Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బ్రాహ్మణ విద్వేషం - Stop hate politics , Stop scapegoating brahmins !

బ్రాహ్మణ విద్వేషం పెంచి హిందువులను కులాల వారిగా విడగొట్టి, ఒకరిపై ఒకరికి విద్వేషం పెంచి, ఓట్లు చీల్చి, మందబుద్ధిగాడిని అందలం ఎక్కించాలని కొంతమంది, మతం మార్చాలని కొంత మంది, ఈ సందట్లో హడావిడి చేసి గొప్పోళ్ళయి పోవాలని, పబ్బం గడుపుకోవాలని ఇంకొంతమంది విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

కులాల మధ్య సామరస్యం సంస్కారం లేకపోతే ఇన్ని వందల సంవత్సరాలు భారతదేశంలో ఇలాంటి కట్టుబాటు ఎలా నిలబడుతుంది ?
వృత్తుల నుండి ఇప్పుడు మనం కులం అని పిలుస్తున్న ఒక కట్టుబాటు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒక రోజు హటాత్తుగా వచ్చేసి ఈ రోజు నుంచి నేను బ్రాహ్మడను, నువ్వు కమ్మ, నువ్వు రాజు, వాడు కాపు నువ్వు అంటరానివడివి అంటే ఊరుకుంటాడా ఎవడైనా?
అడవుల్లో గిరిజనుల్లా గుంపులుగా సంచారులుగా వేటాడుకుంటూ, బతికే వాళ్ళకి కులం ఎందుకు కావాలి? కండ బలం ఉంటే ఏ జంతువు నో వేటాడొ, ఏ చెట్టెక్కి కాయలు కోసుకుతినో బతికెయ్యొచ్చుగా?
యుద్ధాలు చేసి రాజెందుకు చావాలి? ఓడిపోతే వాడి కుటుంబం మొత్తం ఎందుకు జనం కోసం చచ్చిపోవాలి?
అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా కాపెందుకు కాపు కాయాలి? కమ్మ ఎందుకు ఒళ్ళు హూనం చేసుకు వ్యవసాయం చెయ్యాలి? అసలు కమ్మరి,కుమ్మరి,శెట్టి,పద్మశాలి,గౌడ ఇలా వృత్తులు ఎందుకు చెయ్యాలి?
చివరగా.. అడవిలో మనుగడకు అవసరమైన కండబలం, ఎండలో తిరిగి, కాయ కష్టం చేస్తే వచ్చే రోగనిరోదక శక్తీ వదులుకుని, మందు విందు పొందు తప్పు కాని రోజుల్లో మడి కట్టుకుని ఇంట్లో ముక్కుమూసుకుని కూర్చుని జపం చేసుకోవల్సిన పరిస్తితి బ్రాహ్మణుడికి ఎందుకు ? కొంత మంది పనికి మాలినోళ్ళ చేత సోమరిపోతులు అనిపించుకోడానికా?

1. మనిషి ప్రకృతి పరంగా ఒక జంతువు, తన ప్రాణానికి మించి ఏది ముఖ్యం కాదు అన్నది మనకు సహజ ప్రవృత్తిగా పుట్టుకతో వస్తుంది
2. తదనుగుణంగా బ్రతకడానికి కావాల్సిన తిండి, గూడు ప్రాముఖ్యం అవుతాయి
3. జంతువులకు మరణ భయం ఉంటుంది కానీ చావు అంటే అర్థం చేసుకునే ఆలోచనా శక్తి ఉండదు కాబట్టి అవి అంతరించిపోకుండా ప్రకృతి సంభోగం పిల్లల సం రక్షణ లాంటివి కూడా సహజ సిద్ధంగా వస్తాయి

ఈ మూడింటి గురించి కలిగే అభద్రతా భావాలను అధిగమించిడం కోసం, తరువాత స్తితిలో దైనందన జీవితం సుఖమయం చేసుకోవడం కోసం మనిషి సాంఘీకపరమైన కట్టుబాట్లు, ఆచారాలూ వృత్తులూ కనిపెట్టుకుంటూ వచ్చారు. ఇప్పటి మోడల్ విలేజ్ లా, స్వావలంబన కలిగిన వ్యవస్థ కోసం ప్రయత్నించారు. దానిలో భాగంగానే వృత్తుల కులాలు పుట్టాయి.
వ్యవసాయం ఒక పెద్ద శాస్త్రం, అది ఒకరి నుంచి ఒకరు, పని చేస్తూ నేర్చుకోవలసిందే ! ఎంతో ప్రేమాభిమానాలు ఉంటే తప్ప నేర్పించేవాళ్ళు నేర్చుకునే వాళ్ళకు కిటుకులతో సహా నేర్పించలేరు, అది మనవ సహజం. జ్ఞానం క్షీణించిపోకుండా ఉండాలని వృత్తుల కుటుంబాలు మొదలయ్యాయి. తండ్రి నుంచి కొడుక్కి, మామ నుంచి అల్లుడికి నైపుణ్యం అబ్బింది. ఇంట్ళో ఉండేవాడు మందు తాగితే 24 గంటలూ అదే పనిలో ఉంటాడు. పొలంలో పనిచేసేవాడి తిండి వేరే. ఆడవాళ్ళ పాత్ర 60% కన్నా ఎక్కువ, అది వేరే వ్యాసమే అవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కుటుంబం లో అందరూ మానసికం గా అందంగా, శారిరకంగా బలంగా ఉండాలంటే ఎం చెయ్యాలో ఎం తినాలో ఎలాంటి అలవాట్లు ఉండాలో అవి నిర్ణయించేది ఆడవాళ్ళే, అప్పటి ఆరెంపీ డాక్టర్లు.
కుల వృత్తులు, కుల పెళ్ళిళ్ళూ అలా పుట్టినవే.
కాల క్రమేణా ఒక గౌడ చెట్టు ఎక్కినట్టు ఒక కమ్మ వ్యవసాయం చేసినట్టు వేరే కులం వాళ్ళు చెయ్యలేకపోయారు. కులాలు మరింత బలంగా మరింత సమర్ధవంతంగా పనిచేశాయి. ఒకటో తరగతి నుంచి పీహెచ్ డీ దాకా చదివినట్టు నైపుణ్యం పెరిగిపోయింది. అలాగే వైద్యం, న్యాయం మొదలైన శాస్త్రాలు పుట్టుకొచ్చాయి.

మనం మాట్లాడుకున్న ముఖ్యమైన మూడు కీలక మైన అవసరాలు తీరిపోతే, నిబద్ధత లేని మనిషికి, ఈర్ష్య, దురాశ వంటివి ప్రకోపిస్తాయి. అటువంటి వారి వల్ల రాజ్యాల మధ్య, తెగల మధ్య, కులాల మధ్య, కుటుంబాల మధ్యా సమస్యలు మొదలయ్యాయి. అవి తీర్చడానికి అందరి కన్నా బలవంతుడు అవసరమయ్యాడు. కండబలం, మంది బలం, ధనబలం ఉన్నవాడు రాజయ్యాడు. బుద్ధిబలం కూడా తోడైతే మహా రాజయ్యాడు.
ఇక కళలు- సంగితం, చిత్రలేఖనం లాంటివి ఊపందుకున్నాయి. వ్యాపారం చేసే కోమట్లూ వచ్చారు.
ఇన్ని కులాలు ఇంత నైపుణ్యం ఇంత జ్ణానం ఒక్క ప్రకృతి వైపరిత్యం తోనో, మహమ్మారి తోనో యుద్ధం తోనో తుడిచి పెట్టుకుపోకూడదని, అంచేలంచలుగా ఎదగాలనే సదుద్దేశంతో ఒక లైబ్రెరియన్లా బ్రహ్మణులను స్రుష్టించారు. అంతవరకు ఉన్న జ్ఞానాన్నంతా వేదాలుగా విభజించి, అవి పతనమవ్వకుండా వేద విధ్యా విధానం స్రుష్టించి, అంత పెద్ద జ్ఞాన భాండారాన్ని దేశం నలుమూలలా వ్యాపింప చేశారు బ్రాహ్మణులు. రాజ్యం రాజు దెగ్గర, వ్యవసాయం కమ్మ దెగ్గర అలా ఎవరి వృత్తులు వారి దెగ్గర ఉన్నట్టే విద్య బ్రాహ్మణుల దెగ్గర ఉండి పోయింది. ఐతే లక్ష్మి, విద్య ఒక చోట ఉండకూడదు, ఒక్కరికే బలం ఎక్కువ అయ్యిపోతుంది అని, బ్రాహ్మణులను ధన సముపార్జన పై మక్కువ చూపకుండా, రాజ్యాలు ఏల కుండా, విద్య పై శ్రద్ధ పోకుండా ఉండటానికి కావాల్సిన కట్టడులన్నీ కూడా చేసారు. బ్రాహ్మణులు స్వేచ్చ కోల్పోయారు.
ఒక్క సంవత్సరం పాటు 6 సబ్జక్టులు, టెక్స్త్ బుక్, నోట్ బుక్, హోం వర్క్, వర్క్ షీట్స్, ట్యూషన్స్ అని సదుపాయాలు కల్పిస్తే 100 కి 50 మందికి కుడా 100 రావు.
లక్షల స్లోకాల వేదాలు ఆపై ఉపనిషత్తులు పురాణాలు, సహశ్రావధానాలు కేవలం విని, గుర్తు పెట్టుకుని, మళ్ళీ చదివి వాటి మిద మళ్ళీ వాఖ్యానాలు రాసి బ్రాహ్మణులు ఎంత కష్టపడుంటారు?
ఇన్ని చేసినా అధికార దుర్వినియోగం అన్ని కులాల్లోనూ జరిగింది, స్వార్ధపరులైన వాళ్ళు ఒక్క కులం లోనే పుట్టాలని ఏమి లేదు. ఎవ్వరికి తోచింది వాళ్ళు చేసుకున్నారు.
అలాంటి వారి వల్లా, పరాయి పాలన వల్లా మన వృత్తులు ఎదగలేదు, మరుగున పడి పోయాయి, మన వేదాలు అక్కడే ఉండి పోయాయి. వాటి విలువ పడిపోయి కొత్త సాంకేతిక విద్య విలువ పెరిగింది, విద్యకు అధిపతులుగా కొన్నాళ్ళు బ్రహ్మణులు సాంకేతిక విద్య నేర్చుకున్నా తరువాత కాలం లో అది పోయింది, రాజుల రజ్యాలు పోయాయి, భూపతుల భూములు ప్రభుత్వాలకు వెళ్ళాయి.
ఈ మొత్తం లో ఏ ఒక్క కులం ని ఎలా తప్పు పడతాం? తిలా పాపం తలా పిడికెడు.
మా తాతలు చెప్పులు మోశారు, మీరు ఇప్పుడు అనుభవించండి అంటే అది ఎలా న్యాయం? మా తాతలు కష్టపడ్డారు, అందరి తాతలు అప్పటి కాలానికి సరిపడ కష్టపడ్డారు.

హిందువులు ఇలా అనవసరంగా ఒకరినొకరు చులకన చేసుకుంటే మనం కూర్చున్న కొమ్మ మనమే నరుక్కున్నట్టు ! జరిగిపోయినదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అందరికీ జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించాలి. చెప్పుడు మాటలు విని తప్పుడు వాళ్లను సమర్ధిస్తే అందరికీ నష్టమే ! ఏదైనా కులాన్ని కించపరిచే లా మాట్లాడేటప్పుడు ఒక్క సారి అలోచించండి. అందరిని కలిపి అనొద్దు. అసలు కుల ప్రస్తావనే వద్దు. కాలం మారిపోయింది ఇవాళ కాకపోతే రేపైనా ఈ కులాలు పూర్తిగా పోతాయి. లోకువయ్యిపోతే మత్రం మన అస్తుత్వమే పోతుంది, మన భారత సంప్రదాయాలు, కళలు, ఆచారాలు గొప్పవి., కాని శాస్త్రీయ సంగీతంలో ఫ్యూజన్ వచ్చినట్టు కొన్ని మార్పులు జరగాలి అవి సమ్యమనం తో మార్చుకుంటే సరిపోతుంది. పాత వారిని వదిలెయ్యండి, మన జనరేషన్లో దురాచారాలు పాటించేవారు ఎవరూ ఉండరు.


This post first appeared on Thought Is Life, please read the originial post: here

Share the post

బ్రాహ్మణ విద్వేషం - Stop hate politics , Stop scapegoating brahmins !

×

Subscribe to Thought Is Life

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×