Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రెడ్ కోసం ఎగబడుతున్న ఓటీటీలు

Tags: agravedeg

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో రామ్ దిమ్మతిరిగే సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించిన రామ్, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు. రెడ్ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న రామ్, ఇందులో డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కాగా ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా వైరస్ కారణంగా అది వాయిదా పడింది.

ఇక ప్రస్తుతం ఓటీటీలకు అదిరిపోయే ఆదరణ లభిస్తుండటంతో నిర్మాతలు తమ సినిమాలను ఇందులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ రెడ్‌కు గతంలోనే రూ.20 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినా సినిమాను అమ్మలేదు. కాగా తాజాగా రూ.30 కోట్ల భారీ ఆఫర్ రావడంతో రెడ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనే సందేహం సర్వత్రా నెలకొంది. మరి ఈ సినిమాను నిర్మాత స్రవంతి రవికిషోర్ ఓటీటీలో రిలీజ్ చేస్తాడా లేక థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి.



This post first appeared on Telugu Latest News Headlines, please read the originial post: here

Share the post

రెడ్ కోసం ఎగబడుతున్న ఓటీటీలు

×

Subscribe to Telugu Latest News Headlines

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×