Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ద సైన్స్ ఆఫ్ పిట్టరెట్ట జోస్యం & ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పిట్టరెట్ట

Tags: agravedeg

ఈ మధ్య జ్యోతిష్యాల మీదా, జ్యోతిష శాస్త్రజ్ఞుల మీదా జోకులెక్కువైపోయాయి. ఎక్కువైపోయాయి అంటే అవ్వవా మరి? టీవీ చర్చల్లో కూచుని డోనాల్డ్ ట్రంప్ నుంచీ వీధి చివర పుంపు వరకూ ప్రతీ విషయం మీదా జ్యోతిష్కుల ప్రిడిక్షన్స్, వాటికి హేతువాదులు ఛాలెంజులు, ఆ ఛాలెంజులకి జవాబు చెప్పలేక చర్చ మధ్యలో జ్యోతిష్కులు అలిగి లేచి వెళ్లిపోవడం, … ఈ ఫార్సులు చూసి జనం జోకులెయ్యక ఊరుకుంటారా? ప్లానెటరీ ఆస్ట్రాలజీ సైన్స్ కాదు అని నేను అనలేను. అలాగని అందరు జోతిష్కులు చెప్పేవీ సైన్టిఫిక్కే అనికూడా అనలేను. ఐనా ఇప్పుడు సబ్జెక్ట్ అదికాదు.
సబ్జెక్టు ఏంటంటే గవ్వల పంచాంగం నించీ గ్రహ సంచారం వరకూ ఎదో ఒకటి మన జీవితాల్ని ఎఫెక్ట్ చేసేస్తుందనే నమ్మకం నుంచీ, చేస్తోందేమో అనే అనుమానం నుంచీ బయటపడలేమా? పడొచ్చు.
అసలెందుకు బయటపడాలి? అనే ప్రశ్న బుర్రలో పుట్టాలి గానీ ఈజీగా బయట పాడొచ్చూ. ఎందుకు బయటపడాలి అనేందుకు లక్ష కారణాలున్నాయి. కానీ ఒక రెండు చెప్తే చాలు. ఒకటి, మన లైఫ్ రెస్పాన్సిబిలిటీ మనదే అనుకునే గుణం అలవాడడానికి. రెండు, మనిషి వీక్-మైండ్ని బతుకు తెరువుకి వాడుకునే గుణం పోడానికీ గవ్వలనీ, గ్రహాలనీ వాటి దారిని వాటిని పోనివ్వాలి. ఇప్పుడింక దాసరి నారాయణరావు / కె.విశ్వనాధ్ టైపు స్పీచులాపి ఈ పోస్ట్ కి ఐడియా ఎలా వచ్చిందో చెప్తా –
జిలేబిగారి బ్లాగులో సూర్యగారు పెట్టిన ఓ కామెంటు ఎంత న(వ్వి)చ్చిందంటే ఆ నవ్వు ఈ టపా రాసేవరకూ ఆగలేదు. సో, ఈ టపా క్రెడిట్స్ వాళ్ళిద్దరికీ చెందాలి.
ఇచ్ఛేసేవాణ్ణే. ఇంతలో అనుకోకుండా జోస్యాలు చెప్పేవాళ్ళ మీద ఓ “పిట్ట రెట్ట” (ఆహాహా! పిట్ట రెట్టలాంటిదని నా ఉద్దేశం) పడింది. జోస్యాలు చెప్పేవాళ్ళందరి మీదా కూడా కాదు లెండి. గవ్వల పంచాంగం నుంచీ పిట్ట జోస్యం (చిలకజోస్యం) మీదగా నవగ్రహాలూ (ఎనిమిది గ్రహాలూ+ఒక నక్షత్రం) మరియు పన్నెండు రాశుల వరకూ లోకంలో వున్న దేన్ని వాడైనా – ఆక్టోపస్సులూ, గుడ్లగూబలూ, etc సహా – ఫ్యూచర్ చెప్పే టెక్నాలజీ మనం డెవలప్ చేశాం కదా! ఆ టెక్నాలజీల్లో ఒకానొక బ్రాంచి మీద పడింది “పిట్టరెట్ట” (లాంటిది). అసలు పిట్టరెట్టని ప్రిడిక్ట్ చెయ్యడం ఎంత కష్టమో రాద్దామనుకున్నవాణ్ణి కాస్తా పొలిటికల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ పిట్టరెట్ట కూడా కలిపా. సో, క్రెడిట్లో ఆ “పిట్టరెట్ట”ని వేసిన వాళ్ళకీ కాస్త భాగం దక్కుతుంది. విమానప్రమాదాల్లాంటివి ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్తే కొందరైనా ఆ ప్రమాదం తప్పించుకుంటారు కదా అనేది సూర్యగారి కామెంట్ సారాంశం. ఇక్కడే గ్రహాల-బేస్డ్ జ్యోతిష్యాన్ని విమాన ప్రమాదాల్లాంటి వాటికేగానీ పిట్టరెట్ట, గేదె పేడ, … వంటివి ప్రిడిక్ట్ చెయ్యటానికి ఉపయోగించకూడదా, అసలు అలాంటివి కూడా ప్రిడిక్ట్ చేయగలమా అనే ఎనాలిసిస్ నాలో మొదలైంది. అందులో భాగంగా అసలు గ్రహా-బేస్డ్ జోతిషం ఎలా ఆపరేట్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యడానికి ఒక మేథమెటికల్ మోడల్ తయారు చేశా. ఆ మేధ-మే-టికిల్ మోడల్ ఇదుగో –
ఓ వంద, కాదు, వెయ్యి వస్తువులు – కుర్చీలు, గిన్నెలు, కోతులూ, మనుషులూ, చెట్లూ, ఫాన్లూ, కోళ్ళూ, నీళ్ళూ, etc అనమాట – అన్నిట్నీ సెపరేట్ తాళ్లతో ఒక లారీకి కట్టాలి. మళ్ళీ ఈ వస్తువులన్నిట్నీ ఒక దానితో ఒకటి చిన్న చిన్న తాళ్లతో కలపాలి. ఈ కలపడం ఒక చక్కటి క్రమంలో కాకుండా అడ్డదిడ్డంగా , చేతికొచ్చినట్టు కలపాలి. అంటే మనిషిని కోతికి, ఆ కోతిని అరిటిపండుకి, పండుని కుర్చీకి, కుర్చీని ఇంకొకడి కాలుకి, ఆ కాలుని ఇంకెవరో జుట్టుకి, జుట్టుని ఒక చెట్టుకి, … ఇలా – వీలయితే ఇంకా అడ్డదిడ్డంగా కలిపెయ్యాలి. తాళ్ళకి వేసే ముళ్ళు కొన్ని లూజుగా, కొన్ని టైటుగా వెయ్యాలి. కొన్ని పీట ముళ్ళు పడిపోయేలా ఉండాలి. ఇప్పుడు లారీని స్టార్ట్ చేసి ఒక సర్కిల్లో క్షణానికో గేరు మారుస్తూ నడపాలి. ఒక్కమాట, లారీ తిరిగే సర్కిల్లో గతుకులు, గోతులు, స్పీడ్ బ్రేకర్లూ … ఎక్కడపడితే అక్కడ ఉండాలి. లారీ డ్రైవరు బాగా తాగి ఉండాలి. లారీలు మాటిమాటికీ ఒకదాన్నొకటి గుద్దుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తీరిగ్గా ఒక్కో వస్తువూ ఎలా కదులుతోంది అని పరిశీలించాలి. కొంచెంసేపు పరిశీలించాక ఇంకో ఎనిమిది లారీలు తీసుకొచ్చి వాటినీ ఈ వస్తువులన్నిటికీ తాళ్ళేసి కట్టేసి వాటినీ వేరు వేరు సర్కిల్స్లో ఇష్టం వచ్చిన స్పీడుల్లో తిప్పెయ్యడం మొదలెట్టాలి. ఇప్పుడింక ప్రతీ వస్తువుయొక్క మూవ్-మెంటునీ ప్రిడిక్ట్ చెయ్యడానికి ట్రై చెయ్యాలి. ఇప్పుడు తెలిసింది కదా గ్రహాస్-బేస్డ్ ఆస్ట్రాలజీ ఎంత ఈజీనో. ఈ పద్ధతిలో ఎవరి ఫ్యూచర్నైనా సరే చెప్పెయ్యచ్చు. ఆ ఫ్యూచర్ పాస్ట్ గా మారిపోయాక చెప్పడం మరీ తేలిక. ఈ మోడల్ అర్ధం చేసుకుంటే చాలు గవ్వల జోతిష్యం, చిలక జోస్యం, సోది, ఆక్టోపస్ భవిష్యవాణి, పుట్టుమచ్చల శాస్త్రం, … లాంటి కాంప్లికేటెడ్ శాస్త్రాలన్నీ ఇంకా ఇంకా ఈజీగా అర్ధమైపోతాయి. సరే, ఇప్పుడు ప్రశ్న పిట్టరెట్ట ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పడుతుందో ప్రిడిక్ట్ చెయ్యడం ఎలా అని కదా!! వెరీ వెరీ సింపుల్ !! పైన లారీకి కట్టిన సామాన్లతో పాటు ఏ పిట్టరెట్టని ప్రిడిక్ట్ చెయ్యాలనుకుంటే ఆ పిట్టనీ (అది దొరక్కపోతే దాని రెట్టని) ప్లస్ అది ఎవరి మీద పడుతుందని అనుకుంటున్నారో ఆ మనిషినీ కూడా లారీకేసి కట్టెయ్యాలి. ఆ తర్వాత అంతా వెరీ వెరీ ఈజీ. గేదె పేడ ఎప్పుడు ఎంత వేస్తుందో చెప్పడం కూడా ఇదే పద్ధతిలో చెప్పొచ్చు. కానీ రైతన్నలు ప్రాక్టికల్ పర్సన్స్. గేదెకి వేసిన గడ్డిని బట్టి, వేసిన టైమింగుని బట్టీ గ్రహాల కంటే ఎక్యురేట్ గా ప్రిడిక్షన్ ఇచ్చేస్తారు. అదీకాక రుణమాఫీ ఇస్తేగానీ బతుకుబండి సాగని రైతన్న జోతిష్కుడికి ఫీజేవిచ్చుకుంటాడు పాపం!! వోట్ల కోసం కోట్లు పెట్టేవాడికి వోట్లు పడతాయో పడవోననే యాంక్జైటీ ఉంటుంది కానీ రేపు తెల్లారుతుందో లేదో తెలీని రైతుకి యాంక్జైటీ ఎందుకంటా? అంచేత పిట్టరెట్ట, గేదెపేడ, … వగైరాల ప్రిడిక్షన్స్కి మార్కెట్ లేదు. మరి ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ అయినా ముందుగా లెక్కేసి చెప్పచ్చు కదా అంటే అదీ కుదరదు. ఎందుకంటే రేప్పొద్దున్నే ఫలానా ఎయిర్ లైన్స్ వాళ్ళ విమానం కూలిపోవును అని నాలాంటి మేధావి ప్రవచించాడనుకోండి ఫలానా ఎయిర్ లైన్స్ వాళ్ళ మనుషులొచ్చి మేధావిని ఆ ఫ్లైట్ లోనే కూచోపెట్టడం లేదా వీపు విమానం మోగించడం ఖాయం. భవిష్యత్తుని అర్ధం చేసుకున్న భవిష్యజ్ఞులు తెలిసి తెలిసి అలాంటి రిస్కు తీసుకోరు కదా!! మనమే అర్ధం చేసుకోవాలి మరి. సో, ఇంతకీ చెప్పొచ్ఛేదేంటంటే జోస్యుల్ని వారి కన్వీనియెన్స్ ప్రకారం జోస్యాలు చెప్పనివ్వడమే వారికీ, శాస్త్రానికీ కూడా సేఫ్.
నౌ, లెటజ్ టాక్ అబౌట్ ద పిట్టరెట్ట దట్ ఫెల్ ఆన్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రాలజీ…………… కర్ణాటకలో పామిస్ట్రీ వృత్తిలోవున్న ఒకాయాన్ని మీ జ్యోతిషాలయపు బోర్డులో వున్న చెయ్యి బొమ్మని కవర్ చేసేయ్యండంటూ లోకల్ ఎలక్షన్ ఆఫీసర్లు ఆదేశించారుట. మార్చ్ 13 డెక్కన్ హెరాల్డ్ లో వచ్చిందీ వార్త. సదరు పామిస్టు లబోదిబోమంటే మీ బోర్డు మీదున్న చెయ్యి కాంగ్రెస్ పార్టీ గుర్తు కనక, అది ఎలక్షన్ కోడ్ కి విరుద్ధం కనక మూసెయ్యాల్సిందే అన్నారట.
ఇది చూడగానే – గుళ్లో దేవుళ్ళ కాంగ్రెస్ మార్కు అభయ హస్తాలని
, దేవుళ్ళ చేతుల్లో వుండే బీజేపీ కమలాలని, ఇళ్లలో వైఎస్సార్సీపీ సీలింగ్ ఫాన్లనీ, వినాయకుడి బీఎస్పీ ఏనుగుతలని, టీ కొట్లలో జేఎస్పీ గాజు గ్లాసుల్నీ, రోడ్లమీద తిరిగే టీడిపీ సైకిళ్ళూ , టీఆరెస్ కార్లనీ, ఆకాశంలో ప్రజాశాంతి హెలికాప్టర్లనీ …. అన్నిటినీ కవర్ చేసెయ్యమంటారో, ఏంటో .. ఇదెక్కడి పిట్టరెట్టరా బాబూ అనుకున్నా. ఇంతలో పామిస్టుగారు మండ్య ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి మొరపెట్టుకుంటే, “మీ హస్తానికి , కాంగ్రెస్హస్తానికి సంబంధంలేదు, అంచేత ముయ్యక్కర్లేదంచెప్పి అభయహస్తం చూపారట. ఇలా ప్రపంచంలో ఏ వస్తువూ కనిపించకుండా కవర్ చేసెయ్యడం ఎంత పెద్ద పనో ఆయన సరిగ్గా గ్రహించడంతో పెద్ద అనర్ధం తప్పింది. అదలా ఉంచితే ఇలాంటి పిట్టరెట్టలు ఇంకేం నెత్తిన పడబోతున్నాయో అన్ని బ్రాంచ్ ల జాతకరత్నాలూ లాప్-టాపులూ అవీ ముందేసుకుని లెక్కలు కట్టడం మొదలెట్టారని, మొదలెట్టాలనీ కోరుకుంటున్నా. ఎందుకంటే తమ ప్రొఫెషన్నే దెబ్బ తీసే పిట్టరెట్టల్నయినా ప్రిడిక్ట్ చేసుకోలేకపోతే ఎట్టా? ఒకానొక బాపూ కార్టూన్లో చుట్టూ అందరూ చినుకు తగలకుండా తిరుగుతుంటే అదృష్ట తాయెత్తులు అమ్మేవాడొక్కడి నెత్తినే మబ్బు పట్టి వర్షం కురుస్తున్నట్టు ఉండదూ?
ఈ పోస్టుతో జ్యోతిష్యాన్ని అపహాస్యం చేసినట్టనిపిస్తే అలా అనిపించినవాళ్ళకి – జ్యోతిష్యం ఎగ్జాక్ట్ సైన్స్ కాదు అనే వాళ్ళనీ నేను సపోర్ట్ చెయ్యను. నా కంప్లైంట్ అంతా మిడి మిడి జ్ఞాన మిడతంభొట్లు జ్యోతిష్కులూ, పేపర్లో వచ్చిన పొలిటికల్ అనాలిసిస్లు చదివేసి, వాటి ప్రకారం గవ్వలనీ, అంకెలనీ కిట్టించి ఫ్యూచర్ చెప్పే శాస్త్రజ్ఞులూ … ఇలాంటి వాళ్ళ మీదే. పుట్టిన సమయం ఎంత ఎక్యురేట్ గా ఉంటే అంత ఎక్యురేట్ గా జాతకం చెప్పగలం అని చెప్పి మనిషిని చూడకుండానే అతని జాతకం సరిగ్గా చెప్పిన ఒక ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గారిలాంటి జ్యోతిష్కుల మీద నో కంప్లైంట్స్. ఇంతే సంగతులు. తన హిలేరియస్ కామెంటుతో ఈ టపాకి ఐడియా ఇచ్చిన సూర్యగారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ బై 4 నౌ




This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

ద సైన్స్ ఆఫ్ పిట్టరెట్ట జోస్యం & ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పిట్టరెట్ట

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×