Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

xxx కాండోమ్స్‌కి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల  …..

ఒక స్వతంత్ర దేశంలో –

దేశ సరిహద్దుల అవతలున్న శత్రువులకి సరిహద్దుల ఇవతలున్నవాళ్ళు ఏదో ఒకరకంగా సాయం చేస్తే దేశద్రోహం

బయట్నించి ఎటాక్ చేసే శత్రువుతో యుద్ధాలు చేసి శత్రుసైనికుల్ని చంపడమో చావడమో చేస్తే దేశభక్తి.

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్ట నడిమీ పని నాటకమూ అన్నట్టు పై రెండు డెఫినిషన్లూ కాక దేశంలో జరిగే ఇతర వ్యవహారాలేవీ దేశభక్తి/ద్రోహం పరిధిలోకి రావనుకుంటే ఈ ఇరవైయ్యొకటో శతాబ్దంలో సరిపోతుందా?

ఇప్పుడీ అసందర్భ ప్రసంగం ఏంటీ అనిపిస్తోందా? అసందర్భం కాదండోయ్!! ఎందుకంటే —

ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు? ఈ డిబేట్ దేశంలో బాగా ఎక్కువైపోయినట్టుంది ఈ మధ్య.

ఈ మధ్య అంటే మరీ అంత ఈ మధ్యేం కాదు ..

2014 -15 మధ్య కాలం నుంచీ …

ఎంత ఎక్కువైందంటే నాలాంటి సామాన్యులక్కూడా భక్తులకీ, ద్రోహులకీ మధ్య డిఫరెన్స్ ఏంటా అని డౌట్లొస్తున్నాయ్. మేధోమధనాలు చెయ్యాల్సి వస్తోంది.

ఐతే, కొన్ని రకాల మనుషుల్ని ఎలా క్లాసిఫై చెయ్యాల్నో తెలవడం లేదు.

ఫరెగ్జాంపుల్,

వోట్లకోసం జనాల్ని రకరకాలుగా చీల్చేసి – దీన్ని మోడర్న్ భాషలో సోషల్ ఇంజినీరింగ్ అనాలి(ట) – ఆ దారిలో పవర్ సంపాదించి అప్పుడు జెండావందనాలు చెయ్యడం

డబ్బుల్తో వోట్లు కొని, గెల్చి, ఆపైన రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారాలు చెయ్యడం

డబ్బులు, తాయిలాలకి వోట్లమ్ముకోడం 

సినిమాహాల్లో జనగణమన వచ్చినప్పుడు ‘దేశభక్తి’తో లేచి నుంచుని, తెల్లారితే ఆఫీసుల్లో లంచాల పంపిణీలో పాలుపంచుకోడం 

రాజకీయ అవసరాల్ని బట్టీ దర్యాప్తుల్నీ, దర్యాప్తు సంస్థల్నీ , కోర్టుల్నీ పక్కదారి పట్టించడం

తమ పార్టీకి వోట్లేసేవాళ్ళకే ప్రభుత్వ తాయిలాలు అందేలా మేనేజ్ చెయ్యడం

ఏ వరాల కోసమో తీర్పుల్లో మార్పులు చెయ్యడం; తీర్పులో మార్పుని బట్టీ కోరుకున్న వరాలివ్వడం (ఆహాహా!! అలా చేస్తున్నారని కాదు, ఒకవేళ ఎవరైనా అలాంటి పని చేస్తే ఎలాగా అని మన ప్రశ్న !!) 

ఎవరు ఎవరికీ వోట్లెయ్యబోతున్నారో ముందే తెల్సేసుకుని వోటర్స్ లిస్టులోంచి వాళ్ళ పేర్లు తీయించెయ్యడం

ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేసి ఒక జాతి మనుగడకి అత్యవసరమైన ఆడ, మగ సెక్స్ రేషియోని పాడుచేసెయ్యడం

…….. ……. ……. మొత్తం లిస్టంతా నేనొక్కణ్ణే ఎక్కడ రాస్తాను ?? అందరికీ అవకాశం ఇస్తా … 

చాలా యేళ్ళ క్రితం ఏదో నవలలో (పేరు గుర్తు రావట్లా) చదివినట్టు గుర్తు, ఒక కారెక్టర్, “xxx కంపెనీలో తయారయ్యే కాండోమ్స్‌కి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల చిన్న రంధ్రం పడుతుంటే, అది తెలిసికూడా రెక్టిఫై చెయ్యకపోవడం అంత నేరం, దేశద్రోహం ఇంకోటి వుండదు,” అంటుంది. జనాభా ముప్ఫై కోట్లున్నప్పుడు మన దేశమంత పెద్ద దేశంలో అదో నేరం కాకపోవచ్చు.  కానీ జనాభా నూటాముప్ఫై కోట్లయ్యాకా?

ఆలోచించాల్సిన విషయమేగా!?!?

ఇలాంటివే ఆలోచించి ఐడెంటిఫై చెయ్యాల్సిన 21st సెంచరీకి సూటయ్యే దేశభక్తి / దేశద్రోహం డెఫినిషన్స్ ఇంకా  చాలా వుండొచ్చు…
కొత్త కొత్త రకాల దేశభక్తులేంటో గుర్తించడం ఆలీసం ఐనా పర్లేదు కానీ లేటెస్టు దేశద్రోహ పద్ధతులేంటో గుర్తించడం తక్షణకర్తవ్యం.

తక్షణకర్తవ్యం!!! ఎవరికి?

దేశభక్తులకి + మేం (మేమే) దేశభక్తులం అనుకునేవాళ్ళకి + దేశద్రోహులంకాము అనుకునేవాళ్ళకి….

… అని నేననుకుంటున్నా.

రాజకీయం అన్నాక అడ్డదార్లు తొక్కడం, తిమ్మిని బమ్మి చెయ్యడంలాంటివి తప్పవు అవన్నీ దేశద్రోహం అంటే ఎలా? అని అనిపించచ్చు. ఇన్‌ఫాక్ట్, రాస్తుంటే నాకూ అనిపించింది.
అడ్డదార్లు తొక్కడం; తిమ్మిని బమ్మి చెయ్యడం; నదిని పందిగా, పందిని నందిగా చూపించడం, … ఇవన్నీ రాజకీయాలకే పరిమితం ఐతే ఓకే అవ్వచ్చేమో కానీ ఇదంతా ప్రజలక్కూడా అవినీతిని అలవాటు చేస్తుంటే???
అసలే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని తెగ పాడేసుకునే వాళ్ళం ఆ మనుషుల క్వాలిటీయే మారిపోతుంటే అనుకుకోకుండా ఉండగలమా??

ఇంతేసంగతులు.

బై 4నౌ.



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

xxx కాండోమ్స్‌కి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల  …..

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×