Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Loss of smell

కరోనా వైరస్ రోజుకో రూపం తీసుకుంటున్నట్లే రోజుకో కొత్త సమస్య వస్తోంది. కోవిడ్ వచ్చిన మొదట్లో వాసన తెలియదనే అనుకున్నాం. ఇప్పుడా సమస్యకుతోడు వాసనే కాదు మంచి వాసనలు కూడా చెడు వాసనలుగా అనిపిస్తున్నయని చెబుతున్నారు కొందరు పేషెంట్స్, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వైరస్ చచ్చినా దాని పీడ వదలట్లేదు. వైరస్ తెచ్చిన వింత వికారాన్ని వదిలించుకునేది ఎలాగో డాక్టర్ రఫీ చెబుతున్నారు.

కరోనా వైరస్‌ మన ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుందని తొలిరోజుల్లోనే తెలిసిపోయింది. అయితే ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ వల్ల ‘ముక్కులోకూడా ప్రభావం ఉంటుందని తర్వాత కాలంలో దాక్టర్లు గుర్తించారు. కోవిడ్‌ వచ్చిపోయి నెలలు ‘అవుతున్నాఆనాడీ కణాల సమస్య్ మాత్రం పోవట్లేదని కోలుకున్నవాళ్ల సమస్యలను గుర్తించాక చెబుతున్నారు.

నాడీ కణాలపై దాడి

కోవిడ్‌ పేషెంట్స్‌లో 30శాతం మంది వాసన పసిగట్టలేకపోతున్నారు. ఇలా జరగదానికి కారణం. ముక్కునాడీ కణాలు దెబ్బతినడమే. వైరస్‌ ఎఫెక్ట్‌ తో అవిపాడవుతాయి. చాలా రకాల జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. ఇలా వాసనతెలియకపోవదాన్ని ‘ఎనాస్మియా’ అంటారు. ఈ ఎనాస్మియా రావడానికి కారణం ఏదైనా కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోతుంది. తర్వాత సాధారణ పరిస్థితే ఉంటుంది. అయితే కోవిడ్‌ సోకిన వాళ్లలో సమస్య పెరాస్మియాగా మారిపోతోంది. ఎనాస్మియాని భరించడం కష్టం కాదు. కానీ పెరాస్మియా అలాకాదు… కోవిడ్‌ ఎంత ఇబ్బంది. పెట్టిందో అంత ఇబ్బందిపెదుతోందని పేషెంట్స్‌ అంటున్నారు. ఎనాస్మియా సమస్యతో బాధపడేవాళ్లు పదార్థాల వాసన మాత్రమే గుర్తించలేరు. తినడానికి, నిద్రపోవడానికి, పనులు చేసుకోవడానికి ఈసమస్య వల్లఏ ఇబ్బందీ ఉండదు.కానీ పెరాస్మియా అలా కాదు. ముక్కులోని నాడీ కణాలు దెబ్బతినడంవల్ల సాధారణంగా అసౌకర్యంకలిగించే వాసన తగిలాయంటే తట్టుకోలేరు. ఇక డ్రైనేజీ, కుళ్లిపోయిన పదార్థాలు కొన్నిరసాయనాల వాసనలు ముక్కుకి తగిలిందంటే భరించలేరు. కడుపులో తిప్పుతుంది. వాంతులు అవుతాయి. ఏ పనీ చేయలేరు. గాలిలో ఉండే పాగ, ఇతర పొల్యూషన్స్‌ వల్ల ఉండే సమస్య ఇతరులకంటే వీళ్లలో ఎక్కువగా. ఉంటుంది. అందువల్ల పనులు చేయలేరు. ఫుడ్‌ వాసన కూడా వీళ్లలో వికారం కలిగించవచ్చు. శానిటైజర్స్‌ వాసనకు కూడా వాంతులు వస్తాయి. టానిక్‌, మెడిసిన్స్‌ వాసన కూడా భరించలేరు. వాంతి చేసుకుంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. కొన్ని రోజుల్లో ఆ నాడీ కణాలు మెరుగవుతాయి. అంది అందరిలో ఒకే తీరుగా ఉండదు. కాబట్టి, ఇన్ని రోజులకు పరిస్థితి మామూలుగా అవుతుందనిచెప్పలేం.

 మూడు వికారాలు

పెరాస్మియా లక్షణాలు అందరిలో ఒకేలాగా. లేవు.కోవిడ్‌ బారిన పడిన వాళ్లలో 15శాతం మంది మాత్రమే పెరాన్మియా సమస్యను. ఎదుర్కొంటున్నారు. కోవిడ్‌ సోకినప్పుడు వాసన గుర్తించలేకపోయినవాళ్ల(ఎనాస్మియా)లో కొందరిలో అదితగ్గిన వెంటనే పెరాస్మియా (సాధారణమైన చెడు వాసన భరించలేని స్థితితో బాధపడుతున్నారు. మరికొంతమందిలో కోవిడ్‌ వచ్చినప్పుడు. ఎనాస్మియా ఉంటుంది. ఎనాస్మియా సమస్య పోయి. వాసనలు సరిగానే గుర్తించే స్థితికి వస్తున్నారు. కొన్ని రోజులు లేదా నెలల తర్వాత పెరాస్మియా సమస్య సదెన్‌గా వస్తుంది. కొన్నిఅరుదైన కేసుల్లో కోవిడ్‌ వచ్చినప్పుడు వాసన బాగానే తెలుస్తుందంటున్నారు. కోవిడ్‌ తగ్గిన కొన్నినెలల తర్వాత పెరాస్మియా. సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇలా మూడు రకాలుగా. ఇబ్బంది పడుతున్న పెరాస్మియా రోగులందరూ. వాంతులు, వికారం, తినలేకపోవడం,పనులు సరిగా. చేయలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది. పడుతున్నారు. మనదగ్గర పేషెంట్స్‌లో,మన వాతావరణంలో 10నుంచి 15 శాతం మందిలో ఈ సింప్టమ్స్‌ ఉంటున్నాయని చెబుతున్నారు. పెరాస్మియా సమస్య ఉంటే. కిచెన్‌లో ఘుమఘుమలతో నోరూరించే వంటకాన్నికూడా తినలేరు. ఒకవేళ తిన్నావికారం అనిపించి వాంతి చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు. దాక్టర్‌ సలహాతోవాంతి కాకుండా మందులు తీసుకోవాలి. వికారం ఉన్నా,వాంతి అయినా వెంటనే అది పెరాస్మియాగా గుర్తించాలి. సొంతంగా మందులు వాడకుందా దాక్టర్‌ సలహాతో మెడిసిన్స్‌ తీసుకుంటే వాంతులు కంట్రోల్‌ అవుతాయి.

యువతలోనే ఎక్కువ

ఎనాస్మియా సమస్య కోవిడ్‌ బారిన పడిన యువతలోనే ఎక్కువగా ఉంది. కొందరికి శ్వాస సమస్యలు ఉండవు. ఒళ్లు నొప్పులు ఉండవు. కానీ వాసన తెలియట్లేదని అంటారు. వీళ్లు కోవిడ్‌ నుంచి తొందరగా కోలుకుంటారు. కానీ, తర్వాత పెరాస్మియా సమస్యతో బాధపడొచ్చు. కోవిడ్‌ నుంచి కోలుకున్నయువతకాస్త జాగ్రత్తగానే ఉండాలి

తగ్గడానికి టైమ్ పట్టొచ్చు !

కొంత మందిలో ఎనాస్మియా లేకుండానే కొన్నాళ్లకు పెరాస్మియా వస్తుంది. వీటి మీద స్టడీ జరగాలి. కోవిడ్ పేషెంట్లో వచ్చే పెరాస్మియా, ఎనాస్మియా సమస్యలు ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా ఉన్నాయి. దీనిమీద ఇప్పుడే స్టడీ జరుగుతోంది. మన వాతావరణం లో దుమ్ము, ధూళి, రసాయనాలు, మలినాలు ఎక్కువ. వాటికి అలవాటుపడ్డాం కాబట్టి మనవాళ్లు విదేశీయులంత తీవ్రంగా ఇబ్బంది పడరు. పెరాస్మియా సమస్య ఎక్కువ మందిలో 3 వారాల్లోనే పోతోంది. కొందరిలో 3 నుంచి 6 నెలలు పడుతోంది. అరుదైన కేసుల్లో ఏడాది వరకు ఉంటోంది.

వికారానికి విరుగుడు:

  •  వికారం, వాంతులు తగ్గించే మందులు అవసరాన్ని బట్టి వాడాలి.
  • ఓపెన్ ఎయిర్ ప్లేలో ఉండాలి.
  •  బయటి నుంచి ఇంటికి వచ్చాక శానిటైజర్
  •  వాడే బదులు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. SMELL
  •  బాత్ రూమ్ లో ఎయిర్ ఫ్రెషనర్స్ తీసేయాలి.
  •  ఇంట్లో దోమల నివారణకు వాడే కాయిల్స్, వేప వాడొద్దు. దోమతెరలు వాడాలి.
  •  పెర్‌ఫ్యూమ్స్, డియోడరెంట్స్ మానేయాలి.
  •  ఇల్లు, ఆఫీసుల్లో ఇది వరకటి కంటే ఎక్కువ శుభ్రంగా ఉండేలా ఉంచుకోవాలి.
  •   గదిలో గాలి మారేలా చూసుకోవాలి.

The post Loss of Smell appeared first on .



This post first appeared on 5 Cancers That Afflict Children, please read the originial post: here

Share the post

Loss of smell

×

Subscribe to 5 Cancers That Afflict Children

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×