే తారీఖుకి జాతకం మారి, దశ తిరిగి 150 ఏళ్ళు ….

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×