Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Neil Arm💪strong (అనే) నీల బాహు🏋️‍♂️బలి

ఇవాళ ఈనాడులో ఒక ఐటమ్ చూశాక పాత టపా ఒకటి తిరగదోడాలనిపించింది. ఆ ఐటమ్ ఇదీ –

https://www.eenadu.net/cinema/newsdetails/2/2019/08/09/138828/Doctor-Strange-director-Scott-Derrickson-is-all-praises-for-THIS-scene-from-Baahubali

ఒక్క ‘ఈగ’ తప్ప తక్కిన రాజమౌళి సినిమాలన్నీ అరవ్వాళ్ళకీ, శివాజీగణేశన్తో సహా అతి అంటే ఏంటో పాఠాలు చెప్తున్నట్లు అనిపిస్తాయి (నాకు). మీకలా అనిపించకపోతే మీ తప్పుకానీ, అందుకు నా పూచీ కానీ ఏం లేవండోయ్. 133 కెమెరాలు పెట్టి తీసిన బెన్-హర్ ఛారియట్ రేసూ, మిట్టమధ్యాహ్నం వెన్నెల కురిపించిన మార్కస్-బార్ట్లే ” లాహిరి లాహిరి లాహిరిలో …” చూసిన కళ్ళు రబ్బర్ లా ఒంగిపోయే సాగిపోయే గ్రాఫిక్ తాటిచెట్లకి, వాటి మీదెక్కి కోటగోడల్ని దూకేసే కాన్సెప్టుకీ ఇంకా అలవాటు పళ్ళేదు మరి.

అందుకేనేమో స్కాట్ డెరిక్సన్ అనే ఆ హాలీవుడ్ డైరెక్టర్ కి ఆ తాటిచెట్టు-బేస్డ్ లాంచింగ్ సీన్ చూసి ఒళ్ళు పులకరించి పోయిందంటుంటే ఇక నా కాన్సెప్టు చూస్తే అమాంతం ఆనందబాష్పాలు కురిపిస్తాడనిపించి మళ్ళీ పోస్టు చేస్తున్నా, డెరిక్సన్ కి తెలిసినవాళ్ళెవరైనా ఇవి చూసి ఆయనకి పంపి పుణ్యం కట్టుకుంటారనే ఆశ కూడా ఎక్కడో ఓ మూల లేకపోలేదు. ఇంతకీ ఇదుగో నా కాన్సెప్టు,

NASA, ISRO లాంటి సంస్థలకి కావాలంటే సరసమైన ధరలకి ఇలాంటి కాన్సెప్టులు చాలా సరఫరా చేస్తాం, డైరెక్టుగా ఓ ఈ-మెయిలు కొట్టండి చాలు

(Btw, చిన్న వివరణ, రాజమౌళి స్టైలుని comparison కోసం అరవ అతిని వాడుకున్నా నిజానికి ఈయన స్టైలుని అతి అనేకంటే subtility తక్కువ, boldness & loudness ఎక్కువ అంటే యాప్ట్. అరవ అతి is in its own class & is incomparable.)
ఇంతే సంగతులు, బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

Neil Arm💪strong (అనే) నీల బాహు🏋️‍♂️బలి

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×