Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

హ్యాపీకార్తీకఏకాదశి+ఇందిరాగాంధీ  బర్త్ డే+ఇంటర్నేషనల్  మెన్స్ డే + ఇంటర్నేషనల్ టాయిలెట్ డే >>> అన్నీ ఇవాళే(ట)

ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే అని వ్వాట్సప్ లో మెసేజులు స్వైరవిహారం చేస్తుంటే ఇదేంటా అని వికీపీడియా చూశా. నిజమే 1991 నుంచీ జరుపు తున్నారు(ట). ఎందుకో తెలుసుకునే ఆసక్తీ, అవసరం రెండూ లేవు. సో, తెలుసుకోలేదు. కానీ దాని పక్కనే ఇవాళే ఇంటర్నేషనల్ టాయిలెట్ డే అని కూడా ఉండడంతో అదేంటా అని చూశా. అది మన స్వచ్ఛ భారత్ ప్రాజెక్టుకి ఇంచుమించు సరిసాటి(ట) ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓహో! అలాగా అనుకుంటుండగా గుర్తొచ్చింది, ఇవాళ ఇందిరాగాంధీ పుట్టినరోజు కూడానని. ఇంట్రెస్టింగ్ !! అనుకున్నా. అనుకున్నవన్నీ వాట్సాప్ లోకి ఎక్కించేశా . ఇంతలో వ్వాట్సాప్ లోనే ఓ మహాత్ముడు పెట్టిన పవిత్ర పుణ్య సందేశం – హ్యాపీ కార్తీక ఏకాదశి అని. ఇంకా హ్యాపీ శని త్రయోదశి , హ్యాపీ పోలాల అమావాస్య, హ్యాపీ మహాలయ పక్షమ్స్ , మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ తద్దినం …. వగైరా కూడా వస్తాయేమో అనుకోబోతూ లటుక్కున ఆ ఆలోచన ఆపేశాను, ఎందుకొచ్చిన గొడవ అని.
కానీ మంకీ మైండ్ ఊరికే ఉండదు కదా!! తెలుసుకున్న విషయాలన్నీ కలిపి చూడ్డం మొదలెట్టింది.
ఇంటర్నేషనల్ మెన్స్ డేని ప్రారంభించిన పెద్దమనిషి, జెరోమ్ తీలక్సింగ్**, అన్నాయన ఈ రోజు ప్రాముఖ్యతని ఇలా చెప్పాడు (ట ) – “the day ‘s activitees strive for gender equality and patiently attempt to remove the negative images and the stigma associated with men in our society.”

ఆయన మేల్-షావినిజానికి వ్యతిరేకి అనిపించేలా వున్నాయి కదూ ఆ మాటలు!?!

(** పేరు స్పెల్లింగుని బట్టీ ఈయనెవరో ఇండియన్ ఆరిజిన్ పెద్ద మనిషిలా వున్నాడు)

నేను తృప్తి దేశాయ్ సపోర్టర్ని కాదంటే కాదు. కానీ మనదేశంలో జెండర్ ఈక్వాలిటీ ఉందంటే మాత్రం నమ్మలేను. కాబట్టి ఈ డేని బాగా జరుపుకోవడం అవసరం అనిపించింది.

నెక్స్ట్, ఇందిరాగాంధీ బర్త్ డే. ఒకప్పుడు ఒకాయనెవరో – వాజ్-పాయా? ఏమో గుర్తులేదు – “కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే ఒక్క మగాడు , ఇందిరాగాంధీ,” అన్నాట్ట. అందులో పెద్ద సందేహం లేదని చాలామంది నిస్సందేహంగా చెప్పడం విన్నాను. అంచేత ఇంటర్నేషనల్ మెన్స్ డే రోజు భారతీయ మగమహారాజులు ఇందిరాగాంధీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నొక్కి చెప్తోంది ఈ నవంబర్ 19 అనిపించింది. అసలు జయలలిత కూడా ఈ రోజునే పుట్టి ఉంటే ఇంకా బావుండేదని మరీ మరీ అనుకున్నా. అనుకోకుండా ఎలా వుంటాం? మగ అరవ పొలిటీషియన్లు అరవడం మర్చిపోయి ఆవిడకి పొర్లుదండాలు పెట్టే సీన్లు చూశాక?

నెక్స్ట్ –

ఇంటర్నేషనల్ టాయిలెట్ డే. స్వచ్ఛ్ భారత్ కి ఇంటర్నేషనల్ వెర్షన్ అన్నాను కదా! మోడీ మేష్టారి కలలకి ప్రతీక అయినటువంటి ప్రాజెక్టుకి ఇంచుమించు సరిసాటి. కనక ఇదీ ముఖ్యమైన రోజే. జెండర్ ఈక్వాలిటీ మీద మోడీ మేష్టారి అభిప్రాయం ఏంటో బేటీ బచావో! బేటీ పడావో!! అనే ఒక్క స్లోగన్ తో చెప్పేహారు కదా! ఇప్పుడింక స్విస్ బ్యాంకుల్నించి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు పడగానే ఇంక దేశంలో బేటీలందర్నీ బచాయించడం, పడాయించడం షురూ అయిపోతుంది. ఏం భయం లేదు!!

ఇప్పుడింక (హ్యాపీ) కార్తీక ఏకాదశి గురించి. శివుడిని మించి జెండర్ ఈక్వాలిటీ పాటించేవాళ్ళు దేవుళ్ళల్లోనూ లేరు. అంచేత నవంబరు 19న వచ్చిన ఈ కార్తీక ఏకాదశి అర్ధనారీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని దేశంలో తెలిసికానీ, తెలీకుండా కానీ పురుషాహంకారం ప్రదర్శించే వాళ్లంతా గ్రహించవలసిన పుణ్యదినం. మళ్ళీ ఎన్నో ఏళ్ళక్కానీ రాదు.
కనుక-
డియర్ ఇండియన్ మెన్!!
ఈ రోజు శివపార్వతుల్ని పూజించి ఉపవాసం చేసి ఇందిరాగాంధీ అపరదుర్గ అయిన విధాన్ని తెలుసుకొని ఆపైన మీ గృహమున గల టాయిలెట్లను సవినయముగా, అహంకార రహితులై శుభ్రపరచుడు. అంతట తరతరాలుగా మీలో పేరుకుపోయిన పురుషాహంకారము నశించి, జన ధన్లు, స్లోగన్లు లేకపోయినా బేటీ బచావో, బేటీ పడావో సాకారమగును.

అన్నట్టు మరిచిపోయాను, ఈ సూచనలు తెలిసికానీ, తెలీకుండా కానీ పురుషాహంకారం వదిలేసిన వాళ్ళకి నాట్ అప్లికబుల్!!

అరే! ఇంకో ఇంపార్టెంట్ క్లూ ఇవ్వడం మర్చిపోయా! మనలో పురుషాహంకారం వుందో లేదో తెలిసేదెలా? తెలుసుకోడం చాలా ఈజీ!

ఈ టపా చదువుతుంటే నవ్వొస్తే పురుషాహంకారం లేనట్టు,

ఒళ్ళు మండిపోయి, జంధ్యాల సినిమాలో సుత్తి వీరభద్రరావుల్లా ఫీలైతే……

ఫిల్ ఇన్ ది బ్లాంక్

ఓకే! బై4నౌ

************************



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

హ్యాపీకార్తీకఏకాదశి+ఇందిరాగాంధీ  బర్త్ డే+ఇంటర్నేషనల్  మెన్స్ డే + ఇంటర్నేషనల్ టాయిలెట్ డే >>> అన్నీ ఇవాళే(ట)

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×