Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కరోనాకి🤓 హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి ….

ఛస్తుంటే సంధి మంత్రంలా నీ సుత్తి పోస్టులేంట్రా అనకండి. శొంఠిపిక్కల కషాయంతో మొదలెడితే హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి (అదే ఎండలో నుంచోడం), నీడోపతి (నీడలో పడుకోడం, ఇదింకా ఏ వైద్యనారాయణుడూ ప్రకటించలేదు), జానీవాకరోపతిలకి వేంకటాచలపతిని కూడా జోడించి సోషల్ మీడియాలో తెగ హోరు పుట్టిస్తుంటే పెరిగిన చిరాకుకి –

కోట్లమందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయనే అంచనాలు కలిగించిన ఆందోళనకి –

మన నాయకుల పారాసిటమాల్ + బ్లీచింగ్ పౌడర్ రెమెడీలు పుట్టించిన ఫ్రస్ట్రేషన్ తోడై –

చివరికి నాకే కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తన్నై. వాటిలో శాంపిల్ కి ఒక ఐడియా. మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని రకాల వైద్యవిధానాలనీ ఇమిడించి ఎవరికిష్టమైన రెమెడీ వారికి అందించీ కరోనాని ఎదుర్కుని గెలిచే ఐడియా అనమాట. అదేంటంటే, ఇదుగో ఇదీ , ఇలా రాసి వాట్సప్ లో పెట్టా.

ఇది ఒక ఫ్రెండుకి రుచించలేదు, వెటకారం అనిపించింది. “మన కిందకి నీళ్ళొచ్చే వరకూ వెటకారం మానం మనం,” అన్నాడు.

“నీళ్ళు కిందకి రావడం ఏంటి? పీక వరకూ ములిగి వుంటే .
ఐనా కర్ఫ్యూలు, క్వారంటైన్లూ తప్పించుకునేవాళ్ళనీ,
ఇన్ఫెక్ట్ అయినా వార్డ్ లోంచి తప్పించుకునేవాళ్ళనీ, జనం భయాన్నీ, అమాయకత్వాన్నీ బిజినెస్ ప్రమోషన్ కోసం వాడుకునేవాళ్ళనీ చూసి వెటకారాలూ, మిరియాలూ నూరక ఊరకయుండుట ఎలా మిత్రమా!!?!!,” అన్నా.

“సరే, నీ ఇష్టం వచ్చినట్టు ఏడు,” అని వదిలేశాడు. అంతేసంగతులు, బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

కరోనాకి🤓 హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి ….

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×