Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

🌳🦌వన🐾విహారం🌾🦋 – రాయలవారి 👑 🐥Kingfisher

ఒకళ్ళు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఇంకొకరు కింగ్ హూ మేడ్ టైమ్స్ గుడ్.
ఇద్దరూ లకుముకిపిట్టకి తమదైన శైలిలో పేరు తెచ్చినవాళ్ళే.
ఈపాటికి ఇదంతా ఎవర్ని గురించొ మీకర్ధం అయ్యుంటుంది. కనీసం మొదటి కింగ్ లకుముకిపిట్ట పేరు మీద ఒక ఎయిర్-లైన్స్, ఒక బీరు బ్రాండూ పెట్టిన పెద్దమనిషే అని తెలిసిపోయే వుంటుంది.  లకుముకిపిట్టలకి తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం వుందో మనకి తెలీదుగానీ, ఒకవేళ కాస్త సాహిత్యస్పర్శ వుండి, ఆ స్పర్శ లకుముకిపిట్ట చేత దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి చాటుపద్య రత్నాకరం చదివించి వుంటే, దానికి తప్పకుండా –
“ఆడిన మాటకుఁ దప్పెను
గాడిదకొడు” కంచుఁ దిట్టఁగా విని “యయ్యో
వీఁడా నా కొక కొడు” కని
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!
అనే పద్యం గుర్తొచ్చి అది కూడా తెగ ఫీలై పోయుంటుంది. (కానీ గాడిదలూ, లకుముకిపిట్టలూ కూడా తెలుగు చదువుకునే, మాట్లాడే పరిస్థితే వుంటే తెలుగుని రక్షించండోయ్ బాబోయ్ అంటూ తెలుగువాళ్ళు ఏడిచే పరిస్థితి ఎందుకొస్తుందీ? రాదు కదా! అది వేరే విషయం).

కింగ్-ఫిషర్‌కి మంచి పేరు తెచ్చిన రాజుగారెవరో కూడా తెలిసిపోయుంటుంది. టపా టైటిల్ చూడగానే. రాయలవార్ని తల్చుకోగానే సమరాన, సాహితీ సమరానా మడమ తిప్పని మహావీరుడు గుర్తొచ్చి గుండెలు ఉప్పొంగడం వింతేం కాదు. కానీ ఒకవంక ఉర్రూతలూచు కవనాలతో, ఒక వంక వురికించు యుద్ధ భేరీలతో బిజీ బిజీగా వుండే ఆంధ్రభోజుడి ప్రకృతి పరిశీలనా శక్తీ, ఆ ప్రకృతిని లక్ష్మికి ప్రతిరూపంగా చూసిన ఆయన ఆధ్యాత్మిక దృష్టీ రెండూ అద్భుతం అనిపించేలా వ్రాసిన కొన్ని పద్యాలు – గరికపాటివారి ఆముక్తమాల్యద ప్రసంగంలో విని, ఆయన చెప్పిన ఈ పుస్తకంలో  https://ia902708.us.archive.org/18/items/AmuktaMalyada_988/Amuktamalyada_Part01.pdf చూసి తెలుసుకున్నాను – చదివితే ప్రకృతి ప్రేమికుల గుండెలు ఉప్పొంగిపోవడం గారంటీ.

లకుముకిపిట్టలని వర్ణించిన తీరు ఒక విశేషమైతే, అవి గ్రామాల్లో వుండే బావుల్లో చేపలు వేటాడుతూ వుంటాయని చెప్పడంలో ఆనాటి ప్రజలు ప్రకృతికి ఎంత దగ్గరగా వుండేవారో తెలుస్తుంది. లక్ష్మీదేవి చేతిలో బంతితో లకుముకిని పోల్చడంతో ఆయన సహజ ప్రకృతికి ఇచ్చిన విలువ ఏమిటో తెలుస్తోంది. లక్ష్మి కరముల నుంచి వస్తున్నది కాబట్టి లకుముకి అయిందేమో అసలు. (లంబోదర లకుమికరా..లో లకుమికరా అంటే లక్ష్మిని ప్రసాదించేవాడు అని అర్ధం(ట). దాన్నే కొంచెం నాకు కావలసినట్టు అర్ధం చెసేసుకున్నా, ఇలా –
లక్ష్మికర పక్షి >>> లకుమికర పిట్ట >>> లకుముకి పిట్ట

వై నాట్?

ఇంతకీ లకుముకిపిట్టల్లో ఓ వంద రకాలుండగా రాయలవారి పద్యంలో బందీ అయిన లకుముకి ఏ రకం అయ్యుంటుంది?
నా ఊహ ఈ బుల్లి పిట్ట అని. ఎందుకంటే చాలా రకాలు కేవలం చేపల మీదే కాక కీటకాలు, ఇతర చిన్నజీవులని కూడా వేటాడి బతుకుతాయి. ఇది మాత్రం ఎప్పుడూ నీళ్ళు ఉన్నచోటే కొమ్మల మీదా, బండల మీదా, ఒక్కోసారి నీళ్ళలో ఉన్న చేపని చూస్తూ గాల్లో వున్నచొటే కదలకుండా ఎగురుతూ కనిపిస్తుంది.

మా యింటికి దగ్గర్లో ప్రవహించే పాంగ్-సువా కెనాల్ చుట్టుపక్కల అలా  కనిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా వర్షాలు పడి కాలవ నిండుగా ప్రవహిస్తున్నప్పుడు. అయితె, ఇప్పటి వరకూ అది చేపని పట్టేందుకు నీళ్ళ లోపలికి దూకి చేపతో పైకి రావటం ఇంతవరకూ చూడలేకపోయాను. ఆ అదృష్టం ఎప్పటికో!!

ఆంధ్రభోజుడి / తెలుగు వల్లభుడి పద్యంలో, కావ్యంలో చోటు దక్కించుకున్న ఈ పిట్ట పక్షిలోకానికి, తెలుగుభాషాప్రియులకి, తెలుగు ప్రకృతిప్రేమికులకీ సెలబ్రిటీయే!! ఇంతకీ మన సెలబ్రిటీ విల్‌ఫుల్ డిఫాల్టర్ తన ఎయిర్‌లైన్స్‌కి , బీరుకి లోగోగా వాడుకున్న కింగ్‌ఫిషర్ కూడా ఇదే.  బీర్ కింగ్ తెచ్చిన తలవంపులు రాయలవారిచ్చిన సెలబ్రిటీ స్టేటస్‌తోనైనా ఈ లకుముకి మర్చిపొగల్గుతుందని ఆశిద్దాం.

ఈ దేశంలో కనపడే దగ్గర దగ్గర పది రకాల లకుముకుల్లో నాకిప్పటి వరకూ నాలుగే కనిపించాయి. వాటిలో ఇది మూడోది.  నాలుగో దాన్ని కిందటి పోస్టులో చూపించాను. ఒకటి, రెండు రాబోయే వనవిహారాల్లో.

బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

🌳🦌వన🐾విహారం🌾🦋 – రాయలవారి 👑 🐥Kingfisher

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×